IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Karthika Deepam ఏప్రిల్ 9 ఎపిసోడ్: శౌర్య ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుంటానన్న హిమ-తగ్గేదే లే అంటున్న రౌడీ బేబీ

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. ఎప్రిల్ 9 శనివారం 132 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 9 శనివారం ఎపిసోడ్
జ్వాలే...శౌర్య అని హిమకు తెలుస్తుంది. అయితే తన చేతిపై ఉన్నది తన శత్రువు పచ్చబొట్టు అని ఎప్పటికీ వదిలిపెట్టను అని అన్న జ్వాల మాటలు విని ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంటుంది హిమ. ఏయ్ తింగరి అని పిలిచిన జ్వాల..చెప్పకుండా వెళ్లిపోతున్నావేంటని అడుగుతుంది.... ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో జ్వాలని చూస్తుంటుంది. ఇంకా నీ కోపం తగ్గలేదా శౌర్యా..నేను చేసిన తప్పుకి ఇంకా ఏం శిక్ష అనుభవించాలి..హిమను శౌర్య ఎప్పటికీ క్షమించదా అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది...

ఇంటికి వెళ్లిన హిమ తల్లిదండ్రుల ఫొటోల ముందు నిల్చుని.... 
అమ్మా నాన్న... నేను శౌర్యని చూశాను మన శౌర్యని చూశాను..ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నాను ఆ జ్వాలనే మన శౌర్య డాడీ... కనిపించగానే ఈ జన్మకి ఇది చాలు దేవుడా అనుకున్నాను కానీ శౌర్య దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుని నేనే నీ హిమని అని చెప్పాలనిపించింది కానీ చెప్పలేని పరిస్థితి. చిన్నప్పటి నుంచీ ఎంత కోపంగా ఉందో ఇప్పుడా కోపం వెయ్యిరెట్లు పెరిగింది...నన్ను ఏం చేయమంటారో చెప్పండి అమ్మా.... నా పేరు వింటేనే భగభగమండిపోతోంది, నా పై ఎంత ప్రేమ ఉండేదో, నన్ను ఎంతబాగా చూసుకునేదో ఆ ప్రేమ మొత్తం ద్వేషంగా మారిపోయింది, నేను చేసిన తప్పువల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఏడుస్తూనే ఉన్నాను. మీ చావుని నేనే కారణం అయిపోయాను...ఆ కోపంతోనే శౌర్య నాకోసం ఎదురుచూస్తోంది డాడీ.. 

శౌర్య మనసులో కోపాన్ని పోగొట్టేలా చేయడమే నా ముందున్న లక్ష్యం...ఏం చేసైనా ఎలా చేసైనా శౌర్య కోపం పోగొట్టేలా చేస్తాను. శౌర్యని నేను బాగా చూసుకుంటానంటూ మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను...తనని నేను కాపాడుకుంటాను... నాకు ధైర్యం ఇవ్వండి... శౌర్య మనసులో ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవాలి మేం ఇద్దరం ఎప్పటిలా కలసి ఉండాలని దీవించండి...ఆశీర్వదించండి... ఈ తింగరే నీ తింగరి అని చెప్పేరోజు త్వరగా రావాలని కోరుంటున్నా అమ్మా... చిన్నప్పుడు అమ్మ వంటలు చేస్తూ కష్టపడినట్టే శౌర్య కూడా ఆటో నడుపుతోంది...టిఫిన్ బాక్సులు అందిస్తోంది..శౌర్య అంత కష్టపడడానికి నేనే కారణం కదా...నేనిక్కడ హాయిగా ఉంటే తనక్కడ ఇబ్బందులు పడుతోంది.నా ఆస్తిలో, నా సంతోషంలో దానికి కూడా భాగం ఉంది కదా డాడీ, తనని ఎలాగైనా కాపాడుకుంటాను, తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను... పిచ్చిదాన్ని శౌర్యని నేను కాపాడుకోవడం ఏంటి, తనే నన్ను కాపాడింది, ఇప్పుడు కూడా తింగరి అలా ఉండు, తింగరి ఇలా ఉండు అని నేనెవరో తెలియకపోయినా నన్ను నడిపిస్తోంది... అమ్మా నాన్న నన్ను దీవించండి. ఈ తింగరి ఒంటరి కాదు...తనకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను.. తనలో మార్పు కోసం ఎదురుచూడలేనా...తనలో ద్వేషాన్ని ప్రేమగా మార్చుకునేలా నన్ను దీవించండి. 

