Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల సంతోషం.. అదిరిపోయిన కేఫ్‌డే.. ఇందిరకు సిద్ధూ ఇచ్చిన మాటేంటి?
Nindu Manasulu Serial Today Episode October 15th ప్రేరణ, సిద్ధూలకు అందరూ ఆశీర్వదించి కేఫ్ సక్సెస్ అవ్వాలని దీవించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ కోసం మంజుల సాహితితో కలిసి కాఫీ షాప్ ఓపెనింగ్‌కి వస్తుంది. సిద్ధూ చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక సిద్ధూ మంజుతో కొబ్బరి కాయ కొట్టిస్తాడు. తర్వాత సిద్ధూ, ప్రేరణ కొబ్బరి కాయ కొడతారు. ఇక పంతులు రిబ్బన్ ఎవరు కట్ చేస్తారు అని అడిగితే ఐశ్వర్య మా అమ్మ కట్ చేస్తుందని అంటుంది. 
ఇందిర అందరితో రిబ్బన్ కట్ చేసేది నేను కాదు సిద్ధూ బాబు వాళ్ల అమ్మ అని చెప్తుంది. నాకు ఇలాంటివి నచ్చవు మీరే కట్ చేయండి అని మంజుల అంటే ఇద్దరూ కలిసి కట్ చేయండి అని ఐశ్వర్య అంటుంది. మంజుల, ఇందిర ఇద్దరూ కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. సిద్ధూ, ప్రేరణలు కలిసి కుడి కాలు పెట్టి లోపలకి వెళ్తారు. అంతా చాటుగా చూసిన విశ్వాసం విజయానంద్‌కి ఫోన్ చేసి సిద్ధూ బాబు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడని అంటాడు. వాళ్ల అమ్మ లేకపోతే వాడు సంతోషంగా ఎలా ఉంటాడు అని విజయానంద్ అడిగితే మేడం గారు లేకపోవడం ఏంటి సార్ మేడం వచ్చారు.. కొబ్బరి కాయ కొట్టారు.. రిబ్బన్ కట్ చేశారు.. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు అని విశ్వాసం చెప్తాడు. మంజు అక్కడికి రావడం ఏంట్రా అని విజయానంద్ షాక్ అయిపోతాడు. మంజు ఎలా వెళ్లింది.. అది ఎలా.. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని విజయానంద్ అనుకుంటాడు.
సిద్ధూ, ప్రేరణ వాళ్లు అందరికీ లోపల కూర్చొపెట్టి మాట్లాడుతారు. మంజుల కొడుకుతో అంతా బాగుంది కానీ మీ ఇద్దరూ పార్టనర్స్ అయితే ఈ అమ్మాయి పేరే కేఫ్‌కి పెట్టారు అని అంటుంది. ఐడియా నాది అయినా ప్రేరణ కాఫీ బాగా పెడుతుంది అంతే కాకుండా ఈ కేఫ్‌కి స్టడీ కేఫ్‌గా ప్రేరణ ఇచ్చింది ప్రేరణ కాబట్టి ఈ పేరు పెట్టానని సిద్ధూ అంటాడు. సిద్ధూ తల్లిని పట్టుకొని నువ్వు నా దగ్గరకి వచ్చి నన్ను బ్లెస్ చేశావ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా థ్యాంక్యూ సోమచ్ అంటాడు. పిల్లలకు తల్లికి మధ్య థ్యాంక్స్ ఉండకూడదురా.. కానీ నేను కోరుకునేది ఇది కాదు అని మంజు అంటుంది. అమ్మ ఇది మేం మా కాళ్ల మీద నిలబడటానికి మాత్రమే త్వరలోనే నీ కోరిక నెరవేర్చేతా అమ్మ సివిల్స్ సాధిస్తా అని అంటాడు. 
కుమార్ సిద్ధూతో ఇలా కూర్చొని మాట్లాడుతావా.. ఏమైనా ఇచ్చేది ఉందా అని అడిగితే కస్టమర్లు రావాలి కదా అని సిద్ధూ అంటే ఇక్కడున్న వాళ్లే కష్టమర్లు అని వాళ్లే కాఫీ తాగి బిల్ కట్టి మనల్ని ఆశీర్వదిస్తారని కుమార్ అంటాడు. ప్రేరణ, ఐశ్వర్య కాఫీ పెట్టడానికి వెళ్తారు. సిద్ధూ వెళ్లి కాఫీ తీసుకొని వస్తాడు. మంజుల కొడుకు కాఫీ ఇస్తుంటే బాధ పడుతుంది. ఇక అందరూ కాఫీ తాగిన తర్వాత మంజుల సిద్ధూకి డబ్బులు ఇస్తుంది. సిద్ధూ వద్దు అన్నా అందరూ తీసుకోమని అంటారు. సిద్ధూ ఆ డబ్బుని ప్రేరణకి ఇస్తాడు. మంజుల ఆల్‌ది బెస్ట్ చెప్పి వెళ్తుంది. 
ప్రేరణ మంజుల దగ్గరకు వెళ్లి థ్యాంక్యూ మేడం పిలవగానే వచ్చారు అని అంటుంది. దానికి మంజుల నువ్వు పిలవగానే నేను రాలేదు.. నా కొడుకు మీద ప్రేమతో వచ్చాను.. వాడికి నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను అని అంటుంది. దూరం నుంచి సిద్ధూ చూసి ఏంటి ప్రేరణ మా అమ్మతో మాట్లాడుతుంది అని అనుకుంటాడు. విశ్వనాథ్ కూడా సిద్ధూ, ప్రేరణలకు ఆల్‌ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతారు. ఐశ్వర్య ప్రేరణతో నువ్వు ఈ గెటప్‌లో బాగున్నావ్ అక్క.. నువ్వు కలెక్టర్ అవ్వగానే నేను ఈ కేఫ్ కొనేసి ఇక్కడే గిటారు వాయించుకుంటా అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇందిర దూరం నుంచి చూసి మురిసిపోతుంది. తర్వాత ఇందిర సిద్ధూ దగ్గరకు వెళ్లుంది. 
బాబు ఈ రోజు ప్రేరణ ముఖంలో చాలా సంతోషం చూశా.. కాలం కన్నెర్ర చేస్తే దెబ్బ తిన్న జీవితాలు బాబు మావి.. లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయం అందదు.. ఏమైనా ఒంటరిగా పోరాడాలి ప్రేరణ కూడా అలాగే ఒంటరిగా పోరాడింది.. కానీ ఇప్పుడు నీ పరిచయం దానికి ఓ ధైర్యం ఇచ్చింది. నీ మంచి తనం దానికి మార్గం చూపిస్తుంది. చాలా రోజులు అయింది బాబు దాని నవ్వు చూసి ఇక నుంచి తన సంతోషం దూరం అవ్వకుండా నువ్వే దాన్ని చూసుకోవాలి అంటుంది. ఆంటీ మీరు ప్రేరణ గురించి బెంగ పడకండి.. నేను ప్రేరణ పక్కన ఉన్నంత వరకు తనకు ఏ కష్టం రాదు..నా వల్ల తనకు సంతోషం దూరం కాదు అని చెప్తాడు. సాహితి ఇంటికి వెళ్లి ఫంక్షన్ సూపర్ డాడీ అని చెప్తుంది.
మంజు ఇంట్లోకి వచ్చే సరికి విజయానంద్ ముఖం మాడ్చేసుంటాడు. మంజుల విజయానంద్ దగ్గరకు వెళ్లి మమల్ని బాధ పెట్టి వెళ్లినందుకు సారీ అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















