Chinni Serial Today October 20th: చిన్ని సీరియల్: వరుణ్ లోహిత బుట్టలో పడతాడా! నిమ్మకాయదీపం చిన్న, మహిలను కలుపుతుందా!
Chinni Serial Today Episode October 20th మ్యాడీ మధు ఇద్దరూ ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లి చిన్ని కోసం మ్యాడీ మహి కోసం మధు కోరుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత మధుకి ఇచ్చిన పాలలో ఉప్పు కలిపేస్తే మధు లోహితకు తెలీకుండా గ్లాస్ మార్చేస్తుంది. నీ విలనిజం టెక్నిక్స్ ఇంకెక్కడైనా వాడు నా దగ్గర కాదు.. ఎందుకు ఆ గొడవలు చక్కగా కలిసుందాం కాదు కూడదు నాకు వార్‌నే కావాలి అంటే జీవితానికి సరిపడా ఇచ్చేస్తా అని వరుణ్‌ని పిలిచి లోహిత పాలు తాగడం లేదని వరుణ్ దగ్గర ఇరికించేస్తుంది. దాంతో బలవంతంగా లోహిత పాలు తాగుతుంది. ఇక మధుని పక్కింటి బాబాయ్‌తో హనుమాన్ టెంపుల్‌కి బయల్దేరుతుంది. 
మ్యాడీ కూడా ఆంజనేయ గెటప్‌లో ఉన్న బాబుని తీసుకొని హనుమాన్ టెంపుల్‌కి వెళ్తాడు. నీకు ఈ గుడికి ఏదో సంబంధం ఉంది కదా.. నీ ముఖం చూస్తుంటే నువ్వు ఏదో పోగొట్టుకున్నది కచ్చితంగా దొరుకుతుందని ఆ బాబుని అంటాడు. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. పెద్ద హనుమంతుడి దర్శనం చేసుకుందువు పద అని బాబు మ్యాడీని తీసుకెళ్తాడు. ఆ స్వామి దయవల్ల నీకు దూరం అయింది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుందిలే అని బాబు చెప్పి మాయం అయిపోతాడు. మీ అమ్మగారు ఎక్కడున్నారో చూద్దాం పద అని మ్యాడీ అనేసరికి బాబు అక్కడ ఉండడు.. ఈ చిన్న హనుమంతుడు ఎక్కడికి వెళ్లాడని మ్యాడీ అనుకుంటాడు.
ఇక మధు అదే గుడికి వస్తుంది. కూరగాయలు ఇవ్వాల్సిన వాళ్లకి ఇచ్చేస్తుంది. మ్యాడీ దగ్గర సాక్ష్యాత్తు హనుమంతుడు బాలుడి రూపంలో రాగా.. మధు వెళ్లిపోతుంటే సాక్ష్యాత్తు సీతమ్మ తల్లి ఓ బామ్మలా వచ్చి గుడిలోకి తీసుకెళ్లమని అంటుంది. మధు తీసుకెళ్తూ చిన్నప్పుడు ఈ గుడికి వచ్చా కానీ నా వాళ్ల అందరూ దూరం అయిపోయిన తర్వాత రాలేదని అంటుంది. అన్నీ నీకు దక్కుతాయామ్మా దక్కిన వాటిని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి మధుని దీవించి సీతమ్మ వెళ్లిపోతుంది. మధు ఆంజనేయ స్వామిని చూసి అలా ఉండిపోతుంది. మ్యాడీ స్వామితో మళ్లీ మేం ఇద్దరం ఎప్పుడు కలుస్తాం స్వామి.. చిన్నప్పుడు మేం ఇద్దరం నీ దగ్గర నిమ్మకాయ దీపం వెలిగించేవాళ్లం ఇప్పుడు మళ్లీ వెలిగిస్తా చిన్ని చూసేలా తనకు నేను ఇక్కడున్నాను అని తెలిసేలా తను దీపం వెలిగించేలా చేయు స్వామి అని కోరుకొని నిమ్మకాయ దీపం కోసం వెళ్తాడు. 
మ్యాడీ వెళ్లగానే మధు వస్తుంది. మధు కూడా మహి కోసం దండం పెడుతుంది. మేం ఇద్దరం మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాం అని అనుకుంటుంది. మధు కూడా నిమ్మకాయ దీపం వెలిగించాలి అనుకుంటుంది. ఇంతలో నాగవల్లి కూడా అదే గుడికి శాంతి హోమం చేయించడానికి కుటుంబంతో కలిసి వస్తుంది. 
లోహిత చీర మార్చుకుంటే వరుణ్ చూసి వెళ్లిపోతుంటే లోహిత పిలిచి చీర కట్టడానికి సాయం చేయమని అంటుంది. వరుణ్ ముట్టుకోవడంతో లోహిత ఐలవ్‌యూ చెప్తుంది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం వరుణ్ నీ కోసం నా ఫ్యామిలీనే కాదు నాప్రాణం కూడా వదిలేస్తా అని అంటుంది. వరుణ్ నుదిటిపై ముద్దాడుతుంది. హగ్ చేసుకోవడానికి వెళ్లగానే వరుణ్ లోహిని దూరం పెట్టి బావ మన కోసం అంత కష్టపడుతుంటే మనం ఇలా సంతోషంగా వద్దు నిన్ను మ్యాడీని ఇంటికి తీసుకెళ్లే వరకు మనం దూరంగా ఉందామని అంటాడు. నీ లాంటి వాడు నా భర్త అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని లోహి అంటుంది. వరుణ్ బయటకు వెళ్లగానే ఎలా అయినా వరుణ్‌ని గ్రిప్‌లోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