Also Read: తండ్రి బర్త్ డే సెలబ్రేట్ చేయాలనుకున్న రిషికి వసు ఇచ్చే సలహా ఏంటి
తండ్రి గేటు దగ్గర ఉండగా..తల్లి లోపలకు అడుగుపెట్టబోతుండగా ఆగు అని అరుస్తుంది స్వప్న. 
సౌందర్య: కన్న కూతురు దగ్గరకు రావాలన్నా ఖైదీని కలవాలని వచ్చినట్టుందేంటి
స్వప్న: డాడీ ఏంటిది...
సౌందర్య: ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావ్...నీకు అమ్మని అని గుర్తుపెట్టుకో
స్వప్న: నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు కానీ సందర్శకులకు ప్రవేశం లేదు, కావాలంటే బోర్డు తగిలించమంటే తగిలిస్తాను
అప్పుడే అక్కడకు వచ్చిన నిరుపమ్..ఎప్పుడొచ్చావ్ అని అడిగితే.. ఇప్పుడే వచ్చిందిరా అప్పుడే వెళ్లిపోతోంది కూడా అంటాడు ఆనందరావు. పద అమ్మమ్మా లోపలకు అన్న నిరుపమ్ పై ఫైర్ అవుతంది స్వప్న. 
నిరుపమ్: అమ్మమ్మను రావొద్దంటావా
స్వప్న: నాకు నచ్చనివాళ్లు మనసుని క్షోభపెట్టిన వాళ్లకు నా ఇంట్లో ప్రవేశం లేదు...నిరుపమ్ ఏదో చెబుతుండగా అడ్డుతగిలిన స్వప్న నాకెవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు...
ఆనందరావు: నీక్కూడా కోడళ్లు వస్తారు...మమ్మల్ని అన్న మాటలే నిన్ను కూడా అంటారు...
స్వప్న: మీరేం నన్ను భయపెట్టాల్సిన అవసరం లేదు..ఎలా జరగాలనిఉంటే అలా జరుగుతుంది... కొత్త చుట్టరికాలు కలపకండి
నిరుపమ్: ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా అలానే ఉంటావా
స్వప్న: ఏది మంచిదో ఏది చెడో నాకు తెలుసు..నీకు అంత ప్రేమ ఉంటే అక్కడకు వెళ్లి చూసిరా లోపలకు మాత్రం తీసుకురావొద్దు...

Also Read: నిరుపమ్ పై ప్రేమతో హిమపై తన పగను బయటపెట్టిన రౌడీ బేబీ
జ్వాల:  ఇంట్లో కూర్చుని పచ్చబొట్టు చూసుకుంటూ... జరిగినవన్నీ తలుచుకుంటుంది జ్వాల. ఏం ఆలోచిస్తున్నావ్ అని చంద్రమ్మ అడిగితే ఏదోలే అన్నీ చెప్పాలా అంటుంది. నీళ్లు తాగుతున్నా అని చెప్పి మందు తాగుతున్నావా అంటే...చేసిన పాపాలు మరిచిపోవడానికి, పోయిన పాపను మరిచిపోవడానికి తాగుతున్నా అంటాడు. చనిపోవడానికి ముందురోజు కూడా మా అమ్మా నాన్న కూడా మందు తాగాలు, డాన్స్ చేశారు..అదే వాళ్లకి చివరి డాన్స్ అయింది అంటుంది.

గుమ్మం ముందు హిమ నిల్చుని ఉంటుంది. ఎవరక్కడ అని చంద్రమ్మ అరవడంతో పోలీసులేమో నువ్వెళ్లి చూడు అంటాడు ఇంద్రుడు. బయటకు వెళ్లి హిమని చూసి.. ఏంటి చీకటంటే భయం వేయలేదా అని అడుగుతుంది. నువ్వే నా ధైర్యం అని చెబుతుంది. ఇంతలో ఇంద్రుడు-చంద్రమ్మని చూసి తనను అప్పట్లో వాళ్లే కాపాడిన విషయం గుర్తుచేసుకుని శౌర్య..పిన్ని-బాబాయ్ దగ్గరకు చేరిందా పోనీలే దేవుడా మంచే చేశావ్ అనుకుంటుంది. ఏయ్ తింగరి ఏంటివి అని అడుగుతుంది జ్వాల. బ్లడ్ ఇస్తే పళ్లు ఇస్తారా అన్నావ్ గా..అందుకే నీకోసం తెచ్చానంటుంది. ఏంటమ్మా తింగరి అంటావ్ నీపేరేంటి డాక్టరమ్మా అని అడుగుతుంది చంద్రమ్మ. అది నా పేరు అని హిమ నసిగేలోగా..నీపేరు చెప్పకు...నీ పేరు తెలిస్తే ముద్దుగా తింగరి అని పిలవలేను కదా అంటుంది. శౌర్య చేతిని హిమ ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటోంది...  ఎపిసోడ్ ముగిసింది...

సోమవారం ఎపిసోడ్ లో
నీ పక్కన కూర్చుని భోజనం చేయడం సంతోషంగా ఉంది అనుకుంటుంది. నీకేం ఇష్టం అని జ్వాల అడిగితే దోసకాయ పచ్చడి అంటుంది. హిమకి ఆ పచ్చడి ఇష్టం అని గుర్తుచేసుకున్న జ్వాల అది నా శత్రువుకి ఇష్టం అందుకే నాకిష్టం లేదంటుంది. సరిగా తినడం లేదని గమనించిన జ్వాల..హిమకి తినిపిస్తుంది.

Published at : 09 Apr 2022 09:11 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam 9th April Episode 1322

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు

CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!