Illu Illalu Pillalu Serial Today October 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు సాయాన్ని చెడగొట్టేసిన ఇడ్లీబాబాయ్.. చితక్కొట్టిన భాగ్యం! ధీరజ్ ప్రేమాయణం!
Illu Illalu Pillalu Serial Today Episode October 20th ధీరజ్ ఐశ్వర్యతో మాట్లాడుతున్నట్లు ప్రేమ ఎదురుగా మాట్లాడి ప్రేమ ఉడికిపోయేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode పార్టీలో ధీరజ్ ప్రేమకి ముద్దు పెట్టాడని నర్మద అత్త, వల్లీ ముందు చెప్పేస్తాడు. వేదవతి వల్లీని పంపేసి ఏంటి ప్రేమ ఏంటి సంగతి అని ప్రేమని ఏయ్ ఏయ్ అని అంటుంది. ప్రేమ సిగ్గుతో వెళ్లిపోతుంది. నర్మద వేదవతితో ముద్దు పెట్టాడా లేదా అని ప్రేమ, ఏం జరిగిందో తెలీదు అని ధీరజ్ అనుకుంటున్నాడని.. కానీ వాళ్లిద్దరిలోని ప్రేమని ఒకటి చేయాలని నర్మద అంటుంది. 
వేదవతి సంతోషంతో నా గవర్నమెంట్ కోడలా అని నర్మదని ముద్దు పెట్టుకుంటుంది. ఏయ్ అత్తయ్య నాకు ముద్దు పెట్టేసింది అని నర్మద అరుస్తుంది. ప్రేమ గదిలోకి వెళ్తుంది. ధీరజ్ చూసి ఏయ్ రాక్షసి ఈ రోజు నుంచి క్యాబ్ డ్రైవింగ్‌కి వెళ్తాను అని చెప్పా కదా ఏం చెప్పవేంటి ఆ మౌనవ్రతం వదలవా అని అడుగుతాడు. మాట్లాడవా నీ పని చెప్తా అని ధీరజ్ ఫోన్ తీసి హలో బేబీ.. రెడీ అవుతున్నా పది నిమిషాల్లో బయటకు వచ్చేస్తున్నా అని అంటాడు. ప్రేమలో టెన్షన్ అయిపోతుంది. ధీరజ్ స్నానానికి వెళ్లగానే ఐశ్వర్య సంగతి చెప్తా అని ఫోన్ పాస్ వర్డ్ ఓపెన్ చేయాలని అనుకుంటుంది. లాక్ ఓపెన్ కాకపోవడంతో ధీరజ్ రాగానే పాస్ వర్డ్ చెప్పరా అని ధీరజ్‌ని లాగేస్తుంది. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు పడుతూ ధీరజ్ ప్రేమని పట్టుకుంటాడు. ఒకరి కళ్లలోకి ఒకరు చేసుకొని సిగ్గు అయిపోతారు. ధీరజ్ వెళ్తూ మీ అమ్మాయిలకు అందమే కాదు అసూయ ఎక్కువే అని అనుకుంటాడు.
భాగ్యం, ఇడ్లీబాబాయ్ రామరాజు ఇంటికి వస్తారు. రామరాజు ఎందుకు పిలిచారో అని భయంగా ఉందని ఆనంద్ రావు గుండె పట్టుకుంటాడు. మనలాంటి మంచివాళ్లు అమాయకులు కాస్తంత చాకచక్యంగా ఉండాలి.. కొన్నిమోసాలు, అబద్ధాలు, చావు తెలివి తేటలు వాడాలి అప్పుడే బతకగలం అని భాగ్యం ఇడ్లీ బాబాయ్‌తో చెప్తుంది. ఇక రామరాజుని చూసి పులి వచ్చేసింది అని అనుకుంటారు. 
రామరాజు వాళ్లని కూర్చొపెట్టి మీ గురించి ఏదేదో అనుకున్నా కానీ ఇలా చేస్తారు అనుకోలేదు.. అంటే మీ గురించి నేను తెలుసుకొని నేను పిలిస్తే కానీ మీరు రారా.. మీ అంతట మీరు నేరుగా వచ్చి చెప్పరా.. ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు.. ఎందుకు దాచారు అని రామరాజు దబాయించి అడుగుతాడు. ఎక్కడో దూరంగా టెంట్ వేసుకొని బజ్జీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి మీకు.. మీకు మరీ అంతగా వ్యాపారం చేసుకోవాలి అనిపిస్తే ఏదైనా హోటల్ పెట్టుకోవచ్చు కదా.. మీరు మా కోడలి తల్లిదండ్రులు మీకు అండగా నిలబడాల్సింది నేనే కదా అని చెప్పి బ్యాగ్ తీసుకురమ్మని వేదవతితో చెప్తారు. 
రామరాజు డబ్బుల కట్టలు తీస్తుంటే ఆనంద్ రావు రామరాజుతో మేం ఎవరికీ సాయం అడగకుండా మా కాళ్ల మీద మేం నిలబడాలి అని అనుకున్నాం అని అంటాడు. మామయ్య సాయం చేయాలి అనుకుంటే నాన్నేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని వల్లీ అనుకుంటుంది. భాగ్యం కూడా ఆనంద్‌రావుని ఆపాలని చూస్తుంది కానీ ఇడ్లీబాబాయ్ ఊరుకోడు.. మా వ్యూహాలు మాకు ఉన్నాయ్ సంవత్సరంలో పెద్దగా డెవలప్ అయిపోతాం అని అంటాడు. దాంతో రామరాజు మీకు సాయం చేయాలని 3 లక్షలు ఇవ్వాలని అనుకున్నా కానీ మీరు మీ కాళ్ల మీద నిలబడాలి అనుకున్నారు.. మంచిది అని డబ్బు ఇవ్వడు. భాగ్యం, వల్లీ ఇడ్లీబాబాయ్‌ని మాడ్చేసేలా చూస్తారు. 
పెనం మీద నూనె పెట్టాం అది బాగా మరిగిపోతుందని భార్యని చూసి ఆనంద్‌రావు బయటకు వెళ్తే భాగ్యం భర్తని చతక్కొట్టి కొడుతుంది. ధీరజ్ డ్రైవింగ్‌కి వెళ్తుంటే ప్రేమ వద్దని తనకు కుడి కన్ను అదురుతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















