Jagadhatri Serial Today September 13th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్‌కి లాస్ట్ ఛాన్స్! శ్రీవల్లి కూడా వజ్రపాటి వారసురాలే అని తెలిసిపోయిందా!
Jagadhatri Serial Today Episode September 13th కౌషికి యువరాజ్‌కి 6 నెలల టైం ఇవ్వడం, శ్రీవల్లి అనుకోనిరీతిలో కౌషికి ఇంటికి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగాయి.

Jagadhatri Serial Today September 13th Episode ప్రొఫెసర్ తయారు చేసిన నీటియంత్రం ప్రాజెక్ట్ జ్ఞహార్డ్ డిస్క్ కోసం మీనన్ గట్టి ప్రయత్నమే చేస్తాడు. ఆడిటోరియంలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రోగ్రాం ఉండటంతో మీనన్ అతని నడుమునకు యువరాజ్‌తో బాంబ్ పెట్టిస్తాడు. యువరాజ్ మీనన్ కోసం తన ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా బెదిరిస్తాడు. ఒకటైంలో మీనన్ తన ఫ్యామిలీకి కూడా ప్రమాదం తల పెడతాడు. ఆడిటోరియంలో అందరూ కూర్చొన్న కుర్చీల కింద బాంబ్‌లు పెడతారు. లేచిన ఇద్దరు ముగ్గురు కాలి బూడిదైపోతారు. మీనన్ నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి యువరాజ్ వస్తాడు. యువరాజ్ ప్లాన్ చెడగొట్టేస్తున్నాడని మీనన్ వస్తాడు. మీనన్ బెదిరించడంతో ఆడిటోరియంలో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడటం కోసం జేడీ హార్డ్ డిస్క్ ఇచ్చేస్తుంది. మాస్క్ వేసుకొని వచ్చింది తన భర్త యువరాజ్ అని నిషికకు తెలిసిపోతుంది.
జేడీ, కేడీలకు సాధు సార్ కాల్ చేస్తారు. ఒకరు ఇద్దరు తప్ప ఆడిటోరియంలోని మిగతా అందర్ని కాపాడామని చెప్తుంది. మీనన్ తప్పించుకున్నాడని అంటుంది. ఇక హార్డ్ డిస్క్ కోసం సాధు సార్ అడిగితే ప్రొఫెసర్ సేఫ్ హార్డ్ డిస్క్ కూడా సేఫ్‌గా నా దగ్గరే ఉందని జేడీ చెప్పి షాక్ ఇస్తుంది. మీనన్ తనకు జేడీ నిజంగానే హార్డ్ డిస్క్ ఇచ్చేసిందని సంబరపడిపోయి వెళ్లి ల్యాప్‌టాప్‌కి కనెన్ట్ చేసి చూస్తే అదిదా సర్‌ఫ్రైజ్ అనే పాట ప్లే అవుతుంది. జేడీ తనని మళ్లీ దెబ్బ కొట్టిందని మీనన్ ముఖం మాడిపోతుంది. మీనన్ జేడీకి కాల్ చేస్తాడు. గెలిచాను అని సంబరపడకు ఎక్కడో ఒక చోట దొరికిపోతావ్ అని అంటాడు. ఆ చోటే నువ్వు నాకు దొరకాలి అని నేను కోరుకుంటూ ఉంటా.. జైలులో జీవితాంతం చిప్ప కూడు తినడానికి రెడీగా ఉండు.. లూజర్ మీనన్ అని అంటుంది. జేడీ ఫోన్ పెట్టగానే మీనన్ ఐయామ్ నాట్ ఏ లూజర్ అని అరుస్తాడు.
నిషిక గదిలోకి వెళ్లి యువరాజే మాస్క్ వేసుకొని వచ్చి ఒకర్ని చంపడం.. తనని కొట్టడం.. బాంబ్ పెట్టడం అన్నీ తలచుకొని కోపంతో రగిలిపోయి గదిలో అన్నీ విసిరికొడుతుంది. ఇంతలో యువరాజ్ రావడంతో వైజయంతి కంగారుగా మొత్తం కొడుకుతో చెప్తుంది. యువరాజ్ గదిలోకి వెళ్లి గది మొత్తం చిందర వందర చూసి ఏమైందని అడుగుతాడు. ఏమైందో నీకు తెలీదా అని యువరాజ్‌ని లాగిపెట్టి కొట్టి కట్టుకున్న భార్య అని కూడా లేకుండా నన్ను కొట్టి హింసించావ్.. అసలు నువ్వు నా భర్తవేనా ఛీ.. నీ ముఖం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నన్ను చంపడానికి రెడీ అయ్యావ్.. ఇంక నీకు నేను ఎందుకు.. నీ కోసం ఎలా బతకాలి నేను.. నువ్వు ఇలాంటి వాడివి అని తెలిశాక నేను నీతో ఉండలేను.. మేం చనిపోతా అని తెలిసి కూడా మమల్ని ఎందుకు ఆడిటోరియానికి పంపావ్.. ఎందుకు నా తల మీద గన్ పెట్టి నన్ను చంపడానికి కూడా ట్రై చేశావ్ అని అడుగుతుంది. జేడీ, కేడీలు నిన్ను ఎందుకు మీనన్ మనుషులు అన్నారు.. వాళ్లకి నీకు సంబంధం ఏంటి.. అని నిషిక ప్రశ్నిస్తుంది. నిషిక, యువరాజ్‌ల మాటలు మొత్తం కౌషికి వినేసి యువరాజ్‌ని లాక్కొని తీసుకెళ్తుంది.
వైజయంతితో పాటు అందరూ ఏమైందని అడుగుతారు. ఆడిటోరియంలో మాస్క్‌తో వచ్చి నిషికని కొట్టింది యువరాజే అని చెప్తుంది. వీడు ఇంకా మారలేదు బాబాయ్.. వీడు ఇంకా మీనన్ మనిషిగానే ఉంటూ.. దారుణాలు చేస్తూ ఉంటాడు. కుంభమేళాలో సీఎం మీద అటాక్ చేసింది యువరాజే అని.. డ్రగ్స్, ఫేక్ కరెన్సీ.. ఇలా అన్నీ ఇల్లీగల్ పనులు చేసేది మన యువరాజే బాబాయ్.. అందుకు సాక్ష్యం వాడి భార్య అని అంటుంది. వైజయంతి ఏడుస్తూ కౌషికి చెప్పింది అబద్ధం అని చెప్పరా అబ్బోడా అని అంటుంది. సుధాకర్ కూడా ప్రశ్నించడంతో నేను మిమల్ని కాపాడుకోవడానికి ఆడిటోరియానికి వచ్చానని అంటాడు. ఈ ఒక్క సారికి క్షమించమని అడుగుతాడు. ఎన్ని అవకాశాలు ఇవ్వాలి.. ఇలాంటి తప్పుడు అలవాట్లు ఉన్నవారు వజ్రపాటి ఇంటి వారసుడి లక్షణమే కాదు.. నీ లాంటి వాడిని నమ్మి వజ్రపాటి ఇంటి పరువుని నీ చేతిలో పెట్టలేను.. నీ లాంటి వాడికి ఈ ఇంటిలో కానీ.. వజ్రపాటి కంపెనీల్లో కానీ ఈ ఇంట్లోనే స్థానం లేదు అని కౌషికి అంటుంది. యువరాజ్‌ని ఇంట్లో నుంచి పంపేస్తే ఆస్తి దక్కదు అని నిషిక ప్లాన్ చేసి నేను వెళ్లిపోతా అని డ్రామా మొదలు పెడుతుంది. వెళ్లొద్దని చెప్పడంతో ఈ ఇంట్లో ఆఫీస్‌లో సగ భాగం ఇస్తాను అని చెప్తేనే ఉంటాను అని అంటుంది. ఇంతలో నిషిక తండ్రి వస్తాడు. నిషిక ఏడ్వడం ఇంట్లో అందరూ విషయం చెప్పడంతో అతను కూతుర్ని తీసుకొని వెళ్లిపోతా అంటాడు.
