డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... ప్రదీప్ రంగనాథన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

Published by: Satya Pulagam

తమిళనాడులో భారీ రేటుకు...

తమిళనాడులో 'డ్యూడ్' థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 31 కోట్లు వచ్చినట్టు తెలిసింది. 

తెలుగు రాష్ట్రాలు @ 10 కోట్లు!

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రల్లో 'డ్యూడ్' థియేట్రికల్ రైట్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలిసింది.

తెలుగులో ఏ ఏరియా రైట్స్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో రూ. 4.5, రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.5 కోట్లు, ఆంధ్రలో రూ. 4 కోట్లకు అమ్మినట్టు తెలిసింది.

ఓవర్సీస్ రైట్స్ ఎంతంటే?

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'డ్యూడ్' మంచి బిజినెస్ చేసింది. విదేశాల్లో రూ. 12 కోట్ల బిజినెస్ అందుకుంది.

ఇండియాలో మిగతా ఏరియాలు?

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మినహాయిస్తే... కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో థియేట్రికల్ ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ. 6 కోట్లు వచ్చాయని తెలిసింది.

'డ్యూడ్' టోటల్ బిజినెస్ ఎంత?

'డ్యూడ్' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... మొత్తంగా 59 కోట్ల రూపాయలు వచ్చాయి.

'డ్యూడ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయల షేర్ వస్తే... 'డ్యూడ్' బిజినెస్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టినట్టు అవుతుంది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ రావాలి.

మంచి బజ్ ఉంది కాబట్టి...

'డ్యూడ్'లో ప్రదీప్ రంగనాథన్ జంటగా 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. సినిమాకు మంచి బజ్ ఉండటంతో పాటు దీపావళి సీజన్ రిలీజ్ కనుక 100 కోట్ల గ్రాస్ రావడం కష్టం ఏమీ కాదు.

డ్యూడ్ హిట్ అయితే హ్యాట్రిక్

'లవ్ టుడే', 'డ్రాగన్' విజయాలతో ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ రెండు 100 కోట్ల సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది.