Guppedantha Manasu జులై 12 ఎపిసోడ్: ఇరువురి భామల మధ్య ఈగో మాస్టర్ - వసుని నెట్టేసిన గర్వంలో సాక్షి, బుంగమూతి పెట్టిన వసుని రిషి బుజ్జగిస్తాడా!
Guppedantha Manasu July 12 Episode 500:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 12 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 12 Episode 500)
కాలేజీలో మీటింగ్ తో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది... మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మనల్ని ముందుకు నడిపిస్తోంది..దీనికి మినిస్టర్ గారి సహకారం ఎప్పటికీ మరువలేనిది డీబీఎస్టీ కాలేజీ విద్యాసంస్థగా కాకుండా సేవా సంస్థగా మారింది అని రిషి స్పీచ్ ఇస్తాడు. ఇప్పుడు వేయబోయే అడుగు అతి ముఖ్యమైనంది. ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో అందర్నీ పిలిచి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం...దీనికి చదువుల పండుగ అని పేరు పెట్టుకుందాం అంటాడు. అంతా చప్పట్లు కొడతారు. మేడం ఆ ఫైల్ ఇవ్వండి అని అడుగుతాడు రిషి. వసు ఫైల్ ఇవ్వు అని జగతి అడిగితే ఆ ఫైల్ మిస్సైంది అంటుంది వసుధార. మీరు ఆ ఫైల్ పంపించండి అని రిషి చెబుతాడు..సారీ మేడం అంటుంది వసుధార. ఇంతలో ఆ ఫైల్ తీసుకుని లోపలకు అడుగుపెడుతుంది సాక్షి. ( సాక్షి ఎందుకొచ్చింది అని వసుధార, జగతి అనుకుంటారు)
సాక్షి: విత్ యువర్ పర్మిషన్ నేను ఈ మీటింగ్ లో కూర్చోవచ్చా
వసు: కచ్చితంగా రిషి సార్ వద్దంటారు
రిషి: రా సాక్షి.. ( వసు షాక్ అవుతుంది).
సాక్షి: అందరికీ నమస్కారం..కాలేజీకి సంబంధం లేకుండా నేను రావడం కరెక్ట్ కాదు కానీ ఈ మీటింగ్ గురించి తెలిసింది..నేను కూడా కొన్ని ఐడియాస్ తో వచ్చాను. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో వాలంటీర్ గా వర్క్ చేస్తాను..నాకూ అవకాశం కల్పించు...
( మేడం ఏంటి ఇదంతా అని వసు - సాక్షి ఏదైనా కొత్త ప్లాన్ తో వచ్చిందా అని మహేంద్ర- సాక్షి కచ్చితంగా ఏదైనా ప్లాన్ చేసి ఉంటుంది అని వసుధార అనుకుంటారు)
Also Read: తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !
రిషి: మీరంతా ఓకే అంటే సాక్షిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటాను...డాడ్ మీరేమంటారు....
నాకు ఓకే అని మహేంద్ర అనడంతో మిగిలిన వాళ్లు కూడా ఓకే అంటారు...అందరూ చెప్పాక వసుధారకి తప్పదు...
సాక్షి: నా దగ్గర ఓ ఐడియా ఉందంటూ తను ఏం చెప్పాలి అనుకుందో చెబుతుంటుంది...
ఏం జరుగుతోందో నాకు అర్థంకావడం లేదని జగతి - సాక్షి అంటే పడని వాడు సాక్షితో ఇంత బాగున్నాడేంటి అని మహేంద్ర సైగలు చేసుకుంటారు
మిస్సైన ఫైల్ తీసుకుని ఐడియాస్ కాపి కొట్టి వాటిని సాక్షి ప్రజెంట్ చేస్తుంది... అసలు విషయం తెలియని రిషి వెరీ గుడ్ సాక్షి అంటాడు. నువ్వు చెప్పినట్టు మార్పులు చేసి ప్లాన్ చేద్దాం అంటాడు.
( వసుని ఫైల్ ప్రిపేర్ చేయమన్నాను తను తీసుకురాలేదు అనుకుంటుంది జగతి)
(నాపై కోపంతోనే సాక్షి ఆలోచనకు ఓకే అన్నరు అంతే కదా అనుకుంటుంది వసుధార)
(ఈ విధంగా అయినా సాక్షి మైండ్ డైవర్ట్ అవుతుందని ఆలోచిస్తాడు రిషి)
జగతి: ఏంటి వసు...ఈ మధ్య నువ్వు...ఇంతకుముందులా చురుగ్గా లేవు...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం ఫైల్ అడిగాను మీటింగ్ లో నువ్వు ఇవ్వలేదు
వసు: నేను ప్రింట్ తీసి పెట్టాను అది కనిపించకుండా పోయింది
జగతి: జీవితంలో ప్లానింగ్ చాలా ముఖ్యం...జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని నీకుంటే మర్చిపోయాను, మిస్సైంది లాంటి మాటలు మాట్లాడొద్దు...
వసు: నేను కరెక్ట్ గానే ఉన్నాను
జగతి: నిన్ను నేను గమనిస్తున్నాను...ఈ మధ్య నువ్వు సరిగా ఉండడం లేదు...నీ తప్పు వల్ల ఇతరులకు నష్టం కలిగితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఈ మీటింగ్, ఫైల్, ప్రాజెక్ట్ రిషికి చాలా ఇంపార్టెంట్...నువ్వు మర్చిపోయినా పొరపాటు చేసినా ఆ నష్టం రిషికి జరుగుతుంది..
వసు: ఆ ఫైల్ ఎలా మిస్సైందో నాకు అర్థం కావడం లేదు...
