News
News
X

Karthika Deepam జులై 13 ఎపిసోడ్ 1403: క్లైమాక్స్ కి చేరుతున్న 'కార్తీకదీపం', వీడిపోతున్న చిక్కుముడులు - హిమ-శౌర్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నడాక్టర్ సాబ్

Karthika Deepam july 13 Episode 1403: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 13 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam july 13 Episode 1403)

చంద్రమ్మకి కడపునొప్పి రావడంతో హాస్పిటల్ కి తీుసుకొస్తాడు ఇంద్రుడు. హాస్పిటల్ కి వచ్చేవరకూ కాల్ చేయవా బాబాయ్ అంటుంది జ్వాల(శౌర్య). ఇంతలో లోపలి నుంచి చంద్రమ్మని తీసుకుని బయటకు వస్తుంది డాక్టర్ హిమ. పిన్ని కడుపునొప్పితో బాధపడుతుండగా ఈ డాక్టరమ్మ ఇంటికొచ్చి దగ్గర్లో ఉన్న ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చిందని చెబుతాడు చంద్రుడు. ప్రాణాలు తీసేవారితో ట్రీట్మెంట్ చేయించావేంటి బాబాయ్ అని కోపంగా వెళ్లిపోతుంటుంది  శౌర్య.
హిమ: శౌర్య నీతోమాట్లాడదామని ఇంటికొచ్చాను అప్పుడే పిన్ని కడుపునొప్పితో బాధపడుతుండడం చూసి ఇక్కడకు తీసుకొచ్చాను
శౌర్య: శోభ మొత్తం నీ గురించి చెప్పింది
హిమ: శోభను నమ్మొద్దు..అదో మోసకారి...
శౌర్య: పులి నీతులు చెబుతున్నట్టుంది..నాకు మంచి చేస్తానని నమ్మించి క్యాన్సర్ డ్రామా ఆడావ్
హిమ: ఏం చేసినా నీ మంచి కోసమే
శౌర్య: కొత్త కొత్త డ్రామాలు వద్దు..ఇంకేం మిగిలింది నా ప్రాణం తప్ప. నువ్వు అబద్దం, నీ ప్రేమ అబద్ధం...చిరునవ్వుల వెనుక మోసాన్ని పసిగట్టలేకపోయాను. నీ కన్నా శోభే నయం నిజాలు చెబుతుంది...
హిమ: నా మాటలు ప్రశాంతంగా విను...నాకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పాను..అలాగైనా నిరుపమ్ బావ నిన్ను.....
శౌర్య: నన్ను శాశ్వతంగా మార్చిపోయిన నిన్ను పెళ్లిచేసుకుంటాడని ప్లాన్ చేశావ్
హిమ: ఒక్కసారి నామాట విను...నీకు శోభ గురించి పూర్తిగా తెలియదు..
శౌర్య: నువ్వు అసలు నన్ను ముట్టుకోకు...నాకు కంపరంగా ఉంది...
హిమ: శౌర్య ఆగు అన్నా వెళ్లిపోతుంది... అయ్యో నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావ్...

Also Read:  తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !

ఇంట్లో కార్తీక్-దీప ఫొటో పక్కన హిమ-శౌర్య ఫొటో పెడుతుంది సౌందర్య. వీళ్లిద్దర్నీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అంటూ వస్తాడు ఆనందరావు. చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నానంటాడు. ఈ ఫొటో నీకెక్కడిది అని ఆనందరావు అడిగితే...ఎప్పుడో తీయించుకున్నది హిమ దాచుకుంది అది ప్రింట్ వేయించి తీసుకొచ్చాను అంటుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది స్వప్న
స్వప్న: ఇన్నాళ్లూ దాన్ని నెత్తికి ఎక్కించుకున్నారు..ఇప్పుడు దాని ఫొటో ఇంట్లో పెట్టారు...
సౌందర్య: అమ్మా నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా
స్వప్న: హిమకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి నా కొడుకుని మోసం చేసింది... వాడేమో దానివెనుక ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నాడు..
సౌందర్య: దానికి క్యాన్సర్ లేదని చెబితే సంతోషించాలి కానీ బాధపడుతున్నావేంటి
స్వప్న: ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అంటే...క్యాన్సర్ డ్రామా ఆడినట్టుంది నీ మనవరాలు. ఇప్పుడు ఈ ఫొటో పెట్టుకుని మరొక డ్రామాకి తెరతీస్తున్నారా...
సౌందర్య: ఈ జ్వాల ఎవరో కాదు...మన శౌర్యే...
స్వప్న: ఈ లెక్కన నా కొడుకు వెంట నీ ఇద్దరి మనవరాళ్లు ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతున్నారన్నమాట. జ్వాల అయినా, శౌర్య అయినా నాకు అనవసరం నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అర్హత వీళ్లిద్దరీ లేదు. నిరుపమ్ తో పెళ్లికోసమే క్యాన్సర్ డ్రామా ఆడారు...మీరెంత ప్రయత్నం చేసినా ఈ పెళ్లిని ఆపేస్తాను..
సౌందర్య: శుభలేఖల వరకూ వచ్చిన పెళ్లిని ఆపుతానంటావేంటి
స్వప్న: పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోతోంది..ఇదేం లెక్కకాదు..నిరుపమ్ పెళ్లి శోభతోనే జరుగుతుంది...

Also Read: ఇరువురి భామల మధ్య ఈగో మాస్టర్ - వసుని నెట్టేసిన గర్వంలో సాక్షి, బుంగమూతి పెట్టిన వసుని రిషి బుజ్జగిస్తాడా!

