అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

Nuvvunte Naa Jathaga Today Episode Oct 20th దేవుడమ్మ కొడుకుని కొట్టడం వల్ల దేవాని చంపేయాలని దేవుడమ్మ ప్రయత్నిస్తుందని పోలీసులు చెప్పి దేవాని లొంగిపోవాలని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఎమ్మెల్యే కొడుకుని చితక్కొట్టడం చూసిన మిథున కోపంగా ఇంటికి వస్తుంది. బయట ఉన్న కాంతం భర్త చెప్పినా వినకుండా కాపురం బాగుండాలని పూజలు వ్రతాలు చేసేస్తున్నారు.. ఎన్ని చేసినా అది జరగదు అని కొన్ని అమాయకపు గొర్రెలకు తెలీదు.. దేవా ఈ జన్మలో రౌడీయిజం మానడు.. రోడ్డు మీద ఎప్పుడూ ఎవరినో ఒకర్ని కొడుతూనే ఉంటాడు అని కాంతం అనగానే ఏయ్ అని మిథున పక్కనున్న బొమ్మ విసిరేస్తుంది. కాంతం గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

మిథున ఇంట్లోకి వెళ్తుంది. అత్త మాట్లాడినా తలూపుతుంది కానీ సరిగా సమాధానం చెప్పదు.. ఏమైందా అని సత్యమూర్తి మిథునని చూస్తాడు. ఇంతలో దేవా రావడంతో మిథున కోపంగా ఆగు ఎక్కడి  నుంచి వస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వేం వార్డెన్ కాదు ఇదేం హాస్టల్‌ కాదు నేను నీకు సమాధానం చెప్పడానికి అని దేవా అంటాడు. చేతికి ఈ దెబ్బ ఎందుకు తగిలింది.. రక్తం ఎందుకు వస్తుంది అని మిథున అడిగితే అది రక్తం కాదు గ్యారేజ్‌లో గ్రీజు తగిలిందని అంటాడు.
Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

మిథున దేవాతో  కోపంగా నేనేం చిన్న పిల్లని కాదు. చేతికి రక్తం అంటిందో గ్రీజు అంటింది తెలీదు అనుకోకు. గ్రీజు అని మభ్యపెట్టగలవు కానీ రోడ్డు మీద ఆ కుర్రాడిని చచ్చేలా కొట్టిన విషయం ఏం చెప్పి మభ్యపెట్టగలవు.. రోడ్డు మీద నువ్వు ఆ అబ్బాయిని దారుణంగా రాక్షసుడిలా కొట్టడం నేను చూశా అని మిథున అంటుంది. అందరూ బిత్తర పోతారు. శారద కంగారుగా వచ్చి ఏంట్రా మిథున చెప్పేది నిజమా అని అడిగితే మిథున అత్తతో నడిరోడ్డు అత్తయ్యా ఆ అబ్బాయిని పరుగెత్తించి పరుగెత్తించి కొట్టాడు ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలీదు అని అంటుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

సత్యమూర్తి కోపంగా రేయ్ మళ్లీ మొదలు పెట్టావా.. నువ్వు మారుతావు అని అనుకున్న ప్రతీ సారి మమల్ని మోసం చేస్తున్నావ్.. మృగం కంటే దారుణంగా తయారవుతున్నావ్ ఛా అని అంటాడు. వాడు క్షమించరాని తప్పు చేశాడు నాన్న అని దేవా అంటాడు. అంత తప్పు ఏంట్రా అని ఆనంద్ అడిగితే నేను చెప్పలేను అని దేవా అంటాడు. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి నువ్వు ఎవరు అని మిథున అంటుంది. అతను చేసిన తప్పు ఏంటి అని మిథున వాళ్లు అడుగుతారు. దేవా ఏం చెప్పకుండా వాడు ప్రాణం తీయడం కంటే పెద్ద తప్పు చేశాడు అది మీతో చెప్పలేను అని చెప్పి వెళ్లిపోతాడు. 

