Jagadhatri Serial Today October 15th: జగద్ధాత్రి సీరియల్: మాధురి సీమంతంలో ఊహించని ట్విస్ట్! అన్నదమ్ముల వీరత్వం, అప్పుల పంచాయితీ!
Jagadhatri Serial Today Episode October 15th మాధురి సీమంతం దగ్గర ప్రతాప్ వంశీ పది కోట్లు అప్పు తీసుకున్నాడని గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మాధురి నిశ్చితార్థం వేడుక వైభవంగా జరుగుతుంది. యువరాజ్, కేథార్ సీమంతానికి వెళ్లకుండా ఉంటారు. ఇద్దరూ చెల్లి సీమంతానికి వెళ్లలేకపోతున్నాం అని బాధ పడతారు. అందరూ మాధురిని దీవిస్తారు. నిషిక, జగద్ధాత్రి ఇద్దరూ భర్తలు రాలేదని బాధ పడుతూనే మాధురిని దీవిస్తారు.
యువరాజ్‌ని రానివ్వలేదని నిషిక గొడవ చేస్తుంది. చెల్లి సీమంతం చూడకూడదు అని శాసించారు.. ఇదెక్కడి న్యాయం అని నిషి ప్రశ్నిస్తుంది. ఎవరైనా సరే రావడానికి వీల్లేదని వంశీ అంటాడు. కౌషికి వంశీ దగ్గరకు వెళ్లి వంశీ అన్నయ్యలు కదా నాలుగు అక్షింతలు వేసి వెళ్లిపోతారు.. అది మీకు పుట్టబోయే బిడ్డకు మంచిది కదా అని ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. వద్దు అని వంశీ అంటాడు. వైజయంతి చెప్పినా కూడా ఒప్పుకోను అని తెలిసి ఎందుకు సతాయిస్తారు. నా భార్య కోరిక ఇదే అని తెలిసినా తీర్చను అని అంటాడు. ఇంకెవరు ఏం అడగొద్దని సుధాకర్ అంటాడు. మాధురి వంశీతో మన బిడ్డకు మా అన్నయ్యల ఆశీర్వాదం శ్రీరామరక్ష అని అంటుంది. నీకు నేనే శ్రీరామరక్ష ఇంకేం మాట్లాడకు అని వంశీ అంటాడు.
ఇంతలో కొంతమంది కౌషికి ఇంటికి వచ్చి రేయ్ వంశీ అని అరుస్తాడు. అన్న ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటే నీ బాగోతం మీ అత్తారింటికి తెలియాలి కదా అని చెప్పి వంశీ వాళ్లు తీసుకున్న 10 కోట్ల అప్పు కోసం చెప్తాడు. కౌషికి వాళ్లు షాక్ అయిపోతారు. నీకు చేతనైంది చేసుకో అని వంశీ అంటే నా డబ్బు నాకు ఇస్తారా సీమంతంలో కూర్చొన్న మీ భార్యని తీసుకెళ్తా అని ప్రతాప్ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మా అమ్మాయినే తీసుకెళ్లిపోతావా అని వైజయంతి తిడుతుంది. కౌషికి ప్రతాప్ వాళ్లతో ఆ అప్పు మేం తీర్చుతాం అని అంటుంది. ఇప్పుడే ఇవ్వాలి అని ప్రతాప్ అంటాడు. మూర్ఖంగా మాట్లాడొద్దని సుధాకర్ అంటే ప్రతాప్ సుధాకర్‌ని నెట్టేస్తాడు.
మాధురిని తీసుకెళ్లడానికి ప్రతాప్ వెళ్తే జగద్ధాత్రి అడ్డుకుంటుంది. డబ్బు రెడీ చేస్తాం వచ్చి తీసుకెళ్లు.. గొడవ చేయాలి అంటే వేరేలా ఉంటుందని జగద్ధాత్రి అంటే ప్రతాప్ జగద్ధాత్రిని నెట్టేస్తాడు. మా సిస్టర్‌నే తోస్తావా అని బూచి అంటే బూచిని నెట్టేస్తారు. సుధాకర్ మెడ మీద కత్తి పెట్టి ఎవరైనా కదిలితే పీక తెగుతుందని అంటాడు. మాధురి దగ్గరకు శ్రీవల్లి వెళ్లబోతే శ్రీవల్లిని తోసేస్తారు. ఇక మాధురిని పట్టుకోబోతే మాధురి అన్నయ్య అని అరుస్తుంది.
కేథార్, యువరాజ్ ఆ పిలుపుతో పరుగున వచ్చి ప్రతాప్ చేయి పట్టుకుంటారు. ఇద్దరూ ప్రతాప్‌ని అతని మనషుల్ని చితక్కొడతారు. జగద్ధాత్రి శ్రీవల్లికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇద్దరు కొడుకులు చెల్లిని కాపాడుకోవడం చూసిన సుధాకర్ చాలా సంతోషపడతాడు. మిమల్ని ఎదురించలేను అని నాకు అర్థమైంది.. మీ అల్లుడి మీద చెక్ బౌన్స్ కేసు వేస్తా వాడితో చిప్ప కూడు తినిపిస్తా అని అంటాడు. ఈ తొందరతోనే తన్నులు తిన్నావ్ డబ్బు ఇస్తాం అని చెప్పాం కదా.. తొందర ఎందుకు అని కేథార్ అంటే ఇంత జరిగాక మీరు డబ్బు ఇస్తారని నమ్మకం మాకు లేదు అని ప్రతాప్ అంటే దానికి కేథార్ జగద్ధాత్రికి చెప్పడంతో జగద్ధాత్రి వెళ్లి నగలు ప్రతాప్ చేతిలో పెడుతుంది.
కౌషికి వద్దుని అన్నా జగద్ధాత్రి ఇస్తుంది. ఇక ప్రతాప్‌తో కౌషికి మీ డబ్బు మీకు ఇస్తాం ఈ నగలు మాకు ఇచ్చేయండి అని అంటుంది. ఇవి సరిపోవని ప్రతాప్ అంటే కేథార్ వెంటనే చెక్ రాసి ఇచ్చి ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బు నా కుటుంబం కోసం నా చెల్లి కోసం ఇస్తున్నా అని కేథార్ అంటాడు. ప్రతాప్ కేథార్ వాళ్లతో అన్న వదిన అంటే మీలా ఉండాలి. మీరు చాలా కొట్టారు అన్నా అన్నారు మీరేం ఇస్తారు సార్ అని ప్రతాప్ యువరాజ్‌ని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















