Jagadhatri Serial Today September 10th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్, నిషికల్లో ఇంటి నుంచి వెళ్లేది ఎవరు? వజ్రపాటి ఇంట్లో ఏం జరగబోతుంది?
Jagadhatri Serial Today Episode September 10th యువరాజ్‌కి సుధాకర్ ఇంటి నుంచి పంపేస్తే నిషిక ఆపి తాను వెళ్లిపోతానని రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్ కౌషికి వాళ్లకి దొరికిపోతాడు. ఈ ఒక్క సారికి క్షమించమని అడుగుతాడు. ఎన్ని అవకాశాలు ఇవ్వాలి.. ఇలాంటి తప్పుడు అలవాట్లు ఉన్నవారు వజ్రపాటి ఇంటి వారసుడి లక్షణమే కాదు.. నీ లాంటి వాడిని నమ్మి వజ్రపాటి ఇంటి పరువుని నీ చేతిలో పెట్టలేను.. నీ లాంటి వాడికి ఈ ఇంటిలో కానీ.. వజ్రపాటి కంపెనీల్లో కానీ ఈ ఇంట్లోనే స్థానం లేదు అని అంటుంది.
నిషిక మనసులో ఇదేంటి ఇలా వదిన మాట్లాడుతుందని అనుకుంటుంది. వైజయంతి అలా యువరాజ్‌కి అనొద్దని అంటే నీ వల్ల వాడు ఇలా తయారయ్యాడు కనీసం ఇప్పుడు అయినా వాడు అయినా మారాలని కోరుకోవడం లేదు.. ఇప్పుడైనా మారాలి అని ప్రయత్నించండి అని అంటుంది. దానికి నిషిక మనసులో ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉంది ఇప్పుడు యువరాజ్‌కి ఆస్తి ఇవ్వకపోతే ఎలా అని అనుకుంటుంది.
సుధాకర్ యువరాజ్‌తో అందరి నమ్మకం పోగొట్టుకున్నావ్.. మాట అంటే వజ్రపాటి వారసుడు అంటావ్.. నీ వల్ల మా పరువు పోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నీ అంతట పోతావా మెడ పట్టుకొని గెంటేయాలా అని అంటాడు. వైజయంతి భర్తతో ఏంటి బా నువ్వు అలా మాట్లాడుతున్నావ్ అని అంటే సుధాకర్ భార్యకి లాగిపెట్టి కొట్టి ఇదంతా నీ వల్లే కేవలం నీ వల్లే కొడుకుని ఎలా పెంచాలో అది నేర్చుకో అని యువరాజ్‌ని పోరా బయటకు అని నెట్టేస్తాడు. కౌషికి కూడా ఆపాలని ప్రయత్నిస్తే సుధాకర్ ఆగడు.
యువరాజ్ బయటకు వెళ్లిపోతుంటే నిషిక ఆపుతుంది. నేను అన్యాయం అయిపోయాను.. నేను మా పుట్టింటికి పోతా.. లేదా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు ఏటిలోకి పోతా.. మీ కొడుకుని నమ్మి వచ్చినందుకు నేను మోసపోయాను.. మీరంతా నా గొంతు కోసేశారు. ఈ ఇంట్లో ఉండే అర్హత ఆయనకే లేనప్పుడు నాకు ఎక్కడ ఉంది. నిషికి వెళ్లిపోతుంటే జగద్ధాత్రి ఆపుతుంది. నా ప్లేస్‌లో నువ్వు ఉండు ఆలోచించవే అని అంటుంది. ఇంట్లో ఉండమని జగద్ధాత్రి అడిగితే మా ఆయనకు ఈ ఇంట్లో ఆఫీస్‌లో సగ భాగం ఇస్తాను అని కౌషికి వదినకి చెప్పమను అప్పుడే నేను ఉంటాను అని అంటుంది. మేం ఏం చేయలేం అని కేథార్ అంటే నిషిక ఏడుస్తూ బయటకు వెళ్తుంది. ఇంతలో నిషిక తండ్రి ఇస్తాడు.
నిషిక తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తున్నా నాన్న నాకే స్థానం లేదు మీరు ఎందుకు వచ్చారు అని ఏడుస్తుంది. నేను మాట్లాడుతా అని ఆయన నిషికని తీసుకొని లోపలికి వస్తారు. వైజయంతి నిషికతో ఎక్కడికి పోతావ్ అమ్మీ.. పరాయి వాళ్లే ఈ ఇంట్లో నువ్వు ఈ ఇంటి కోడలివి నీకేంటి అమ్మీ అని అంటుంది. దానికి నిషిక కోడలినే కానీ పెత్తనం మాత్రం కూతురిది అని అంటుంది.
నిషిక తండ్రి సుధాకర్‌తో ఎప్పుడూ లేదని ఇలా నా కూతురు వచ్చేయాలి అనుకుంది ఏంటి అని అంటే చెప్తాను బావగారు అని సుధాకర్ మొత్తం చెప్తాడు. నా అల్లుడు ఇలా చేశాడని తెలిసి నా కూతురు తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు అని నిషిక తండ్రి అంటారు. యువరాజ్ క్షమించమని అంటే సుధాకర్ ఈ సారికి క్షమిస్తాను కానీ నా ఆస్తి మాత్రం ఇచ్చి నా పరువు పోగొట్టుకోను అని అంటాడు. నా నిర్ణయం కూడా నేను చెప్తా అని నిషిక తండ్రి తన కూతుర్ని తీసుకెళ్లిపోతా అంటాడు. వైజయంతి అలా చేయొద్దని అడుగుతుంది. మీరే వాడిని బయటకు పోమన్నారు.. చేతిలో రూపాయి లేని వాడు భార్యని ఎలా పోషిస్తాడు. ఎలా చూసుకుంటాడు అని అంటారు.
కౌషికి సుధాకర్‌తో ఇంకో అవకాశం ఇద్దామని అంటుంది. సుధాకర్ సరే అంటాడు. కౌషికి తమ్ముడితో నీకు ఆరు నెలలు టైం ఇస్తున్నా .. ఈ 6నెలల్లో మంచోడిలా మారి అడ్డు దారులు తొక్కడం లేదని తెలిస్తేనే నీకు ఆస్తి ఇవ్వగలను లేదంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను అని అంటుంది. నిషికతో ఆమె తండ్రి మీ మామయ్య, వదినలు భరోసా ఇచ్చారు కదా.. వెయిట్ చేయ్ అని చెప్తాడు.
నిషిక యువరాజ్‌తో మా అక్క మా అక్క అంటావ్ కదా చూడు నీ నెత్తి మీద పంగనామం పెట్టాలి అనుకుంది. సమయానికి మా నాన్న వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఆస్తి మొత్తం కేథార్‌కి వెళ్లిపోయేది అని అంటుంది. ఇక యువరాజ్ ఆరు నెలలు ఆఫీస్‌కి రావొద్దని అక్క అంది కదా ఈ ఆరు నెలలు మనకి డబ్బు ఎలా వస్తుంది అంత వరకు ఏదో ఉద్యోగం చేసుకోవాలి అంటాడు. మీనన్ ఎంత ఇస్తాడు అని నిషిక అడుగుతుంది. దానికి యువరాజ్ మా అక్క ఇచ్చిన డబ్బుకి మూడు రెట్లు ఇస్తాడు. అదీ పోయింది ఇదీ పోయింది అని యువరాజ్ అంటే దానికి నిషిక ఎందుకు మీనన్ దగ్గర జాబ్ వదులుకోవద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.




















