అన్వేషించండి

Jagadhatri Serial Today September 6th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి ఎవరు? యువరాజ్ కుటుంబానికి ముప్పు! మీనన్ మాస్టర్ ప్లాన్.. JD, KD ల పోరాటం!

Jagadhatri Serial Today Episode September 6th సుధాకర్‌కి కేథార్‌తో పాటు శ్రీవల్లి కూడా కూతురే అని తెలీడంతో ఈవారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

 Jagadhatri Serial Today Episode కౌషికి బాబుని మరోసారి కిడ్నాప్ చేయాలని అత్త ఆదిలక్ష్మీ ప్రయత్నిస్తుంది. గుడిలో బాబుని కిడ్నాప్ చేయిస్తుంది. బాబుని శ్రీవల్లి అనే ఒకమ్మాయి కాపాడుతుంది. కానీ కౌషికి, జగద్ధాత్రి ఆ అమ్మాయిని తిడతారు. అందుకు సంబంధించి వీడియో కాస్త వైరల్ అయిపోతుంది. తర్వాత జగద్ధాత్రి, కేథార్‌లు గుడిలో సీసీ టీవీ ఫుటేజ్ చూసి ఆ అమ్మాయి తప్పు ఏం లేదని తెలుసుకుంటారు. తర్వాత శ్రీవల్లి తప్పు చేయలేదని కౌషికికి చెప్తారు. పోలీసులు శ్రీవల్లిని అరెస్ట్ చేసేటైంకి ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి వీడియో చూపించి శ్రీవల్లి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు. కౌషికి శ్రీవల్లికి సారీ చెప్తుంది. 

జగద్ధాత్రి కూడా క్షమాపణ చెప్తుంది. శ్రీవల్లి కోపంగా మీరు ఎందుకు అండీ సారీ చెప్తారు. అడగని సాయానికి వచ్చే విలువ ఏంటో నాకు బాగా తెలిసోచ్చేలా చేశారు. ఎదుటి మనిషికి సాయం చేసే పరిస్థితిలో నేను లేను అని గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటుంది. మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని శ్రీవల్లి చాలా హర్ట్ అయి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత జగద్ధాత్రి, కేథార్లు ఈ కిడ్నాప్ మొత్తం ఆదిలక్ష్మీ చేయించిందని చెప్తారు. కౌషికి షాక్ అయిపోతుంది. ఏం చేస్తే తన అనుమానం తగ్గించుకుంటారో  అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. 

శ్రీవల్లి తాను ఉండే అనాథాశ్రమానికి వెళ్తే ఆశ్రమం వార్డెన్ శ్రీవల్లి బట్టలు బయటకు విసిరేసి నీలాంటి క్రిమినల్ ఇక్కడ ఉండకూడదు పూజకి వెళ్తాను అని చెప్పి పిల్లాడిని కిడ్నాప్ చేస్తావా అని శ్రీవల్లిని గెంటేస్తారు. శ్రీవల్లి ఏడుస్తూ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా బాబాయ్ ఇలా నన్ను గెంటేస్తే మళ్లీ అనాథని అయిపోతా అని ఏడుస్తుంది. దాంతో ఆయన నువ్వు పుట్టుకతో అనాథవే.. మెడ పట్టుకొని బయటకు గెంటేసే పరిస్థితి తెచ్చుకోకు అని గెంటేస్తారు.  శ్రీవల్లితో ఇదిగో మీ అమ్మ ఫొటో అని విసిరేస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రీవల్లి కూడా సుధాకర్‌ కూతురే అని తెలుస్తుంది. 

శ్రీవల్లి తల్లి సుధాకర్ మొదటి భార్య సుహాసినినే. అంటే శ్రీవల్లి కేథార్‌కి సొంత చెల్లి.. శ్రీవల్లి తల్లి ఫొటో పట్టుకొని బతుకునిచ్చి చంపేశావ్ కదమ్మా అమ్మా.. నాన్న ఎవరో తెలీదు.. ఇక్కడ నేను అనాథగా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా బతకాలో తెలీదు. నీ ప్రేమ అండగా ఉంటుంది అనే నమ్మకంతో వెళ్తున్నా అని బయటకు వెళ్లిపోతుంది. 

మరోవైపు సుధాకర్ చిన్ననాటి ఫ్రెండ్ ప్రొఫెసర్ సుందరం అతని భార్య ఇంటికి వస్తాడు. సుధాకర్ ఇంట్లో అందరినీ వాళ్లకి పరిచయం చేస్తారు. సుందరం కేథార్‌ని చూపించి వీళ్లు ఎవర్నా అని అడిగితే సుధాకర్ ఫ్లోలో వాడు కేథార్ నాపెద్ద కొడుకు అని చెప్తాడు. తర్వాత తేరుకొని నా పెద్ద కొడుకు లాంటివాడు అని చెప్తాడు. ఇక సైంటిస్ట్ సుందరం నీటితో నడిచే వాహనం తాయారు చేశారని ప్రాజెక్ట్ డేటా అంతా సబ్మిట్ చేస్తున్నాం అని అందరికీ రమ్మని చెప్తారు. మీడియా కవరేజ్‌కి కౌషికి పర్మిషన్ అడుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న మీనన్ యువరాజ్‌కి కాల్ చేసి ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డేటా కొట్టేస్తే మిలియనీర్స్ అవుతామని చెప్తాడు. మీనన్‌తో యువరాజ్ భాయ్ అని  మాట్లాడటం విన్న నిషి భర్తని ప్రశ్నిస్తుంది.   

నీటితో నడిచే యంత్రం తయారు చేసిన ప్రొఫెసర్‌ని మీనన్ గ్యాంగ్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడంతో జేడీ, కేడీలు ప్రొఫెసర్‌ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. ప్రొఫెసర్ సుందరం ఆ ప్రాజెక్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి  గవర్నమెంట్ ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. ప్రొఫెసర్ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పకముందు అతన్ని కిడ్నాప్ చేయాలని మీనన్ రౌడీలు ఫాలో అవుతారు. అయితే జేడీ, కేడీలు బాడీ డబుల్ అంటే ప్రొఫెసర్‌లా మరో వ్యక్తిని రెడీ చేసి అతన్ని మీనన్ ఫాలో అయ్యేలా చేస్తారు. దారిలో రౌడీలు జేడీ, కేడీల మీద అటాక్ చేస్తారు. జేడీ కేడీలు రౌడీలను చితక్కొడతారు. మరోవైపు యువరాజ్ హెల్మెట్ పెట్టి బైక్ మీద ప్రొఫెసర్‌ కార్‌ని ఫాలో అవుతాడు. పోలీసుల్ని గన్‌తో కొట్టి ప్రొఫెసర్ కోసం కారులో చూస్తాడు. అందులో ప్రొఫెసర్‌ లేకపోవడం చూసి షాక్ అయిపోతాడు యువరాజ్. వెంటనే మీనన్‌కి కాల్ చేసి భాయ్ ఇందులో ప్రొఫెసర్ లేడని చెప్తాడు. నేను కారు ఎక్కడ చూశానని మీనన్ అంటాడు. దానికి యువరాజ్ బాడీ డబుల్ యూజ్ చేశారని అంటాడు. మీనన్ షాక్ అయిపోతాడు.

సుధాకర్, వైజయంతి, నిషికలు కారు చెడిపోవడంతో రోడ్డు మీద వెయిట్ చేస్తారు. ఇంతలో ప్రొఫెసర్‌ వాళ్లు సేమ్ రూట్‌లో రావడంతో ప్రొఫెసర్‌ సుధాకర్ వాళ్లని ఎక్కించుకుంటాడు. జగద్ధాత్రి రమ్యకి కాల్ చేసి మీనన్‌కి బాడీ డబుల్ గురించి తెలిసిపోయిందని చెప్తుంది. ఇక రమ్య సుధాకర్ వాళ్లు కారు ఎక్కారని రమ్య చెప్పడంతో జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. జేడీ రమ్యతో ప్రొఫెసర్‌ నెంబరు ఆపేయమని వాళ్లని మీ కారులో మీరు వాళ్ల కారులో షిఫ్ట్ అవ్వండి.. బ్లాక్ హెల్మ్‌ట్‌ వేసుకొని ఒకడు బైక్ మీద వస్తున్నాడు జాగ్రత్త అవసరం అయితే షూట్ చేసేయమని చెప్తుంది. 

