Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి గడువు ఇచ్చిన విహారి! యమునకు తెలిసిన నిజమేంటి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 15th పద్మాక్షి సోదమ్మకి బంగారు గాజులు ఇవ్వడం యమున చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రకు పిల్లలు పుట్టరు అని సూరమ్మకి తెలిసినప్పుటికీ అందరి ముందు అలా చెప్పకుండా సహస్రకు పిల్లలు పుడతారని చెప్తుంది. సహస్ర చాలా సంతోషపడుతుంది. సహస్ర విహారి ఇద్దరూ సూరమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కాదాంబరి మనవరాలితో త్వరలోనే నువ్వు వారసుడిని ఇవ్వాలని అంటుంది.
సూరమ్మ వెళ్తుంటే పద్మాక్షి బయటకు వెళ్లి కలుస్తుంది. సూరమ్మ నీకు నా కూతురి నాడి పట్టుకోగానే అంతా తెలిసిపోయింది అని నాకు తెలుసు.. కానీ అందరి ముందు చెప్పకపోయినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని అంటుంది. సూరమ్మ పద్మాక్షితో నేను ఒక ఆడదానికే కదా నాకు తెలుసమ్మా ఆడపిల్లకి పిల్లలు పుట్టకపోవడం పాపం కాదమ్మా శాపం.. అలాంటి శాపాన్ని అందరి ముందు బయట పెట్టి నీ కూతురి జీవితం నాశనం చేయాలి అని నాకు అనిపించలేదమ్మా అందుకే నిజం బయట పెట్టలేదు అని అంటుంది. ఇంట్లో యమున అటు వస్తుంటుంది.
పద్మాక్ష సూరమ్మకు కృతజ్ఞతగా తన చేతికి ఉన్న బంగారు గాజులు ఇస్తుంది. ఇప్పుడు ఈ నిజం దాచావు కానీ ఇంకెన్నాళ్లు దాస్తావ్.. కనీసం నీ కూతురికైనా తెలుసా అని అడుగుతుంది. నా కూతురికి ఎప్పుడు తెలుస్తుందో తెలీద కానీ మిగతా ఎవ్వరికీ ఎప్పటికీ తెలీకూడదు అని పద్మాక్షి అంటుంది. సూరమ్మ వెళ్లిపోగానే యమున వచ్చి పద్మాక్షి ముందు నిల్చొంటుంది. పద్మాక్షి షాక్ అయపోతుంది. వదిన మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతుంది. ఏం లేదని పద్మాక్షి కవర్ చేస్తుంది.
అమ్మిరాజు కావేరిని ఈడ్చుకొని వచ్చి ఇంట్లో పడేస్తుంది. నేను నీకు కాబోయే భర్తని కదా కానీ కనీసం వాళ్ల దగ్గర ఒక్క మాట చెప్పలేదు.. నన్ను కొట్టడంతో నువ్వు నవ్వుకున్నావ్ కదే అని కావేరిని కొడతాడు. ఇంతలో వీర్రాజు వచ్చి కొడుకుని పక్కకి లాగుతాడు. ఏమైందిరా ఏంటి ఈ అవతారం అని అడిగితే నన్ను ఒకడు కొట్టాడు అని అమ్మిరాజు చెప్తాడు. అమ్మిరాజు కొడుకుతో నిన్ను కొట్టిన వాడిని చంపేయాలి వాడితో పాటు ఇంకొకడి అంతు చూడాలని లక్ష్మీ, విహారి వాళ్ల గురించి చెప్తాడు. ఇద్దరూ ఒకరే అని తెలియని అమ్మిరాజు ఇద్దరి అంతు చూస్తా అని అంటాడు.
లక్ష్మీ దగ్గరకు వసుధ వస్తుంది. మంత్రసాని ఏం చెప్పింది నీకు తెలీదా.. ఆ మాటలు విన్న తర్వాత కూడా నీకు బాధగా లేదా అని అడుగుతుంది. ఆ మంత్రసాని విహారి, సహస్రలకు సంతానం కలుగుతుందని చెప్పింది అది జరుగుతుందా.. సహస్రని దూరం పెట్టి విహారి నీ కోసం పాకులాడుతున్నాడు.. ఇప్పుడు ఆ మంత్రసాని చెప్పినట్లు అవుతుందా అని వసుధ అంటుంది. దానికి లక్ష్మీ విహారి, సహస్రమ్మలకు సంతానం కలగడమే న్యాయం అని అంటుంది. విహారికి నువ్వే సంతానం ఇవ్వాలని వసుధ అంటే అలా అనొద్దు అమ్మ విహారిగారు సహస్రమ్మ కలిసేలా మీరే ఒప్పించండి అని అంటుంది.
లక్ష్మీ వెళ్తుంటే విహారి ఎదురు పడి లక్ష్మీ చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్తాడు. నా కోసం కానీ నా ప్యామిలీ కోసం కానీ నువ్వు ఏం చేయొద్దని అన్నాను కానీ నువ్వు వినడం లేదు.. మా కోసమే నువ్వు ప్రతీ క్షణం పరితప్పిస్తారు. దీన్ని ఏమంటారు. కృతజ్ఞత అని చెప్పకు.. ఇప్పటికైనా నీలో ప్రేమని బయట పెట్టు అని అడుగుతాడు. మంత్రసాని మాటలు విన్నావు కదా.. ఇంట్లో అందరూ వారసుడి కోసం ఆశ పడుతున్నారు నేనేం సమాధానం చెప్పాలి అని అడుగుతాడు. మీరు ఎవరికీ ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. మీరు సహస్ర సంతోషంగా ఉండి.. వారసుడిని ఇవ్వండి అని అంటుంది. దానికి విహారి నా భార్య సహస్ర కాదు నా భార్య కనక మహాలక్ష్మీ అని అరుస్తాడు. అరవొద్దని లక్ష్మీ అంటే ఇంకోసారి ఇలాగే అంటే అరిచిగోల చేస్తానని అంటాడు. నేను నీకు ఎందుకు ఇష్టం లేదో నా మీద ఒట్టేసి చెప్పు అని అడుగుతాడు.
లక్ష్మీ విహారితో మనది ముగిసిపోయిన కథ నా గురించి మర్చిపోయి సహస్రమ్మతో జీవితం మొదలు పెట్టండి అని అంటుంది. నీతో తప్ప ఇంకొకరితో నేను ఉండను నేను కేవలం నీకు దీపావళి వరకు టైం ఇస్తున్నా ఆలోపు నీ మనసులో మాట నువ్వు నాకు చెప్పాలి.. లేదంటే మన మధ్య ఉన్న ఈ నిజం నేను అందరికి చెప్పేస్తా అని అంటాడు. పద్మాక్షితో పాటు అందరూ లగేజ్ సర్దేసి వెళ్లిపోదాం అని అంటారు. దాంతో అందరూ బయల్దేరిపోతారు. వీర్రాజు అది చూసి ఎంత మంచి సీన్ అని వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