( ఇదంతా విన్న సాక్షి...నువ్వు తయారు చేసిన ఫైల్ కొట్టేసి..ఆ కంటెంట్ తో రిషి దగ్గర మార్కులు కొట్టేశాను - నేను నా స్టైల్ మార్చుకున్నాను- నిన్ను ద్వేషిస్తూ రిషికి దూరమయ్యే కన్నా నీతో మాట్లాడుతూ రిషికి దగ్గరవాలని ప్లాన్ చేసుకున్నాను- నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది- నీకు తెలియకుండా నీ తెలివి తేటల్ని ఎలా వాడుకుంటానో చూస్తుండు)
Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి
కాలేజీ నుంచి బయటకు వచ్చిన రిషి...ఏంటి సాక్షి నువ్వు వెళ్లలేదా అంటాడు...
అందరూ వెళ్లిపోయారు కదా లాక్ చేయి అని అటెండర్ కు చెబుతాడు రిషి...ఇంకా వసుధార ఉంది సార్ అంటాడు...
రిషితో నేను వెళ్లాలి అనుకున్నాను కదా వసు ఉంటే ఎలా అనుకున్న సాక్షి... క్యాబ్ బుక్ చేసి వసుని పంపించాలని ప్లాన్ చేస్తుంది...
అప్పుడే అక్కడకు వచ్చిన వసుధార..సాక్షి ఇక్కడే ఉందా అనుకుంటుంది...
సాక్షి: నువ్వింకా ఇక్కడే ఉన్నావా
వసు: ఆ ప్రశ్న నేను అడగాలి
సాక్షి: చదువుల పండుగ వర్క్ ఉంది కదా..దానిపై వర్క్ చేస్తున్నాను...బాధ్యతంటూ ఒప్పుకున్నాక వదిలిపెట్టను వసుధార..అందుకే ఇంత సీరియస్ గా పనిచేస్తున్నాను...నేను ఈ వర్క్ చేస్తాను.. క్యాబ్ బుక్ చేశాను
రిషి: థ్యాంక్ గాడ్...ఓ శ్రమ తప్పించావ్..నేను నిన్ను ఎలా డ్రాప్ చేయాలా అని చూస్తున్నాను...
సాక్షి: నేను క్యాబ్ బుక్ చేసింది వసుధారకి...
రిషి: తనకెందుకు బుక్ చేయడం...నేను వసుధార మా ఇంటికి వెళ్లి చదువుల పండుగ వర్క్ చేయాలి కదా
సాక్షి: నేను మీ ఇంటికి వచ్చి వర్క్ చేద్దాం అని వసుధారని తన రూమ్ కి పంపించాలనుకున్నాను
రిషి: నువ్వొచ్చి ఏం చేస్తావ్...మేడం-వసుధార కలసి ఔట్ పుట్ ఫైనల్ చేస్తారు
సాక్షి; నేను కూడా వస్తాను రిషి...ఒంటరిగా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది...
వసు: రిషి సార్ వద్దనండి ప్లీజ్...
రిషి: సరే పద..క్యాబ్ క్యాన్సిల్ చేసెయ్....
Also Read: వసు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్న రిషి, వేగంగా పావులు కదుపుతున్న దేవయాని-సాక్షి
వసుధార కార్లో కూర్చునేందుకు వెళుతుండగా వసుని నెట్టేసి సాక్షి ముందు సీట్లో కూర్చుంటుంది... ఈ సాక్షి చాలా ఎక్కువ చేస్తోంది..అయినా రిషి సార్ సాక్షిని ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు.. నిన్నటి వరకూ రిషి సార్ ని ఇబ్బంది పెట్టిన ఈమెని పట్టించుకోకుండా ఉండాలి కానీ తనకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు అనుకుంటూ వెనుక సీట్లో కూర్చుంటుంది వసుధార. సాక్షి పొగరుగా చూస్తుంటుంది. సాక్షి సీట్ బెల్ట్ పెట్టుకో అంటుంది వసుధార(రిషి సార్ సీట్ బెల్ట్ పెడతారేమో అని నా భయం నాది అనుకుంటుంది).
సాక్షి: మొత్తానికి రిషి పక్కన కూర్చునే వసుధారని వెనక్కు పంపించగలిగాను...ఇది నా సగం విజయం..ఇక రిషి మనసులో స్థానం సంపాదించుకోవడం మిగిలింది..అది కూడా అతి త్వరలో విజయవంతంగా పూర్తిచేస్తాను అనుకుంటుంది...
వసు: లైబ్రరీలో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార.... సాక్షిని రిషి సార్ ఎందుకు క్షమిస్తున్నారో అర్థం కావడం లేదు..ఇలాంటి వాళ్లని పక్కన పెట్టుకుంటే ప్రమాదం అని సార్ కి తెలియదా అనుకుంటుంది....
రిషి: వసు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసింది..రిజెక్ట్ చేశాక తప్పు చేశాను అని అనిపించలేదా...
సాక్షి: యంగేజ్ మెంట్ టాపిక్ మొదలెడుతుంది సాక్షి
రిషి: ఇప్పుడెందుకు ఈ టాపిక్ తీస్తుంది...
సాక్షి: మనుషులన్నాక తప్పులు చేస్తారు కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాక ఇంత తప్పుచేశానా అనుకుంటారు...నా విషయంలో కూడా నిజం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అంతా బావుంటే మనిద్దరికీ ఈ పాటికి పెళ్లై ఉండేది కదా...
వసుధార: ఆపుతారా అని అరుస్తుంది.....
ఎపిసోడ్ ముగిసింది......