Ammayi garu Serial Today October 17th: అమ్మాయిగారు సీరియల్: విరూపాక్షికి సూర్య ఇచ్చిన చీర వెనుక అసలు రహస్యమేంటి? వెక్కి వెక్కి ఏడ్చిన విరూపాక్షి!
Ammayi garu Serial Today Episode October 17th సూర్యప్రతాప్ విరూపాక్షికి ఇచ్చిన చీర తాను కొనలేదని విరూపాక్షికి సూర్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ పంతులు ఇచ్చిన చీర తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ బంటీ చెప్పడంతో సూర్యప్రతాప్ విరూపాక్షి కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడని అనుకుంటారు. విరూపాక్షి కూడా చాలా సంతోషపడుతుంది. ఏం గిఫ్ట్ తీసుకొచ్చారా అని రాజు, రూప అనుకుంటారు.
బంటీ అమ్మమ్మని తాతయ్య దగ్గరకు తీసుకెళ్లి గిఫ్ట్ ఇవ్వమని సూర్యప్రతాప్‌తో చెప్తాడు. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. బంటీ చెప్పడంతో సూర్యప్రతాప్ విరూపాక్షికి గిఫ్ట్ ఇస్తాడు. ఓపెన్ చేసి చూడమని బంటీ చెప్పడంతో విరూపాక్షి చూస్తుంది. విరూపాక్షికి నచ్చిన పింక్ కలర్ శారీ ఉంటుంది. విరూపాక్షి చాలా చాలా సంతోషపడుతుంది. విజయాంబిక, దీపక్‌లు కళ్లతో నిప్పులు పోసుకుంటారు. విరూపాక్షి చీర మీద వేసుకొని మురిసిపోతుంది. చీర చాలా బాగుందని బంటీ తాతతో చెప్తాడు. విరూపాక్షి మనసులో సూర్య నాకు ఇష్టమైనా పింక్ కలర్ శారీ నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావా అని అనుకుంటుంది. రూప కూడా రాజుతో అమ్మకి ఇష్టమైన కలర్ అని పింక్‌ని నాన్న అసహ్యించుకునే వాళ్లు ఇప్పుడు అదే కలర్ తెచ్చారు అంటే కోపం పోయింది అని అంటుంది. విరూపాక్షి సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్ చెప్తుంది.
బంటీ అమ్మమ్మతో కట్టుకొని తాతయ్యకు చూపించు అని అంటుంది. రూప విజయాంబికతో నువ్వు మా అమ్మానాన్నల్ని విడదీయడానికి ఒక అడుగు వేస్తే భగవంతుడు వాళ్లని కలపడానికి వంద అడుగులు వేస్తాడు. మా నాన్న అమ్మకి చీర తేవడం చూసి నీ కడుపు మండిపోయి ఉంటుంది ఎలాకడుపు మంట తగ్గించుకోవాలో చూసుకో అని అంటుంది. రూప చంద్రతో ఇది నిజమేనా చిన్నాయనా.. నమ్మలేకపోతున్నా అని అంటుంది. దాంతో చంద్ర అది అన్నయ్య కొనలేదు గుడిలో అమ్మవారికి పెట్టిన చీర పంతులు ఇచ్చారని అంటాడు రూప డిసప్పాయింట్ అయిపోతుంది. నాయన బంటీ కోసం తప్పక అమ్మకి చీర ఇచ్చాడు కానీ ప్రేమతో కాదన్న మాట అని అనుకుంటుంది. అ నిజం ఎప్పటికీ అమ్మకి తెలీకూడదు అని అంటుంది..
విరూపాక్షి సూర్యప్రతాప్ ఇచ్చిన చీర కట్టుకొని చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సూర్యకి థ్యాంక్స్ చెప్పాలి అని సూర్యప్రతాప్ దగ్గరకు సంతోషంగా వెళ్తుంది. సూర్య మనం ప్రేమించుకునే రోజుల్లో ఈ కలర్ డ్రస్ ఇచ్చావ్.. ఇన్నాళ్లకి మళ్లీ ఈ చీరఇచ్చావ్ చాలా చాలా సంతోషంగా ఉంది. నా మీద ప్రేమతో తీసుకొచ్చిన చీరలో నేను ఎలా ఉన్నానో చెప్పు సూర్య.. ఇంకా ఎందుకు నా మీద ప్రేమ లేనట్లు నటిస్తున్నావ్ అని అడుగుతుంది. నా మీద కోపం పోయింది కదా అని అంటుంది. విరూపాక్షి సంతోషంగా సూర్యప్రతాప్ మీద చేయి వేయబోతే ఈ చీర నేను కొన్నది కాదు.. నీ కోసం తెచ్చింది అయితే అస్సలు కాదు.. గుడిలో పంతులు ఇచ్చారు. అది నీ కోసమే తెచ్చా అని బంటీ అనుకున్నాడు వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక నేను సైలెంట్‌గా ఉండిపోయాను.. బంటీకి మన గురించి పూర్తిగా తెలీక అపార్థం చేసుకున్నాడు. నీకు తెలుసు కదా నువ్వు అయినా అర్థం చేసుకోవాల్సింది అని అంటాడు. సూర్యప్రతాప్ మాటలకు విరూపాక్షి ఏడుస్తుంది. ఇది నా కోసం తెచ్చిన చీర కాదా అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. విరూపాక్షి ఏడుస్తుంటే రాజు రూప వెళ్తారు. అమ్మవారి అనుగ్రహం ఉండే చీర పెద్దయ్యగారికి ఇచ్చారు. పెద్దయ్య గారితో ఈ చీర మీకు ఇప్పించాలని అమ్మవారు అనుకుంది అందుకే ఈ చీర మీ వరకు వచ్చిందని రాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















