Jagadhatri Serial Today September 11th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి జీవితంలో పెను మార్పు! కేథార్‌కి చెల్లి ఉందని తెలుస్తుందా! కౌషికి సాయం!
Jagadhatri Serial Today Episode Sep 11th కేథార్ చెల్లిని రౌడీలు తరమడం.. రోడ్డు మీద జగద్ధాత్రి కేథార్ తల్లి ఫొటో చూసి కేథార్‌కి చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నిషిక యువరాజ్‌తో మీనన్ దగ్గర ఉన్న ఉద్యోగం ఎవరికీ తెలీకుండా కంటిన్యూ చేయమని అంటుంది. మనం అలాంటి క్రిమినల్ దగ్గర జాబ్ మానేస్తే మనకే ప్రమాదం అందుకే సడెన్‌గా ఆపేయకుండా మెల్లగా మానేయాలి అని.. అంత వరకు మన డబ్బు సమస్యలు కూడా పోతాయని అంటుంది.
యువరాజ్ ఇక మీదట చెడు సావాసాలు మానేస్తానని అంటాడు. నిషిక మీనన్ దగ్గర ఉద్యోగం మానేయొద్దని చెప్పేలోపు వైజయంతి వస్తుంది. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు మేం నీ మీదే ఆశలు పెట్టుకున్నామని అంటుంది. మరోవైపు సుధాకర్ మొదటి భార్య సుహాసిని కూతురు శ్రీవల్లిని ఆశ్రమం నుంచి గెంటేయడంతో శ్రీవల్లి తల్లి ఫొటో పట్టుకొని రాత్రి రోడ్డు మీద నడుస్తూ ఏడుస్తుంది. ఓ సాయం నన్ను రోడ్డు మీదకు లాగేసిందని కౌషికి వాళ్లు చేసిన అవమానం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. కన్నవాళ్లని దూరం చేశావ్.. ఉన్నవాళ్లని దూరం చేశావ్.. తోడు నీడ లేకుండా ఎలా బతకాలి.. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఏడుస్తుంది.
శ్రీవల్లి ఒంటరిగా నడిచి వెళ్లడం మందు తాగుతూ ఉన్న ఇద్దరు ఆకతాయిలు చూసి శ్రీవల్లి వెంట పడి అల్లరి చేస్తారు. డబ్బు కోసం శ్రీ వల్ల బ్యాగ్లోని బట్టలు మొత్తం కింద పడేస్తారు. శ్రీవల్లిని ఇబ్బంది పెట్టబోతే వాళ్లని కొట్టి తల్లి ఫొటో అక్కడే పడేసి పారిపోతుంది. అటుగా వచ్చిన కేథార్, జగద్ధాత్రి రోడ్డు మీద బట్టలు చూసి ఎవరో అమ్మాయిని ఆకతాయిలు ఇబ్బంది పెట్టారని మొత్తం వెతుకుతారు.
జగద్ధాత్రి అక్కడే పడి ఉన్న కేథార్ తల్లి ఫొటో చూస్తుంది. షాక్ అయి కేథార్‌ని పిలుస్తుంది. మీ అమ్మ ఫొటో అని చెప్తుంది. కేథార్ చూసి మా అమ్మ ఫొటో ఇక్కడుందేంటి అని అంటాడు. జగద్ధాత్రి కేథార్‌తో అటాక్ జరిగింది మీ అమ్మకి తెలిసిన వాళ్ల మీద అని అంటుంది. కేథార్ ఏడుస్తూ పాతికేళ్లగా అమ్మ ఫొటో ఇంత జాగ్రత్తగా దాచుకునే అవసరం ఎవరికి ఉంది. నాకు తెలియని అమ్మ గతం ఇంకా ఉందా అని బాధ పడతాడు. ఈ ఫొటో ఎవరి దగ్గర ఉందో తెలుసుకుంటే మీ అమ్మ గురించి తెలుస్తుందని ఇద్దరూ చెరో వైపు పరుగులు పెడతారు. కేథార్ తన తల్లి ఫొటో కారులో పెడతాడు.
శ్రీవల్లి రౌడీల నుంచి తప్పించుకొని కారు చాటున దాక్కుంటుంది. రౌడీలు వెతికి వెతికి వెళ్లిపోతారు. తర్వాత శ్రీవల్లి వెనక్కి వచ్చి బట్టలు మొత్తం తీసుకుంటుంది. అమ్మ ఫొటో ఎక్కడ అని అనుకుంటూ మొత్తం వెతికి అందులో తన తల్లి ఫొటో చూస్తుంది. ఈ కారు ఎవరిది.. అమ్మ ఫొటో దాచుకున్నారు అంటే అమ్మ ఎవరో వీళ్లకి తెలుసు అని అనుకొని ఫొటో తీసుకొని పారిపోతుంది.
కౌషికి, కీర్తిలు కూడా కారులో వస్తూ ఉంటారు. కీర్తి ఐస్ క్రీం కావాలని కౌషికికి సైగ చేస్తుంది. తర్వాత జగద్ధాత్రి, కేథార్‌లు వచ్చి రోడ్డు మీద పడున్న బట్టలేవి అని అనుకుంటారు. తర్వాత కేథార్ తల్లి ఫొటో కోసం పరుగులు పెడతాడు. ఫొటో లేకపోవడంతో ఛా అనుకుంటాడు. అమ్మ మళ్లీ నాకు దగ్గరవుతుందని అనుకుంటాడు. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ శ్రీవల్లి కోసం వెతకడం మొదలు పెడతారు.
కౌషికి ఓ చోట కారు ఆపి ఐస్‌క్రీమ్ కోసం వెళ్తుంది. మరోవైపు శ్రీవల్లి పరుగున వచ్చి కౌషికిని ఢీ కొడుతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు నువ్వా అంటే నువ్వా అనుకుంటారు. శ్రీవల్లికి దెబ్బలు తగలడంతో కళ్లు తిరిగిపడిపోతుంటే పట్టుకోవడానికి కౌషికి పట్టుకుంటుంది. కౌషికి శ్రీవల్లితో నా బాబు కనిపించలేదన్న కంగారులో నిన్ను కొట్టి పోలీసులకు చెప్పి తప్పు చేశానని అంటుంది. దానికి శ్రీవల్లి మేడం మీ తప్పు వల్ల నన్ను క్రిమినల్ అని ఆశ్రమం నుంచి గెంటేశారని చెప్తుంది. ఇప్పుడు రోడ్డు మీద పడ్డానని ఇద్దరు రౌడీలు వెంటపడ్డారని చెప్తుంది. కౌషికి హాస్పిటల్‌కి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అంటే వద్దు అని ఆ రౌడీలు మళ్లీ నా వెంట పడితే నేను రోడ్డున పడాలి కదా మీరు అయితే మీ మహాల్‌కి వెళ్తారు నన్ను వదిలేయండి అని శ్రీవల్లి వెళ్లిపోతుంటే కౌషికి హాస్పిటల్‌కి వెళ్దామని అంటుంది. చేసిన తప్పుకి క్షమించమని చెప్పి హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటుంది. శ్రీవల్లిని ఒప్పించి బయల్దేరుతుంది.
కేథార్ తన తల్లి ఫొటో కనిపించడం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. జగద్ధాత్రితో ఎవరో బాగా కావాల్సిన వాళ్లులా ఉన్నారు.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు ఉన్నారని బాధ పడతాడు. మామయ్య గారికి అడుగుదామని జగద్ధాత్రి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