యవరాజ్ కారు ఆపించి డ్రైవర్‌ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత కారులో సుధాకర్ వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ఇక డ్రైవర్ చనిపోవడంతో నిషిక, వైజయంతి వణికి పోతారు. యువరాజ్ రమ్య, కిరణ్‌ని కొడతాడు. యువరాజ్ మీనన్‌కి కాల్ చేసి కారులో నా ఫ్యామిలీ ఉంది షూట్ చేయలేను అని అంటాడు. వాళ్లు ఆ కారులో ఎక్కడం వాళ్ల తప్పు నువ్వు ఇప్పుడు షూట్ చేయకపోతే ఆ ఫ్యామిలీని నేను చంపేస్తా అని  మీనన్ యువరాజ్‌ని బెదిరిస్తాడు. దాంతో యువరాజ్ కారులో తన కన్న వాళ్లని భార్యని కూడా బెదిరించి కారులో అందర్ని తీసుకొని వెళ్లిపోతాడు. జేడీ, కేడీలు అక్కడికి వస్తే రమ్య, కిరణ్‌లు జరిగింది అంతా చెప్తారు. యువరాజ్ హార్డ్‌ డిస్క్ ఇవ్వమని ప్రొఫెసర్‌ని అడుగుతాడు. ప్రొఫెసర్ హార్డ్ డిస్క్ తన దగ్గర లేదని చెప్తాడు. యువరాజ్ షాక్ అయిపోతాడు. మీనన్‌కి విషయం చెప్తే మీనన్ షాక్ అయిపోతాడు. జేడీ హార్డ్ డిస్క్ తీసుకొని దెబ్బ కొట్టిందని తనకి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడు. అందుకు ప్రొఫెసర్ నడుం చుట్టూ బెల్ట్ బాంబ్ పెట్టేస్తారు. ఆడిటోరియంలో నీటియంత్రం ఇంకా తయారవ్వలేదని చెప్పమని హార్డు డిస్క్ తనకు ఇచ్చేయమని బెదిరిస్తాడు. ఆ విషయం ఎవరీకి చెప్పొద్దని చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టి కాల్ చేసి ప్రొఫెసర్‌తో లైన్‌లో ఉంటాడు. ప్రొఫెసర్‌ వాళ్ల లొకేషన్ ట్రేస్ చేసిన జేడీ, కేడీలు కారులో అందరూ సురక్షితంగా ఉండటం చూసి షాక్ అయిపోతారు. మీనన్ ఏదో ప్లాన్ చేశాడని అనుకుంటారు. ప్రొఫెసర్ కంగారు చూసి జేడీ, కేడీలకు ఇంకా అనుమానం పెరుగుతుంది. ఎంత అడిగినా ప్రొఫెసర్ ఏం చెప్పరు.   

మీనన్ తనకు హార్డు డిస్క్ వచ్చేస్తే అమ్మేసి అపర కేభేరుడిని అయిపోతానని అనుకుంటాడు. ఆడిటోరియంలో జరుగుతున్న లైవ్‌ని యువరాజ్‌తో కలిసి చూస్తుంటాడు. యాంకర్ ప్రొఫెసర్‌ని పిలిచి మాట్లాడమని అంటాడు. ప్రొఫెసర్ వెళ్లి వణికిపోతూ ఉంటాడు. జేడీ కేడీతో అందరూ నార్మల్‌గా ఉన్నారు కానీ ఒక్క ప్రొఫెసర్ భయంగా ఉన్నారని అంటుంది. ప్రొఫెసర్ నెంబరుకి కాల్ చేయమని అంటుంది. కాల్ బిజీగా వస్తుందని కేడీ చెప్పడంతో మీనన్ లైన్‌లో ఉన్నాడు. ఇక్కడ జరిగింది అంతా వింటున్నాడు.. అని జేడీ అంటుంది.  మీనన్ మరోసారి బెదిరించడంతో ప్రొఫెసర్ తన ప్రాజెక్ట్ పూర్తి కాలేదని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఏడాది పడుతుందని అంటాడు. జేడీకి మొత్తం అర్థమైపోతుంది. మీనన్ ఇలా చెప్పించేస్తే ఇక ఎవరూ పట్టించుకోరని తర్వాత ఆ డేటా కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడని లైవ్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని జేడీ అంటుంది. వెంటనే లైవ్ ఆపాలని కౌషికి దగ్గరకు వెళ్లి లైవ్‌ ఆపమని సుందరం గారికి ప్రమాదం ఉందని చెప్తుంది. కౌషికి లైవ్ ఆపించేస్తుంది. మీనన్ లైవ్ రాకుండా ప్రోగ్రాం రావడంతో షాక్ అయిపోతాడు.  

