Nuvvunte Naa Jathaga Serial Today October 18th: నువ్వుంటే నా జతగా: దేవా రౌడీయిజం వీడడా? మిథున కలలు చెదిరేనా? ఎమ్మెల్యే కొడుకుని నడిరోడ్డు మీద కొట్టిన దేవా! :
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 18th మిథున ఎదురుగానే దేవా ఎమ్మెల్యే కొడుకుని రాయితో కొట్టి చంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా పురుషోత్తంతో అన్న ఒకే రక్తం పంచుకొని పుట్టకపోయినా నువ్వు నా అన్న నీ కోసం అవసరం అయితే నా ప్రాణం అయినా ఇచ్చేస్తా.. నిన్ను నేను వదిలేసి వెళ్లిపోతా అని ఆలోచన కలలో కూడా రానివ్వకు. ఆ దేవుడమ్మ నాకు ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇస్తా అంది కానీ నిన్ను వదిలి వెళ్లడం ఈ జన్మలో జరగదు అని చెప్పా అని అంటాడు.
పురుషోత్తం దేవాని హగ్ చేసుకొని నువ్వు నా ప్రాణం దేవా అని అంటాడు. ఈ విషయం ఫోన్‌లో చెప్పాలి కదా అసలు రెండు రోజులు ఏమైపోయావ్ అని అడుగుతాడు పురుషోత్తం. అదంతా వదిలేయ్ అన్న అని దేవా అంటాడు. పురుషోత్తం దేవా ఎందుకు చెప్పడం లేదు మాట దాటేస్తున్నాడు అంటే ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు.
దేవా హాస్పిటల్‌కి పరుగులు తీస్తాడు. ఓ అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంటుంది. నా కూతురు దేవా అని ఆ తల్లి ఏడుస్తుంది. దేవా గతంలో ఆ అమ్మాయికి పుస్తకాలు కొనిచ్చి చదువుకి సంబంధించి అన్నీ చూసుకుంటాడు. ప్రతీ సంవత్సరం ఆ అమ్మాయి రాఖీ కడుతుందని ఫీజు కట్టి చదివిస్తాడు. డాక్టర్ చదివించాలి అనుకుంటాడు. 
డాక్టర్ రావడంతో తన పరిస్థితి ఎలా ఉందని దేవా అడుగుతాడు. ఎవరో రాక్షసుడిలా హింసించారు. మెడ చుట్టూ గాయాలు, నడుం చుట్టూ గాయాలు బలవంతం చేయడంతో చాలా ఎముకులు విరిగిపోయావి.. సర్జరీలు చేయాలి.. అవి తట్టుకొని బతకాలి అంటే రెండేళ్లు పడుతుంది. అయినా సరే బతికినా మానసికంగా కోలుకోవడం చాలా కష్టం అని అంటుంది.
దేవా ఆవేశంతో ఎవరమ్మా అది అని అడిగితే ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకు అని ఆవిడ చెప్పడంతో ఎమ్మెల్యే కొడుకు మందు తాగుతూ ఫ్రెండ్స్‌తో ఓ అమ్మాయి తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దేవా వాడి అంతు చూస్తాఅని అంటాడు.
మిథున గుడికి వెళ్లి దీపాలు వెలిగిస్తూ దేవా కోసం మొక్కుకుంటుంది. తన కాపురం బాగుండాలని వాయినం కూడా ఇస్తుంది. అప్పుడే దేవా రౌడీయిజం మానేయాలని మిథున వెలిగించిన దీపాలు ఆరిపోతాయి. మిథున షాక్ అయిపోతుంది. ఇలా జరిగింది ఏంటా అని అనుకుంటుంది. అశుభం అనుకుంటూ ఒకావిడి వస్తుంది. నువ్వు కోరిక నెరవేరదు అని చెప్పడానికి ఇలా జరిగింది అని అంటుంది. దాంతో మిథున నా భర్త రౌడీయిజం మారడా అని అంటుంది. ఖర్మ ఫలం ఎవరూ మార్చలేరు అని అంటుంది. 
దేవా దేవుడమ్మ కొడుకు దగ్గరకు వెళ్లబోతే ఫ్రెండ్స్ ఆపాలని అనుకుంటారు. దేవా ఎవరి మాట వినకుండా వెళ్తాడు. దేవా ఎమ్మెల్యే కొడుకు ఉన్న ప్లేస్‌కి వెళ్తాడు. గేటు తన్ని లోపలికి వెళ్తాడు. దేవా ఎమ్మెల్యే కొడుకుని చితక్కొడతాడు. అక్కడున్న మరో అమ్మాయిని విడిపించి తన ఫ్రెండ్‌తో పంపిస్తాడు. ఇక ఎమ్మెల్యే కొడుకుని తరిమి తరిమి చితక్కొట్టి కొడతాడు. మిథున ఆటోలో వెళ్తూ దేవా నడిరోడ్డు మీద రాయితో ఎమ్మెల్యే కొడుకుని దేవా పచ్చడి చేయి కొట్టడం చూస్తుంది. ఆటో డ్రైవర్ మిథునతో ఆ రౌడీ ఎలా కొడుతున్నాడో చూడండి..వాడు ఎమ్మెల్యే కొడుకు ఆమె అతన్ని అతని ఫ్యామిలీని వదలదు అని అంటాడు.మిథున కంగారు పడుతుంది. ఇంటికి వెళ్లాక కాంతం మిథునని వెటకారం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