ప్రేమ్: హిమ గురించి ఆలోచిస్తుంటాడు. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఓ వైపు నిరుపమ్ తో హిమ పెళ్లి ఫిక్సైంది, మరోవైపు హిమ సంతోషంగా కనిపించడం లేదు...అసలు ఏమై ఉంటుంది...హిమ మనసులో ఏముందో తెలుసుకుంటే నా సమస్యకు చిక్కుముడి వీడుతుంది ఏం చేయాలి. హిమపై ఉన్న ప్రేమను చంపుకున్నానా, హిమకు నిరుపమ్ తో పెళ్లి అనగానే వెనకడుగు వేశానా...హిమ మనసులో ఏముందో తెలుసుకుంటే కానీ వీటికి పరిష్కారం దొరకదు  అనుకుంటాడు

నిరుపమ్: వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి
స్వప్న: కొత్తగా తింటున్నట్టు ఇలా మాట్లాడుతున్నావ్...
నిరుపమ్: నా పెళ్లి కాగానే నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాను....నేను హిమ వంటచేస్తాం..నాన్న నువ్వు హ్యాపీగా ఉండండి
స్వప్న: హిమకు క్యాన్సర్ లేదని తెలిస్తే వెంటనే వెళ్లి తాళికట్టేస్తాడేమో...హిమ విషయం చెప్పకుండా ఉండటమే మంచిది
నిరుపమ్: డాడీ, ప్రేమ్ ఎక్కడ
స్వప్న: బయటకు వెళ్లారు
నిరుపమ్: వాళ్లకి పెళ్లి పనులు అప్పగించు
స్వప్న: ప్రతి మాటని పెళ్లికి ముడిపెడతావేంటి...నువ్వంటే ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది..ఎందుకు ఇంకా హిమ హిమ అని కలవరిస్తావ్
నిరుపమ్: నీకు తెలియని విషయం ఏంటంటే హిమకు నేనంటే చాలా ఇష్టం...
స్వప్న: ఎవరు చెప్పారు
నిరుపమ్: ప్రేమంటే చెప్పేది కాదు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. పిచ్చిదానిలా జ్వాలని పెళ్లిచేసుకోమని చెబుతోంది కానీ నాక్కానీ కోపం వచ్చిందంటే హిమ మెళ్లో తాళి కట్టేస్తాను
స్వప్న: అంతపని చేయకు.. తనకు ఇష్టం ఉందంటున్నావ్..జ్వాలని పెళ్లిచేసుకోమని అంటోంది అన్నావ్...ఇదంతా అవసరమా
నిరుపమ్: మమ్మీ నువ్వు ఇంకోసారి ఆమాట అనొద్దు..
స్వప్న: జ్వాల వెంటే అంతా ఎందుకు పడుతున్నారో తెలుసా... ఆ జ్వాల ఎవరో కాదు ఇంట్లోంచి వెళ్లిపోయిన శౌర్య... 
నిరుపమ్: షాక్ అయిన నిరుపమ్ ఇదంతా నిజమా... నువ్వేదో కోపంతో చెబుతున్నావ్...
స్వప్న: కోపం, నోటి దురుసుతనం ఎక్కువ కావొచ్చు కానీ నీతో అబద్ధం ఎందుకు చెబుతాను...
నిరుపమ్: జ్వాల...శౌర్య అవడం ఏంటి..అందరికీ తెలిసి కూడా ఇంత చేశారా...శౌర్య జ్వాల అయినా జ్వాల శౌర్య అయినా నాకు తేడా ఏంటి..హిమపై అభిప్రాయం ఎప్పటికీ మారదు.
వీడికి ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు వీడు పూర్తిగా హిమ మాయలో మునిగిపోయాడు అనుకుంటుంది స్వప్న....

Also Read:  సౌందర్య ఆనందరావు దగ్గరకు చేరిన శౌర్య (జ్వాల), ఇంట్లో కనిపించని హిమ - మరింత పెరిగిన శోభ పైశాచికత్వం

శౌర్య ఎప్పుడొస్తుందా అని సౌందర్య, ఆనందరావు, హిమ ఎదురుచూస్తుంటారు. వస్తుందో రాదో అని హిమ టెన్షన్ పడుతుండగా ఆటో వచ్చి ఇంటిముందు ఆగుతుంది.  శౌర్య కోసం హిమ హారతి తీసుకొస్తుంది. నాకు ఇలాంటివి నచ్చవ్ అని శౌర్య అంటే..నా సంతోషం కోసం అమ్మా అంటాడు ఆనందరావు. 
శౌర్య: తాతయ్య నీపై గౌరవంతోనే ఈ ఇంట్లో ఉంటాను...కొందరిపై కోపం తగ్గే ప్రసక్తే లేదు..నా పద్దతి నాదే, ఆ నాటో నాదే, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను.  ఎవరైనా ఎదురుచెబితే మరుక్షణమే వెళ్లిపోతాను...
హిమ చేతిలో హారతి సౌందర్య తీసుకుని శౌర్యని లోపలకు ఆహ్వానిస్తుంది...
ఆనందరావు: నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వొచ్చావ్...ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది..నాకు ఇంకేం వద్దు...
శౌర్య: రమ్మన్నారు వచ్చాను..మళ్లీ ఎందుకు బాధపడతారు..
ఆనందరావు: బాధ కాదు ఆనందంతో వచ్చే కన్నీళ్లివి....
ఎపిసోడ్ ముగిసింది....

Published at : 13 Jul 2022 08:28 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 13 Episode 1403

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!