ఎమ్మెల్యే కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటాడు. దేవా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకురారు. దేవుడమ్మ హాస్పిటల్‌కి వచ్చి రణధీర్ పరిస్థితి చూసి ఏడుస్తుంది. నా కొడుకుని ఇంత దారుణంగా ఎవరు కొట్టారని దేవుడమ్మ పోలీసుల్ని అడిగితే పురుషోత్తం రైట్ హ్యాండ్ దేవా అని పోలీసులు చెప్తారు. దేవుడమ్మ షాక్ అయిపోతుంది. వాడిని అరెస్ట్ చేశారా లేదా అని అరుస్తుంది. అరెస్ట్ చేయడానికి కుదరడం లేదని మీ అబ్బాయిని దేవా కొడుతుంటే చూసినట్లు ఎవరూ సాక్ష్యం చెప్పడం లేదని అంటాడు. గంటలో దేవాని అరెస్ట్ చేయాలి లేదంటే కాల్చి చంపేయాలి లేదంటే నేను వాడిని చంపేస్తా అని అంటుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

శ్రీరంగం తండ్రితో మనం ఒక నెలా రెండు నెలలు ఎక్కడైనా దాక్కుందాం.. నాన్న దేవా కొట్టింది చిన్నా చితకా మనిషిని కాదు ఎమ్మెల్యే కొడుకునే అని చెప్తాడు. మిథునతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఎమ్మెల్యే కొడుకుని కొడితే వాళ్లు మనల్ని చంపకుండా ఉంటారా అని కాంతం అంటుంది. ఇంతలో దేవా వచ్చి బయటకు వెళ్తా అంటే శారద భయపడుతుంది. ఈ దేవాని టచ్ చేయాలి అంటేనే భయపడతారు అలాంటిది మన గుమ్మం తొక్కుతారా అని దేవా అంటాడు.
Nuvvunte Naa Jathaga Serial Today October 20th: నువ్వుంటే నా జతగా: దేవాని అరెస్ట్ చేయిస్తున్న మిథున! తండ్రీకూతుళ్ల నాటకమేనా!

అప్పుడే పోలీసులు వస్తారు. పోలీసులు ఇంట్లో వాళ్లతో దేవుడమ్మ వాళ్లు సీరియస్‌గా ఉన్నారు. పరిస్థితి బాలేదు.. దేవుడమ్మ మనుషులు మీ అబ్బాయి దేవాని చంపేయాలని ప్లాన్‌లో ఉన్నారు అని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. మీ అబ్బాయిని వదలరు అని అంటాడు. శారద ఏడుస్తుంది. పోలీసులు దేవాతో ఇలా కేర్‌లెస్‌గా ఉండకు.. కన్నవాళ్లకి కడుపు కోత పెట్టకు అని అంటారు. ఏం జరిగినా నేను చూసుకుంటా మీరు వెళ్లండి అని దేవా అంటాడు. దేవాని నేరం ఒప్పుకొని లొంగిపోమని చెప్పండి అరెస్ట్ చేస్తాం.. జైలులో ఉంటే మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం ఉండదు. అదే బయట ఉంటే ఏ క్షణం అయినా ప్రాణాలు తీసేస్తారు అని పోలీసులు చెప్తారు. మీరు మంచి స్టేటజీతో వచ్చారు.. మీ ప్లాన్ నాకు అర్థమైంది.. మీరు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోసం పని చేస్తారు కానీ నా కోసం ఎందుకు పని చేస్తారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా మీ మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వరూ.. ఎమ్మెల్యే కొడుకుని కొట్టానని ఎవరూ సాక్ష్యం చెప్పరు ఇక  మీరు వెళ్లండి అని దేవా అంటాడు. మిథున సాక్ష్యం చెప్తానని అందరికీ షాక్ ఇస్తుంది. ఎమ్మెల్యే కొడుకుని దేవా కొట్టడం నేను చూశానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget