Jagadhatri Serial Today September 12th: జగద్ధాత్రి సీరియల్: వైజయంతికి కస్తూరిబా ఆశ్రమం రహస్యం తెలిసిందా? జగద్ధాత్రి ఏం చేయనుంది?
Jagadhatri Serial Today Episode Sep 12th కౌషికి శ్రీవల్లిని ఇంటికి తీసురావడంతో వైజయంతి గతంలో అనాథాశ్రమంలో వదిలేసిన సుహాసిని కూతురే శ్రీవల్ల అని అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్‌లు సుధాకర్ దగ్గరకు వెళ్తారు. కేథార్ సుధాకర్‌తో అమ్మకి సంబంధించ వాళ్లు ఎవరైనా మీకు తెలుసా అని అని అడుగుతాడు. ఎవరూ తెలీదని సుధాకర్ చెప్తాడు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావ్ ఏమైంది కేథార్ అని సుధాకర్ అడిగితే ఫొటో దొరికినప్పుడు జరిగిన విషయం చెప్తాడు. సుధాకర్ తనకు ఏం గుర్తు లేదని చెప్తాడు.
జగద్ధాత్రి మామయ్యతో మీ బంధంతో ముడిపడిన వారు ఎవరో ఉన్నారు.. ఆ బంధం ఒక బంధుత్వం అయితే కాదు అంతకు మించి ఏదో అనుబంధం ఉందని అంటుంది. అప్పుడే కౌషికి శ్రీవల్లికి తీసుకొస్తుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. వైజయంతి కౌషికితో ఈ పిల్లని ఏంటి ఇంటికి తీసుకొచ్చావ్.. పనికి మాలిన అందరూ నీ కంటికే కనిపిస్తారా అని అడుగుతుంది. అలా మాట్లాడొద్దు పిన్ని ఈ అమ్మాయి బాబుని కిడ్నాప్ చేసిందని నేను అనడంతో తను రోడ్డు మీద పడిపోయింది. తనకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన నేను తన లైఫ్ సెట్ చేయాలి అంత వరకు తను ఇక్కడే ఉంటుందని అంటుంది. వైజయంతి అరుస్తుంది. తన ఇంటికి పంపకుండా మన ఇంటికి తీసుకురావడం ఏంటి అని అడుగుతుంది.
కౌషికి అందరితో తనకు ఎవరూ లేరు.. తనని ఆశ్రమం నుంచి పంపేశారు. అందుకే ఇక్కడ ఉండమన్నా తన కష్టం తెలిసి ఆదరించకపోతే ఎలా అని అంటుంది. కేథార్ శ్రీవల్లికి సారీ చెప్తాడు. పుట్టుకతో ఎవరూ అనాథలు కారమ్మా.. అనాథని చేస్తేనే అనాథ అవుతారు. నీకు మేం అంతా సొంతవాళ్లం అనుకో అని అంటాడు. శ్రీవల్ల కేథార్‌ని సరే అన్నయ్య అంటుంది. కేథార్‌ని శ్రీవల్లి అన్నయ్య అనగానే శ్రీవల్ల, కేథార్ ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. నిషిక కోపంతో ఎవరే అన్నయ్యా సొంత వాళ్లు అనుకోన్నారని సొంత మనిషివి అయిపోవద్దు.. నువ్వో అనాథవి అని అంటుంది. పిలిచింది నిన్ను కదా నీకేంటి అని కేథార్ అంటే నీ వంకతో మమల్ని వరసలు పెడితే మంచిది కాదని చెప్తుందని యువరాజ్ అంటాడు. కేథార్ అవేమీ పట్టించుకోవద్దని తనని అన్నయ్య అని పిలవమని నీకు ఈ అన్నయ్య ఉన్నాడని అంటాడు.
జగద్ధాత్రి శ్రీవల్లితో ఇలా అడుగుతున్నానని ఏం అనుకోవద్దు పుట్టుకతో అనాథవా లేక అంటే నాకు తెలీదు.. నేను పుట్టగానే మా అమ్మ వదిలేసింది అంట అప్పటి నుంచి నేను కస్తూరిబా అనాథాశ్రమంలో పెరిగాను అంటుంది. శ్రీవల్లి ఆ పేరు చెప్పగానే వైజయంతి చాలా కంగారు పడుతుంది. గతంలో తనో పాపని ఆ ఆశ్రమంలో వదిలేయడం గుర్తు చేసుకుంటుంది. జగద్ధాత్రి వైజయంతిని గమనిస్తుంది. కౌషికి తనని తీసుకొని తన గదికి వెళ్తుంది.
వైజయంతి మనసులో ఇదేంటి కస్తూరిబా అనాథ ఆశ్రమం అంటోది వయసు అంతే ఉంది అని గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది. ఆశ్రమం పేరు చెప్పగానే అత్తయ్య ఎందుకు అలా అయిపోయారని జగద్ధాత్రి ఆలోచిస్తుంది. గతంలో తను ఓ పాపని జయ అనే పేరుతో ఆశ్రమంలో వదిలేసినట్లు గుర్తు చేసుకుంటుంది. ఆ అమ్మాయిని కన్న తల్లి వదిలేసిందా.. లేదంటే ఇంకెవరో ఆ పాపం చేశారో అని సుధాకర్ అంటే వైజయంతి కంగారు పడి భర్తని పడుకోమని చెప్తేస్తుంది. వైజయంతి మనసులో ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా రేపే ఆశ్రమానికి వెళ్లి ఈ పిల్ల సుహాసిని కూతురో కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది.
వైజయంతి ఆశ్రమానికి వెళ్లాలని బయల్దేరుతుంది. వెళ్లే ముందు శ్రీవల్లితో మాట్లాడాలి అని అనుకుంటుంది. వయసు అడుగుతుంది. 20 ఏళ్లు అని శ్రీవల్లి అనగానే వయసు మ్యాచ్ అయిందని అనుకుంటుంది. నిన్ను ఆశ్రమంలో ఎవరు వదిలేశారు అని అడుగుతుంది. ఇంతలో జగద్ధాత్రిని చూసి వస్తాను అని చెప్పేసి వెళ్లిపోతుంది. శ్రీవల్లి వైజయంతి అడిగిన ప్రశ్నలు చెప్పడంతో జగద్ధాత్రి మనసులో ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటుంది.
వైజయంతి బయటకు వెళ్తుంటే కూతురు మాధురి ఇంటికి వస్తుంది. మాధురిని చూసి వైజయంతి బయటే నిల్చొని సంతోషంతో ముద్దాడుతుంది. మాధురిని లోపలికి తీసుకెళ్తుంది. అందరూ మాధురిని పలకరిస్తారు. కౌషికి మాధురితో ముఖం వెలిగిపోతుంది ఏదో శుభవార్తే కదా అంటే వైజయంతి నెల తప్పావా అంటే అవును అంటుంది. అందరూ కంగ్రాట్స్ చెప్పి నేను అమ్మమ్మ అవుతా, తాతయ్య అవుతా, మామయ్య అవుతా, అత్తయ్య అవుతా అని సంతోషపడతారు. మాధురి శ్రీవల్లి గురించి అడిగితే మన గెస్ట్ అని కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుందని అంటుంది. అల్లుడు రాలేదా అని అడుగుతారు. ఇంతలో సుధాకర్ అల్లుడు, మాధురి అత్త వచ్చి మాధురి చెప్పకుండా వచ్చిందని కోప్పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















