(Source: Poll of Polls)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి, లక్ష్మీలకు పాప! లక్ష్మీ ప్రాణానికి ముప్పు! పొలంలో ఏం జరిగిందంటే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 17th విహారి, లక్ష్మీలకు బిడ్డ పుట్టినట్లు సహస్ర కల రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక పార్థసారథితో ఫోన్‌లో మాట్లాడుతూ తన ప్లాన్ గురించి చెప్తుంది. లక్ష్మీ చాటుగా ఆ మాట విని షాక్ అయిపోతుంది. వెంటనే పొలాల దగ్గరకు వెళ్లి రైతుల్ని కాపాడుకోవాలని లక్ష్మీ అనుకుంటుంది. లక్ష్మీ బయటకు వెళ్లడం అంబిక చూసి లక్ష్మీ వినేసిందా అనుకొని లక్ష్మీని ఆపుతుంది. మొత్తం వినేశావా అని లక్ష్మీని అడుగుతుంది.
లక్ష్మీ అంబికను నెట్టేసి వెళ్తుంది. అంబిక లక్ష్మీని వదిలేసి వెళ్లవే వెళ్లు నువ్వు వెళ్లే సరికి అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటుంటుంది. లక్ష్మీ పరుగును వెళ్లి విహారికి విషయం చెప్తుంది. పొలాలకు పురుగులు పట్టి పంట నాశనం అయిపోవడంతో రైతులు ఏడుస్తారు. చేతికొచ్చిన పంట పురుగు పట్టేసిందయ్యా అని ఏడుస్తుంటారు. వీర్రాజు కూడా వెళ్లి ఇలా అయిందేంట్రా అని అనుకుంటారు. రైతులు వీర్రాజుతో ఇక మాకు ఆత్మహత్యలే గతి అని అంటాడు.
వీర్రాజు తన కొడుకుని చూపించి నా కొడుకు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ నా కొడుకు ఈ పురుగుల నుంచి కాపాడుతాడని అంటాడు. అమ్మిరాజు పురుగు మందు తీసుకొచ్చి కొట్టిస్తానని అంటాడు. ఇంతలో లక్ష్మీ, విహారి వచ్చి మందు కొట్టొద్దని చెప్తుంది. పురుగు మందు కొడితే మీ పంట సేంద్రీయ పంట అవ్వదు అని అంటుంది. మందు కొట్టకపోతే పంట పోతుందని అమ్మిరాజు అంటాడు. సేంద్రీయ పద్ధతిలో పురుగులు నేను పోగొడతానని లక్ష్మీ అంటుంది. అందరికీ లక్ష్మీ ఏం చేయనుందో చెప్తుంది. అందరూ నోరెళ్లబెట్టి చూస్తారు. తనకు కావాల్సినవన్నీ తీసుకురమ్మని రైతులకు చెప్తుంది.
ఓ పెద్ద డ్రమ్లో నీరు పోయించి.. అందులో ఆవు పేడ వేయించి మొత్తం కలిపిస్తుంది. పురుగు పోకపోతే జనాలు పోతారమ్మా అని వీర్రాజు అంటే పురుగు పోవడానికి నీళ్లామృతం చేయిస్తున్నా అని అంటుంది. అవన్నీ పని చేయవు అని అమ్మిరాజు అంటాడు. జరుగుతుంది అని లక్ష్మీ ఆ నీటిని పంట మీద పోయిస్తుంది. లక్ష్మీ చెప్పినట్లు చేయడంతో పురుగులు మొత్తం పోతాయి. తర్వాత డబ్బా రేకులకు పసుపు రాసి వాటికి కర్రకు కట్టి పొలం మధ్యలో పెట్టిస్తుంది. దానివల్ల పురుగులు అట్రాక్ట్ అయి రేకుకి తగిలి చనిపోతాయని అంటుంది. అందరూ లక్ష్మీని పొగుడుతారు. వీర్రాజు, అమ్మిరాజుల ముఖం మాడిపోతుంది.
లక్ష్మీ, విహారిలకు పాప పుట్టినట్లు ఇద్దరూ ఆ పాపతో సంతోషంగా ఉన్నట్లు సహస్రకు కల వస్తుంది. నో అంటూ పెద్దగా అరిచి సహస్ర చెమటలు పట్టేస్తుంది. పద్మాక్షి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏదో పీడకల వచ్చిందని అంటుంది. పగటి కలలు నిజం అవుతాయే అని పద్మాక్షి అనడంతో సహస్ర షాక్ అయిపోతుంది. సహస్ర తల్లితో అమ్మ నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించరు కదా అని ఏడుస్తుంది. ఎవరే నిన్ను కోడలిగా అంగీకరించని నువ్వు వారసుడిని ఇస్తావ్ అంటుంది. సహస్ర మనసులో బావ నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు ఎలా వారసుడిని ఇస్తాను అని అనుకుంటుంది. ఇక సహస్ర కడుపు పట్టుకొని ఏమైందో ఏంటో తెలీదమ్మా చాలా నొప్పి పుడుతుందని అంటుంది. పద్మాక్షి చాలా బాధ పడుతుంది. పద్మాక్షి మనసులో వారసుడు అనేవాడు నా కూతురి గర్భంలో పుట్టుకపోయినా ఈ ఇంటి వారసుడు నా కూతురి గర్భంలో పుట్టినట్లు సృష్టిస్తానని అనుకుంటుంది.
యమున అమ్మవారి దగ్గరకు వెళ్లి నా కొడుకు కోడలు లక్ష్మీతో ఎందుకు ఆడుకుంటున్నావ్ అమ్మా.. వాళ్లకి ఎందుకు ఇన్ని బాధలు.. ఎందుకు ఇన్ని కష్టాలు అని నిలదీస్తుంది. ఇంతలో పోచమ్మ అక్కడికి వస్తుంది. పోచమ్మ లక్ష్మీ నా ఇంటికి అసలైన కోడలు అని చెప్పావ్ కదా.. మరి తను నా కోడలిగా అందరికీ ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతుంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని పోచమ్మ అంటే అప్పటి వరకు వాళ్లు ఈ బాధ పడాల్సిందేనా అని అంటుంది. తప్పదమ్మా ఖర్మ ఫలం తప్పదు అని అంటుంది. లక్ష్మీ అనుభవిస్తున్న దాని కంటే పెద్ద సమస్యనే రాబోతుందని లక్ష్మీని ప్రాణ హాని ఉందని పోచమ్మ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















