Chinni Serial Today October 18th: చిన్ని సీరియల్: మ్యాడీ జీవితంలో కీలక మలుపు! నాగవల్లికి ఎదురయ్యే కష్టాలు, మధు పరిస్థితి ఏంటి?
Chinni Serial Today Episode October 18th నాగవల్లి గురువుగారి దగ్గరకు వెళ్లడం గురువు గారు గతంలో చేసిన తప్పుల ఫలితమే ఇదే అని కావేరిని ఉద్దేశించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, లోహి, వరుణ్, మ్యాడీ అందరూ తులసి కోట దగ్గర దీపాలు పెట్టి దండం పెట్టుకుంటారు. మ్యాడీ కళ్లలో ఏదో పడిందని కన్ను మూసుకుంటే మధు చూస్తుంది. మధుని కింద పడేలా చేయాలని లోహి నూనె పడేస్తుంది. దాని పైన కాలు వేసి మధు జారిపోతే మ్యాడీ పట్టుకుంటాడు. 
ఆంజనేయ స్వామి ఆశ్రమానికి నాగవల్లి అక్క, వసంతలతో వస్తుంది. గురువుగారితో మాట్లాడుతుంది. నాగవల్లి గురువుగారితో జరిగింది అంతా చెప్తుంది. నా బిడ్డ నాకు దూరం అయ్యాడు.. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ మనస్శాంతి లేకుండా పోయింది.. ఇలా ఎందుకు జరిగిందో తెలీడం లేదు అని అంటుంది. గురువు గారు తన దివ్య దృష్టితో దేవా కావేరి, చిన్నిలను హింసించి కావేరిని దారుణంగా చంపడం చూసి మనం చేసిన ఖర్మ ఫలితం.. మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని అంటారు. చెడు ఖర్మలు చేసి మంచి ఫలితాలు ఆశించలేం కదా అని అంటారు. మీ విషయంలోనూ అదే జరుగుతుంది అని అంటారు. వారసుడు వల్ల కలిగిన బాధ వారసుడి వల్లే పోతుందని అంటారు. శాంతి యాగం చేయమని చెప్తారు. వల్లీ చాలా భయపడుతుంది.. అన్నీ అడ్డంకులు తొలగి నా బిడ్డ నా దగ్గరకు రావాలి అని అనుకుంటుంది. 
మధు పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని హలో మహి సార్ నైట్ అంతా బాగా నిద్ర పోయారా అని అంటుంది. దూరం నుంచి మ్యాడీని చూస్తూ ఉంటుంది. అక్కడే ఆ బొమ్మ పెట్టేసి మ్యాడీ దగ్గరకు వెళ్తుంది. మ్యాడీ మధుతో నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నా అని అంటాడు. మధు గుడ్ లక్ చెప్తుంది. చాలా హ్యాండ్సమ్‌గా రెడీ అయ్యావని అంటుంది. మధు తల్లిదండ్రులు కూడా వచ్చి మ్యాడీ చక్కగా రెడీ అయ్యాడని అంటారు. మ్యాడీ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు అంటే మధుని ఎదురు రమ్మని చెప్పమని సుబ్బు చెప్తాడు. 
మధు ఎదురు వస్తుంది. మ్యాడీ మధుని చూసి వెళ్తాడు. మ్యాడీ చాలా మంచోడని ఏ ఇంటికి అల్లుడు అవుతాడో కానీ వాళ్లని సొంత అమ్మానాన్నల్లా చూసుకుంటాడని చంటి, స్వరూప మాట్లాడుకుంటారు. మధు మనసులో నేను మ్యాడీ పొందలేను అని అనుకుంటుంది. నాగవల్లి వాళ్లు వాళ్లు బయటకు వెళ్తూ మ్యాడీ, వరుణ్ లేకపోవడంతో ఏదోలా ఉందని అనుకుంటారు. అందరం కలిసిపోవాలని అనుకుంటారు. గుడిలో పూజ చేసుకోవడానికి వెళ్తారు. దేవాకి కాల్ చేసి నాగవల్లి పిలిస్తే గుడికి వస్తానని చెప్తాడు. 
మ్యాడీ పని మీద వెళ్తూ ఆంజనేయ స్వామిలా రెడీ అయిన ఓ బాబుని రోడ్డు మీద చూసి వెళ్తాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అని బాబు అడిగితే స్కూల్‌లో ఏమైనా ప్రోగ్రాం ఉందా అని మహి అడుగుతాడు. లేదు సీతారాముల్ని కలపడానికి వచ్చా అంటాడు. మీ అమ్మానాన్న ఎక్కడ అని అడిగితే తప్పిపోయారు అని అంటాడు. ఆ బాబుని మహి ఏం అడిగినా ఆంజనేయస్వామిలా మాట్లాడుతాడు. ఇక మహి ఆ బాబుని తన తల్లి దగ్గరకు తీసుకెళ్లడానికి స్కూటీ ఎక్కించుకుంటాడు. మధుకి కూడా ఓ వ్యక్తి కాల్ చేసి హనుమాన్ టెంపుల్‌కి రమ్మని పిలుస్తారు. మధు బయల్దేరుతుంది. స్వరూప మధుకి పాలు తాగమని ఇస్తే లోహిత ఎవరూ చూడకుండా దానిలో ఉప్పు కలిపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















