(Source: ECI | ABP NEWS)
Jagadhatri Serial Today October 20th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్ అరెస్ట్: కేథార్ కుట్రనా? అసలు నిజం ఏమిటి? మల్లన్న హత్య కేసులో ట్విస్ట్!
Jagadhatri Serial Today Episode October 20th యువరాజ్ మల్లన్నని హత్య చేశాడు అని పోలీసులు యువరాజ్‌ని అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్ కేథార్‌కి తన కుటుంబాన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. కేథార్ యువరాజ్‌తో థ్యాంక్స్ వద్దని తనతో పాటు ఓ చోటుకి రమ్మని చెప్పి కారులో ఎక్కించుకుంటాడు. ఎక్కడికి తీసుకొచ్చావ్‌రా అని యువరాజ్ అడిగితే కేథార్ గతంలో మీనన్‌తో కలిసి ప్రొఫెసర్ కోసం చంపేసిన డ్రైవర్ ఇంటికి తీసుకెళ్తాడు.
డ్రైవర్ ఫ్యామిలీ కూటికి కూడా గతి లేని స్థితిలో ఉంటారు. ఇంటావిడ కూతుర్ని పెంచలేక నానా అవస్థలు పడుతుంటారు. కేథార్ ఆ ఇంటావిడతో మీ భర్తకి 5 లక్షలు ఇన్సూరెస్స్ వచ్చింది ఈ సారే ఇప్పించారని యువరాజ్‌ని చూపిస్తుంది. యువరాజ్ కాళ్లని మొక్కుతుంది. యువరాజ్ చేతుల మీదగా కేథార్ ఆ డబ్బుని ఇప్పిస్తాడు. భవిష్యత్‌లో ఏం అవసరం వచ్చినా మేం చూసుకుంటాం అని చెప్తారు. ఇక ఆవిడ తన భర్తని చంపేసిన వ్యక్తిని తిడుతుంది. అలాంటి వాళ్ల మారాలి.. మాలా ఇంకెవరూ కాకూడదు సార్ అని చెప్తుంది. యువరాజ్ చాలా పశ్చాత్తాపపడతాడు. నా తమ్ముడికి ఎవరి శాపాలు తగల కూడదు అని కేథార్ అంటాడు.
యువరాజ్ మొండిగా నువ్వు చెప్పింది నేను వినను.. వజ్రపాటి వారసుడు యువరాజ్ ఒక్కడే.. నా దృష్టిలో నువ్వు అనాథవి.. ఒక థ్యాంక్స్ చెప్పా అని నువ్వు నాకు అన్నవి అయిపోవు అని చెప్పేసి వెళ్లిపోతాడు. శ్రీవల్లి వైజయంతి మాటలు తలచుకొని ఏడుస్తుంది. వైజయంతి శ్రీవల్లిని చూసి ఎప్పుడు వెళ్తుందా అని అనుకుంటుంది. యువరాజ్ ఇంట్లో లేడని సుధాకర్ వైజయంతిని అడుగుతాడు. యువరాజ్ బయటకు వెళ్తే ఏదో ఒక పెంట పని చేస్తాడు ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు. ఇంతలో యువరాజ్ వస్తాడు.
నిషిక యువరాజ్ దగ్గరకు వెళ్లి కేథార్‌తో ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని యువరాజ్ అంటాడు. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు. సుధాకర్ వాళ్లు కూడా బయటకు వస్తారు. పోలీసులు వచ్చి ఎక్కడికి పారిపోతున్నావ్ అని యువరాజ్‌ని అడుగుతారు. ఇక పోలీసులు కౌషికి వాళ్లతో యువరాజ్ బార్‌లో ఓ వ్యక్తితో గొడవ పడి హత్య చేశాడని అంటారు. యువరాజ్ తనకేం తెలీదు అంటాడు. సాక్ష్యం ఉందా తనే చేశాడని తెలుసుకున్నారా అని జగద్ధాత్రి అడుగుతుంది. సాక్ష్యం ఉందని మల్లన్నని కిడ్నాప్ చేశాడని ప్రత్యక్షసాక్ష్యులు చూపి చెప్పారని అంటారు.
యువరాజ్ కారుని పోలీసులు చెక్ చేస్తారు. కారు డిక్కీలో చూస్తే ఓ సూట్ కేస్‌లో మల్లన్న బాడీ కనిపిస్తుంది. కేథార్‌తో పాటు అందరూ షాక్ అయిపోతారు. హత్యలు కూడా చేస్తున్నావారా అని సుధాకర్ అంటాడు. యువరాజ్ తండ్రి కాలు పట్టుకొని నేను ఏ తప్పు చేయలేదు అని అంటాడు నేనేం చేయలేదు నాన్న నాకు తెలీదు. నన్ను నమ్ము నాన్న అంటే ఈ జన్మలో నేను నిన్ను నమ్మనురా అని సుధాకర్ చెప్పి పోలీసుల్ని యువరాజ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లమని అంటాడు. యువరాజ్ తనే తప్పు చేయలేదు అమ్మ అక్క అందరికీ చెప్తాడు. జగద్ధాత్రి, కేథార్ అందరూ యువరాజ్ అలా చేసుండడు.. అని అంటారు.
పోలీసులు యువరాజ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. వైజయంతి, నిషి ఏడుస్తారు. నిషి కోపంగా కేథార్ దగ్గరకి వెళ్లి నువ్వే చేశావ్ కదా ఇందాక యువరాజ్‌ని బయటకు తీసుకెళ్లింది నువ్వు అని అంటాడు. ఇద్దరూ కూడా వెళ్లి వచ్చేటప్పుడు వదిలేశావ్.. ఈ హత్య కేథార్ చేసి యువరాజ్ మీద నింద వేశాడని నిషి అంటుంది. అందరూ యువరాజ్‌ని ఎందుకు తీసుకెళ్లావ్ అని కేథార్‌ని అడుగుతారు. కేథార్ తండ్రితో యువరాజ్ వల్ల ప్రాబ్లమ్‌లో పడుతున్న కుటుంబం దగ్గరకు తీసుకెళ్లాఅని అంటాడు. నువ్వేం తప్పు చేయవు అని నాకు తెలుసు అని సుధాకర్ అంటాడు. నా కొడుకు ఏం చేయలేదు అని వైజయంతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















