అన్వేషించండి

Jagadhatri Serial Today October 14th: జగద్ధాత్రి సీరియల్: జేడీ నువ్వేనా? నిషిని కాపాడింది ఎవరు? కౌషికి అనుమానాలు, యువరాజ్ రహస్యాలు!

Jagadhatri Serial Today Episode October 14th జగద్ధాత్రి మీద కౌషికికి అనుమానం వచ్చి రివాల్వర్ చూసి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నిషిక తనని చంపాలనుకున్న టీనీని కౌషికినే తీసుకొచ్చిందని కౌషికి మీద నింద వేస్తుంది. కౌషికి ఎందుకు అలా చేస్తుందని అందరూ అంటారు. యువరాజ్‌కి ఇదంతా భాయ్ చేశాడని అర్థమై నిషితో చెప్తాడు. దాంతో నిషి వణికిపోతుంది. తర్వాత కౌషికికి సారీ చెప్తుంది.

బూచి నిషితో నిన్ను కాపాడింది ఎవరు.. ఆ అమ్మాయి చేతికి బులెట్ గాయం కూడా అయింది.. పైగా గన్ సౌండ్ వచ్చిందని అడుగుతాడు. నాకు తెలీదు.. మీరు ఎవరో వచ్చి కాపాడారు అనుకున్నా మీరు కాదా అని నిషి అంటుంది. ఏదో జరిగింది అని అందరూ అనుకుంటారు. కౌషికి జగద్ధాత్రిని గుర్తు చేసుకుంటుంది. వైజయంతి అందరితో ఇది ఎవరో సూపర్ మెన్‌, సూపర్‌ ఉమెన్ పని అయింటుంది.. మనల్ని కాపాడటానికి వచ్చి కనిపించకుండా వెళ్లిపోయారని అంటుంది. ఇక అందరూ ఫంక్షన్‌కి టైం అయిపోయిందని అనుకుంటారు. వంశీ వెళ్తూ కేథార్, యువరాజ్ రాకూడదని అంటాడు.

కేథార్ జగద్ధాత్రి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. జగద్ధాత్రి గన్ చూపిస్తుంది. ఫైరింగ్ చేసింది నువ్వే అని తెలుసు అని అంటాడు. వచ్చింది పార్లర్‌ పర్సన్‌ కాదు.. నిషిని చంపాలి అనే వచ్చింది.. రివాల్వర్‌ వచ్చింది అంటే వచ్చింది ఆర్డనరీ పర్సన్‌ కాదు.. వచ్చింది మీనన్ మనిషి అని యువరాజ్‌ కోసం వచ్చిందని అర్థమైంది.. మీనన్‌ యువరాజ్‌కి ఏదో పని చెప్పాడు.. యువరాజ్ నో చెప్పడంతో యువరాజ్‌ని భయపెట్టాలని చూశాడు.. మీనన్ ఇంత చేశాడు అంటే యువరాజ్‌ అవసరం మీనన్‌కి చాలా ఉంది అని జగద్ధాత్రి అంటుంది. కేథార్‌ జగద్ధాత్రితో యువరాజ్ మీనన్‌ కోసం పని చేయకుండా చూడాలని అంటాడు. దానికి యువరాజ్ కూడా సపోర్ట్ చేయాలని జగద్ధాత్రి అంటుంది.