కౌషికి యువరాజ్‌కి ఆరు నెలలు టైం ఇచ్చి మంచోడిలా మారి అడ్డు దారులు తొక్కడం లేదని తెలిస్తేనే నీకు ఆస్తి ఇవ్వగలను లేదంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను అని అంటుంది. మొత్తానికి నిషికని అందరూ ఆపేస్తారు. ఈ ఆరు నెలలు ఏదో జాబ్ చూసుకోవాలని యువరాజ్ అనుకుంటే నిషిక మీనన్ దగ్గర సీక్రెట్‌గా పని చేయమని అంటుంది. నేను చేయను అని యువరాజ్ అంటాడు.
సుధాకర్ కూతురు.. కేథార్ చెల్లిని నడి రోడ్డు మీద రౌడీలు తరుముతారు. తల్లి ఫొటో బట్టలు చిందర వందర పడిపోతాయి. శ్రీ వల్లి పరుగులు పెడుతుంది. అటుగా వచ్చిన కేథార్, జగద్ధాత్రి రోడ్డు మీద బట్టలు చూసి ఎవరో అమ్మాయిని ఆకతాయిలు ఇబ్బంది పెట్టారని మొత్తం వెతుకుతారు. జగద్ధాత్రి అక్కడే పడి ఉన్న కేథార్ తల్లి ఫొటో చూస్తుంది. షాక్ అయి కేథార్‌ని పిలుస్తుంది. మీ అమ్మ ఫొటో అని చెప్తుంది. కేథార్ చూసి మా అమ్మ ఫొటో ఇక్కడుందేంటి అని అంటాడు. జగద్ధాత్రి కేథార్‌తో అటాక్ జరిగింది మీ అమ్మకి తెలిసిన వాళ్ల మీద అని అంటుంది. కేథార్ ఏడుస్తూ పాతికేళ్లగా అమ్మ ఫొటో ఇంత జాగ్రత్తగా దాచుకునే అవసరం ఎవరికి ఉంది. నాకు తెలియని అమ్మ గతం ఇంకా ఉందా అని బాధ పడతాడు. ఈ ఫొటో ఎవరి దగ్గర ఉందో తెలుసుకుంటే మీ అమ్మ గురించి తెలుస్తుందని ఇద్దరూ చెరో వైపు పరుగులు పెడతారు. కేథార్ తన తల్లి ఫొటో కారులో పెడతాడు.
శ్రీవల్లి రౌడీల నుంచి తప్పించుకొని కారు చాటున దాక్కుంటుంది. రౌడీలు వెతికి వెతికి వెళ్లిపోతారు. తర్వాత శ్రీవల్లి వెనక్కి వచ్చి బట్టలు మొత్తం తీసుకుంటుంది. అమ్మ ఫొటో ఎక్కడ అని అనుకుంటూ మొత్తం వెతికి కారులో తన తల్లి ఫొటో చూస్తుంది. ఈ కారు ఎవరిది.. అమ్మ ఫొటో దాచుకున్నారు అంటే అమ్మ ఎవరో వీళ్లకి తెలుసు అని అనుకొని ఫొటో తీసుకొని పారిపోతుంది. కౌషికి శ్రీవల్లిని చూస్తుంది. శ్రీవల్లికి సారీ చెప్తుంది. శ్రీవల్ల కౌషికి వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని జరిగిందంతా చెప్తుంది. కౌషికి చేసిన తప్పుకి క్షమించమని చెప్పి శ్రీవల్లిని తనతో పాటు ఇంటికి రమ్మని చెప్తుంది.
జగద్ధాత్రి, కేథార్‌లు సుధాకర్ దగ్గరకు వెళ్తారు. కేథార్ సుధాకర్‌తో అమ్మకి సంబంధించిన వాళ్లు ఎవరైనా మీకు తెలుసా అని అడుగుతాడు. ఎవరూ తెలీదని సుధాకర్ చెప్తాడు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావ్ ఏమైంది కేథార్ అని సుధాకర్ అడిగితే ఫొటో దొరికినప్పుడు జరిగిన విషయం చెప్తాడు. సుధాకర్ తనకు ఏం గుర్తు లేదని చెప్తాడు. జగద్ధాత్రి మామయ్యతో మీ బంధంతో ముడిపడినవారు ఎవరో ఉన్నారు.. ఆ బంధం ఒక బంధుత్వం అయితే కాదు అంతకు మించి ఏదో అనుబంధం ఉందని అంటుంది. అప్పుడే కౌషికి శ్రీవల్లికి తీసుకొస్తుంది. వైజయంతి కౌషికితో ఈ పిల్లని ఏంటి ఇంటికి తీసుకొచ్చావ్.. పనికి మాలిన అందరూ నీ కంటికే కనిపిస్తారా అని అడుగుతుంది. అలా మాట్లాడొద్దు పిన్ని ఈ అమ్మాయి బాబుని కిడ్నాప్ చేసిందని నేను అనడంతో తను రోడ్డు మీద పడిపోయింది. తనకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన నేను తన లైఫ్ సెట్ చేయాలి అంత వరకు తను ఇక్కడే ఉంటుందని అంటుంది. వైజయంతి అరుస్తుంది. తన ఇంటికి పంపకుండా మన ఇంటికి తీసుకురావడం ఏంటి అని అడుగుతుంది.
కౌషికి అందరితో తనకు ఎవరూ లేరు.. తనని ఆశ్రమం నుంచి పంపేశారని చెప్తుంది. కేథార్ శ్రీవల్లితో పుట్టుకతో ఎవరూ అనాథలు కారమ్మా.. అనాథని చేస్తేనే అనాథ అవుతారు. నీకు మేం అంతా సొంతవాళ్లం అనుకో అని అంటాడు. శ్రీవల్ల కేథార్‌ని సరే అన్నయ్య అంటుంది. కేథార్‌ని శ్రీవల్లి అన్నయ్య అనగానే శ్రీవల్లి, కేథార్ ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. శ్రీవల్లి తను కస్తూరిబా అనాథాశ్రమంలో పెరిగానని చెప్పడంతో వైజయంతి చాలా కంగారు పడుతుంది. గతంలో తనో పాపని ఆ ఆశ్రమంలో వదిలేయడం గుర్తు చేసుకొని చెమటలు పట్టేస్తుంది. జగద్ధాత్రి వైజయంతిని గమనిస్తుంది.
వైజయంతి మనసులో ఇదేంటి కస్తూరిబా అనాథ ఆశ్రమం అంటోది వయసు అంతే ఉంది అని గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది. ఆశ్రమం పేరు చెప్పగానే అత్తయ్య ఎందుకు అలా అయిపోయారని జగద్ధాత్రి ఆలోచిస్తుంది. గతంలో తను ఓ పాపని జయ అనే పేరుతో ఆశ్రమంలో వదిలేసినట్లు గుర్తు చేసుకుంటుంది. ఆశ్రమానికి వెళ్లి ఈ పిల్ల సుహాసిని కూతురో కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆశ్రమానికి వెళ్లే ముందు శ్రీవల్లితో మాట్లాడాలి అని వయసు అడిగి వయసు మ్యాచ్ అయిందని అనుకుంటుంది. నిన్ను ఆశ్రమంలో ఎవరు వదిలేశారు అని అడుగుతుంది. ఇంతలో జగద్ధాత్రిని చూసి వస్తాను అని చెప్పేసి వెళ్లిపోతుంది. శ్రీవల్లి వైజయంతి అడిగిన ప్రశ్నలు చెప్పడంతో జగద్ధాత్రి మనసులో ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటుంది.
వైజయంతి బయటకు వెళ్తుంటే కూతురు మాధురి ఇంటికి వస్తుంది. అందరూ మాధురిని పలకరిస్తారు. కౌషికి మాధురితో ముఖం వెలిగిపోతుంది ఏదో శుభవార్తే కదా అంటే వైజయంతి నెల తప్పావా అంటే అవును అంటుంది. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఇంతలో మాధురి భర్త, అత్త వచ్చి చెప్పకుండా వచ్చేసిందని కోప్పడతారు. ఇవీ ఈ వారం హైలెట్స్.





