యువరాజ్‌తో మీనన్ సీన్‌లోకి జేడీ దిగేసింది.. నా ప్లాన్ పసిగట్టేసింది. ఇక రక్తం పాతం చేయాల్సిందే అని అంటాడు.  వెంటనే జేడీకి కాల్ చేస్తాడు. నీ తెలివికి జోహార్‌ జేడీ.. ఈ ప్రోగ్రాం హీరో సుందరాన్ని ఒక్క సారి చూడు నేను తలచుకుంటే వాడు ఉండడు. అర్థం కాలేదా వాడి నడుముకి బెల్ట్ బాంబ్ పెట్టాను.. షాక్ అయ్యావ్ కదూ.. రిమోట్ నొక్కితే వాడు చస్తాడు.. అని మీనన్ అంటాడు. నీకేం కావాలి అని జేడీ అడుగుతుంది. ఏం తెలీనట్లు భలే అడుగుతావ్ జేడీ నువ్వు.. నువ్వు ఆపించిన లైవ్ టెలీకాస్ట్ కాకపోతే నువ్వు ఆ హార్డ్ డిస్క్ నాకు తిరిగి ఇవ్వకపోతే బాంబ్ పేలిపోతుందని అంటాడు.  

జేడీ అక్కడున్న వాళ్లని తప్పించాలని కేడీకి సైగ చేసి చెప్పడంతో కేడీ లేవమని హాల్లో ఉన్న వారికి చెప్తాడు. దాంతో ఇద్దరు లేవడంతో కుర్చీల కింద ఉన్న బాంబ్‌లు పేలుతాయి. అందరూ బిత్తర పోతారు. జేడీ, కేడీలు షాక్ అయిపోతారు. మీనన్ నవ్వుతూ కుర్చీల మీద నుంచి లేచినా కూడా బాంబ్ పేలిపోతుంది. ఎవరూ లేచినా సరే బాంబ్ బ్లాస్ట్‌ అఅయిపోతుంది. ఎంత మంది చస్తారో తెలీదు.. ఆడిటోరియం పేలిపోతుంది అని అంటాడు మీనన్. 

జేడీ వెంటనే అందరితో మీ కుర్చీల కింద బాంబ్‌లు ఉన్నాయి ఎవరూ లేవకండీ అని చెప్తుంది.  ఆడిటోరియం డోర్స్ మీనన్ తన మనుషులతో మూయించేస్తాడు. యువరాజ్ మీనన్‌తో లోపల నా ఫ్యామిలీ కూడా ఉంది వాళ్లని బయటకు తీసుకురా అని అంటే మీనన్ యువరాజ్‌ని నోర్ముయ్‌ అని నేను చెప్పడం మాత్రమే నీ ముందు ఉన్న ఆప్షన్‌ అని అంటాడు. జేడీ కేడీతో వాడు చెప్పినట్లు చేయలేం.. అందరిని కాపాడాలి అంటే మీనన్‌ని డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది. వెంటనే జేడీ ఇందులో యువరాజ్‌ ఉన్నట్లున్నాడు కాబట్టి ఇక్కడి భయం యువరాజ్‌కి చేరాలని అనుకుంటారు. అందుకు కేడీ, జేడీలు సుందరం దగ్గరకు వెళ్లి ఆయనకు బెల్ట్ బాంబ్ ఉందని చూపించి వైజయంతి, నిషికలు భయపడేలా చేసి యువరాజ్‌కి వాళ్లు కాల్ చేసేలా చేస్తారు. ఏడుస్తూ యువరాజ్‌కి  విషయం చెప్తారు. ఇవే మేం నీతో మాట్లాడుతున్న చివరి మాటలు అని ఇద్దరూ ఏడుస్తారు. భార్య, తల్లి మాటలకు యువరాజ్ ఎమోషనల్ అయిపోతాడు. నా ఫ్యామిలీకి ఏం కాకూడదు అని యువరాజ్ అనుకుంటాడు. కేడీ బెల్ట్ బాంబ్ ప్రొఫెసర్ నడుం దగ్గర నుంచి తీసేస్తాడు. అయితే ఆ బాంబ్ టైమర్ మొదలైపోతుంది.  ఇవీ ఈ వారం హైలెట్స్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Binni And Family OTT: థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Binni And Family OTT: థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి... బాలీవుడ్ హీరో కజిన్ కూతురి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
Embed widget