ఇంతలో జగద్ధాత్రి వాళ్ల దగ్గరకు కౌషికి వస్తుంది. నిషిని కాపాడింది ఎవరు అనుకుంటున్నారు అని అడుగుతుంది. తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. గన్‌ ఫైర్ చేసింది ఎవరు అని కౌషికి అడుగుతుంది.. తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. నువ్వు బయటకే వెళ్లలేదు కానీ బయట నుంచి వచ్చావ్.. అంటే నువ్వే కదా అని కౌషికి అడుగుతుంది. జగద్ధాత్రి షాక్ అయి నేనా నేను గన్ ఫైరా అని జగద్ధాత్రి నోరెళ్ల బెడుతుంది. జగద్ధాత్రి కవర్ చేయడానికి ఏదో జరుగుతుందని డౌట్‌తో విండో వైపు వెళ్లి చూస్తే రివాల్వర్ సౌండ్ వచ్చింది.. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెనక డోర్ నుంచి పరుగుపెట్టానని అప్పుడే మీరు చూశారని చెప్తుంది. కేథార్ కూడా జగద్ధాత్రికి గన్‌ ఫైర్ చేయడం రాదు కదా అని అంటాడు. నిషిని కాపాడింది ఎవరు అని కౌషికి అంటుంది. ఇక కౌషికి గన్ గదిలో చూసి పట్టుకొని జగద్ధాత్రి నువ్వే కదా ఫైర్ చేసింది.. కేథార్ నువ్వు తనకి ఏం రాదని అంటున్నావ్.. జగద్ధాత్రి నువ్వు ఎవరు అని కౌషికి అడుగుతుంది.

జగద్ధాత్రి, కేథార్ పెద్దగా నవ్వి నేను ఏదో అండర్‌ గ్రౌండ్ డాన్ అన్న రేంజ్‌లో అడుగుతున్నారు.. నేను కాల్చానని ఈ గన్ నాదే అనుకున్నారా అని అంటుంది. దానికి కేథార్ ఈ గన్ నాది.. స్కూల్‌ వాళ్లు ఇచ్చారని చెప్పాను కదా అని అంటాడు. అవునా అని కౌషికి అంటుంది. జగద్ధాత్రి కాదులే కానీ మరి ఇంకెవరు ఫైర్ చేసుంటారని కేథార్ అంటాడు. నిషికను కాల్చాలని ఆ అమ్మాయి మిస్ ఫైర్ చేసింది తన చేతికే కాలింది.. రివాల్వర్ జేబులో పెట్టుకొని ఉంటుందని అంటాడు.

జగద్ధాత్రి, కేథార్ చివరి నిమిషంలో తప్పించుకున్నాం అని అనుకుంటారు. మీనన్‌ చెప్పినట్లు చేస్తే మీ అక్క కంటే గొప్పగా మనం ఉంటాం కదా అని నిషిక అంటుంది. దానికి యువరాజ్ మీనన్ చెప్పినట్లు చేసిన వెంటనే కాసులు రావు.. ఇప్పుడు ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని అంటాడు. మీనన్‌కి బాగా అర్థమయ్యేలా నేను చెప్తా.. మన జోలికి రాకుండా చూసుకుంటా అని అంటాడు. ఈసారి మీనన్ ఏమైనా చేస్తే నేను నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతా అని నిషిక అంటుంది. సీమంతం వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కేథార్, యువరాజ్‌లు చెరో చోట ఉండి బాధ పడుతూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 14th: నిండు మనసులు: చెల్లి జీవితం నాశనం అయిందంటూ తండ్రిని తిట్టిన గణ! ప్రేరణకు దూరంగా సిద్ధూ!
నిండు మనసులు: చెల్లి జీవితం నాశనం అయిందంటూ తండ్రిని తిట్టిన గణ! ప్రేరణకు దూరంగా సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని అవమానించిన చందు! రౌడీలను చితక్కొట్టిన ఫ్యామిలీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని అవమానించిన చందు! రౌడీలను చితక్కొట్టిన ఫ్యామిలీ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 14:నిశ్చితార్థం ఆపేందుకు భరత్‌ ప్రయత్నాలు..పదేపదే అడ్డుపడిన తల్లి నందిని
నువ్వులేక నేను లేను: నిశ్చితార్థం ఆపేందుకు భరత్‌ ప్రయత్నాలు..పదేపదే అడ్డుపడిన తల్లి నందిని
Podarillu Serial Today NoV 14: బృందావనంలో దీపావళి కాంతులు..చక్రి స్టేటస్‌ చూసి కూడా మారుమాట్లాడని మహాలక్ష్మీ
పొదరిల్లు:బృందావనంలో దీపావళి కాంతులు..చక్రి స్టేటస్‌ చూసి కూడా మారుమాట్లాడని మహాలక్ష్మీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
Embed widget