Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: యమునకు కాటేసిన రాచనాగు! లక్ష్మీ, విహారి యమునను కాపాడుకుంటారా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 18th యమునకు పాము కాటేయడం యమున బతకడం కష్టమని పోచమ్మ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారి ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని యమున పోచమ్మని అడుగుతుంది. ఖర్మ ఫలితం అనుభవించాలని పోచమ్మ యమునతో చెప్తుంది. లక్ష్మీకి త్వరలో ప్రాణహాని ఉందని పోచమ్మ చెప్పడంతో యమున షాక్ అయిపోతుంది. లక్ష్మీని నేను కాపాడుకుంటాను అని యమున పరుగులు పెడుతుంది.
లక్ష్మీ వెనకాలే విహారి పొలంలో తిరుగుతాడు. లక్ష్మీని పిలిచి అందరూ నిన్ను ఎంతో మెచ్చుకున్నారు అని లక్ష్మీ కళ్లకు ఉన్న కాటుక తీసి లక్ష్మీకి దిష్టి చుక్క పెడతాడు. అమ్మిరెడ్డి దగ్గరకు అంబిక వచ్చి నిజంగా చదువుకున్నావా సర్టిఫికేట్ కొన్నావా ఒక్క పని చక్కగా చేయలేకపోయావ్ అని తిడుతుంది. లక్ష్మీ అంతు చూస్తా అని అమ్మిరాజు అంటాడు. మీకు ఏమైనా సలహా ఉంటే చెప్పడం ఇంకోంచెం టైం ఇవ్వమని పార్థసారథిని అడగమని అంటాడు అమ్మిరాజు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ ప్లాన్ సక్సెస్ అయితే అందరం లాభపడేవాళ్లం అని అంటుంది అంబిక. ఈసారి మంచి ప్లాన్ చేయాలి అనుకుంటారు.
పద్మాక్షి పాముల పట్టేటోడిని పొలం దగ్గరకు పిలిచి రాచనాగు అని అది కాటేస్తే చావు పక్కా అని విరుగుడు కూడా లేదని అంటాడు. పద్మాక్షి లక్ష్మీ చీర కొంగు ఆయనకు ఇవ్వడం ఆయన అది తీసుకొని కాటేయాల్సిన లక్ష్మీని చూసి పాముకి ఆ చీర చూపించి బుంగ ఊది లక్ష్మీని ఒక్కకాటుతో చంపేయమని పాముని పంపుతాడు. యమున లక్ష్మీని కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటుంది. పాముని చూసిన యమున లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీ చూడదు దాంతో యమున పరుగులు పెడుతుంది. లక్ష్మీని పాము కాటేసే టైంకి యమున పాముని పట్టుకుంటుంది. దాంతో పాము యమునని కాటేస్తుంది.
యమున కాటేసిన తర్వాత విహారి పాముని పట్టుకొని ఓ డ్రమ్‌లో పెట్టి అంకెం కప్పేస్తాడు. యమున కుప్పకూలిపోతుంది. విహారి, లక్ష్మీ కంగారు పడతారు. ఓ వ్యక్తి చూసి ఈ పాము విషానికి విరుగుడు లేదు పోచమ్మ దగ్గరకు తీసుకెళ్దాం అని అంటాడు. యమున వచ్చి ప్లాన్ నాశనం చేసిందని పోచమ్మ అనుకుంటుంది. పోచమ్మ దగ్గరకు యమునని తీసుకెళ్తారు. ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు. పాము కరిచిందని తెలిసి షాక్ అయిపోతారు.
పోచమ్మ నాటు వైద్యం చేస్తుంటుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లినా ఉపయోగం ఉండదు అని పోచమ్మ అంటుంది. రాచనాగు కాటుకి ఏ మందు పనిచేయదు.. అని పోచమ్మ చెప్తుంది. యమునని బతికించుకోవడానికి ఓ మార్గం ఉంది కానీ అది అతి కష్టమైన పని అని అంటుంది. తూర్పు వైపు కొండ మీద దట్టమైన అడివిలో ఎప్పటి నుంచో మూసేసిన శివాలయం ఉంది అక్కడ పరమశివుడు పూజిస్తే ఆవెలుగుకు నాగాంభరం చెట్టు కనిపిస్తుంది దాని ఆకులు తీసుకొస్తే యమునని బతికించొచ్చని పోచమ్మ చెప్తుంది. నేనువెళ్తా అని విహారి అంటే పైకి వెళ్లిన వారు ఉన్నారు కానీ తిరిగి వచ్చిన వాళ్లు లేరని పోచమ్మ అంటుంది. సహస్ర విహారిని వెళ్లొద్దని అంటుంది.
విహారి అందరితో మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తా అంటాడు. రేపటి సూర్యోదయం లోపు ఆ ఆకు పసరు తీసుకురాకపోతే మీ అమ్మని కాపాడలేం అప్పటి వరకు నేను పసరు మందుతో ప్రాణాలు కాపాడుతా అని అంటుంది. విహారి ముందే వస్తాను అని అంటాడు. విహారి వెనకే లక్ష్మీ కూడా పరుగులు తీస్తుంది. ఇద్దరూ కొండలు గుట్టలు దాటుకుంటూ అడవిలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















