ABP Desam


వాస్తు టిప్స్: వాల్ క్లాక్‌ని ఈవైపు అస్సలు పెట్టొద్దు!


ABP Desam


గడియారం పెట్టేందుకు వాస్తు టిప్స్ ఫాలోకావాలంటారు వాస్తు నిపుణులు.


ABP Desam


వాల్ క్లాక్‌ని తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు వేలాడదీయవద్దు అని వాస్తుశాస్త్రం చెబుతోంది.


ABP Desam


ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే… ఆ వాల్ క్లాక్ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. ఆ ఇంట్లో మనస్శాంతి ఉండదు. అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు


ABP Desam


వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిన, విరిగిన, పగిలిన, పాడైన, చిరిగిన, దెబ్బతిన్న వాచీలు, వాల్ క్లాక్‌లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీ లైఫ్ లో సంతోషం ఆగిపోతుందని చెబుతారు


ABP Desam


క్లాక్ ఆగిపోవడం అంటే మీ జీవితం ఆగిపోవడం అని అర్థం. ఆగిన క్లాక్ లు ఇంట్లో ఉంటే మీరు తలపెట్టిన ఏ పనీ పూర్తవదు.


ABP Desam


గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది


ABP Desam


ఉత్తరం దిశ కుబేరుడు, వినాయకుడి దిశగా పరిగణిస్తారు అందుకే ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం ఎంతో శుభప్రదం


ABP Desam


తూర్పువైపు చెక్క గడియారం వేలాడదీస్తే ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది


ABP Desam


వాస్తు శాస్త్రం ప్రకారం గోడగడియారం ఎప్పుడూ కూడా దక్షిణ దిశ గోడ వైపు పెట్టకూడదు.


ABP Desam


దక్షిణం దిక్కు స్థిరత్వానికి దిక్కు. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. అదే సమయంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు.


ABP Desam


నోట్: వాస్తు పండితుల నుంచి తెలుసుకున్నవి, కొన్ని పుస్తకాల ఆధారంగా తీసుకున్న వివరాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం... (Images Credit: Pinterest)