Illu Illalu Pillalu Serial Today Episode March 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు మళ్లీ రైస్‌మిల్లుకి వెళ్తాడా! నర్మదకి ఆఫీస్‌లో అవమానం!
Illu Illalu Pillalu Serial Today Episode March 6th | వేదవతి రామరాజుని ఒప్పించి రైస్‌మిల్లుకి పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కారు ఫైనాన్స్ కోసం డబ్బులు తీసుకోవడానికి ఓ ఫైనాన్స్ ఆఫీస్‌కి వెళ్తారు. ఇద్దరూ మాట్లాడితే అతను షూరిటీగా ఏం పెడతారు అని అడుగుతారు. ధీరజ్ సర్టిఫికేట్స్ పెడతా అంటాడు. ప్రేమ కూడా పెడతా అని అంటుంది. సర్టిఫికేట్స్ పెడితే డబ్బు ఇవ్వరు.. ఇళ్లు, బంగారం ఇలా ఏమైనా పెడితే ఇస్తామని ఆయన చెప్పడంతో ధీరజ్ బతిమాలుతాడు.
ప్రేమ అతనితో మా మామయ్య గారు రామరాజు గారు ఆయన సంతకం పెడితే ఇస్తారా అని అడిగితే రామరాజు కొడుకువా అని మీ నాన్నతో సంతకం పెట్టించమని అంటాడు. ధీరజ్ సరే అంటాడు. మరోవైపు ఇడ్లీబాబాయ్ టిప్పు టాపు మీద రెడీ అయి రైస్ మిల్లుకి వస్తాడు. అందరూ మూటలు మోస్తూ అతన్ని గుర్తించకుండా నెట్టేయడంతో నేను ఏదో ఒక పని చేసి బిల్డప్ ఇస్తా అని మూట మోయాలని అనుకుంటాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ధాన్యం మూటలు మోయాలి అంటాడు. నేను ఎవరు అనుకున్నావ్ ఈ రైస్ మిల్లు ఓనర్ వియ్యంకుడిని అని అంటాడు. ఇక తిరుపతి కూర్చొని లేచిన కుర్చీలో కూర్చొని డబ్బు నొక్కేస్తా అనుకుంటాడు. కుర్చీలో కూర్చొడానికి భయపడి భాగ్యానికి కాల్ చేస్తాడు.
భాగ్యం భర్తతో వెళ్లి ఏం చేయాలి అని అడిగితే వెళ్లి కుర్చీలో కూర్చొ అన్నీ దక్కించుకో అని చెప్తుంది. కుర్చీలో కూర్చొంటా అన్నీ దక్కించుకుంటా.. దోచేస్తా అని ఇడ్లీ బాబాయ్ కూర్చొంటాడు. రామరాజు ఇంటి దగ్గర బాధగా కూర్చొని ఉంటే వేదవతి వెళ్లి టీ కాఫీలు ఇస్తుంది. రామరాజు వేదవతితో నేను ఇంట్లో ఉండటం నీకు ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. మిమల్ని ఇలా ఇంట్లో చూడటం ఏదోలా ఉంది.. మీరు ఉదయం రైస్‌మిల్లుకి వెళ్తే చకచకా టిఫెన్ చేయడం.. మధ్యాహ్యానికి వండటం మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటం మాత్రమే తెలుసు అంటుంది. మరేం చేయను బుజ్జమ్మ ఒక వైపు అమూల్య మరోవైపు నడిపోడు సమస్య ఇంటి నుంచి బయటకు వెళ్లేను అని అంటాడు. మీరు ఇలా ఉండొద్దు ఎవరి ఇంట్లో సమస్యలు ఉండవు.. రైస్‌మిల్లుకి వెళ్లండి అని బతిమాలుతుంది. మీరు కచ్చితంగా వెళ్లాల్సిందే అని తీసుకెళ్తుంది.
శ్రీవల్లి చూసి మామయ్య వెళ్తే రైస్‌మిల్లు పెత్తనం వచ్చినట్లే వచ్చి పోతుందని వెంటనే మామ వెళ్లకుండా ఆపాలి అని క్యారేజ్ సర్దేసి మరోవైపు నుంచి రామరాజు కంటే ముందు రైస్‌మిల్లుకి వెళ్తుంది. మరోవైపు ఆఫీస్‌లో నర్మద ఫ్రెండ్స్ నర్మద వినేలా.. భర్తకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంది.. కానీ జాబ్ లంచం ఇచ్చి కొనేశారు.. అని నానా మాటలు అంటారు. నర్మద ఏడుస్తుంది. ఇంతలో ఇంకో ఫ్రెండ్ వచ్చి నర్మదకు తెలీకుండా తన ఫ్రెండ్ చేసిన తప్పునకు తనని ఎందుకు అంటారు అని తిడుతుంది. నర్మద అక్కడ ఉండలేక వెళ్లిపోతుంది. ధీరజ్ ప్రేమ వస్తూ ఉంటారు. ప్రేమ ఓ చోట ఐస్‌క్రీమ్ బండి చూసి ఆపుతుంది. ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్లు తింటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















