తెలుసు కదా ప్రీ రిలీజ్ బిజినెస్... స్టార్ బాయ్ సిద్ధూ ముందున్న టార్గెట్ ఎంతంటే?

Published by: Satya Pulagam

నైజాంలో సిద్ధూ క్రేజ్ బావుందమ్మా!

నైజాం... తెలంగాణ ఏరియాలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ బావుంది. అది ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కనిపించింది. 'తెలుసు కదా' రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మినట్టు తెలిసింది.

ఆంధ్రాలో బిజినెస్ తక్కువేం కాదు!

ఆంధ్రలోనూ 'తెలుసు కదా' బిజినెస్ తక్కువ ఏం కాదు. అక్కడ అన్ని ఏరియాల నుంచి రూ. 6 కోట్లు వచ్చినట్టు తెలిసింది.

మరి రాయలసీమ రైట్స్ ఎంత!?

నైజాం ఏరియా రైట్స్ రూ. 8 కోట్లు, ఆంధ్రలో అన్ని ఏరియాల రైట్స్ రూ. 6 కోట్లకు ఇచ్చిన నిర్మాతలు... రాయలసీమ (సీడెడ్) హక్కులను రూ. 2.50 కోట్లకు ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా కలిపి?

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా 'తెలుసు కదా' నిర్మాతలకు మరొక కోటిన్నర వచ్చినట్టు తెలిసింది. అప్పుడు టోటల్ ఇండియా రైట్స్ వేల్యూ... రూ. 18 కోట్లు అయ్యింది.

ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి ఎలా??

ఓవర్సీస్ నుంచి సైతం సిద్ధూ జొన్నలగడ్డ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. 'తెలుసు కదా' సినిమాకు విదేశాల నుంచి రైట్స్ ద్వారా రూ. 4 కోట్లు వచ్చాయట.

'తెలుసు కదా' టోటల్ బిజినెస్ ఎంత?

ఆల్ ఓవర్ వరల్డ్ 'తెలుసు కదా' టోటల్ బిజినెస్ చూస్తే... 22 కోట్ల రూపాయలు.

ఇప్పుడు సిద్ధూ ముందున్న టార్గెట్?

'తెలుసు కదా' వరల్డ్ వైడ్‌గా రూ. 22 కోట్ల బిజినెస్ సొంతం చేసుకోగా... క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఓవరాల్ రూ. 23 కోట్ల షేర్ అందుకోవాలి.

జాక్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మంచి హిట్స్ అందుకున్నారు. అయితే 'జాక్' ఆయన జోరుకు బ్రేకులు వేసింది. ఇప్పుడు 'తెలుసు కదా'తో మళ్ళీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

'తెలుసు కదా' తర్వాత పాన్ ఇండియా!

'తెలుసు కదా' తర్వాత 'బ్యాడాస్' సినిమా చేస్తున్నారు. అది పాన్ ఇండియా రిలీజ్ అయ్యే సినిమా. 'కోహినూర్' అని మరొక సినిమా చేస్తున్నారు. అదీ పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ తీసే చిత్రమే.