Jagadhatri Serial Today November 26th: ‘జగధాత్రి’ సీరియల్: కౌషికిని కస్టడీలోకి తీసుకున్న త్రిపాఠి – రంగంలోకి దిగిన హోంమంత్రి
Jagadhatri Today Episode: కేదార్ ను కొట్టిందన్న కారణంతో త్రిపాఠి కౌషికిని కస్టడీలోకి తీసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Full Episode: కేదార్‌ను కొట్టిందన్న కారణంతో త్రిపాఠి, కౌషికిని కస్టడీలోకి తీసుకుంటాడు. కమలాకర్ న సెల్ వేస్తాడు. కేదార్, ధాత్రి చెప్పిన వినని త్రిపాఠి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటాడు. వాళ్లిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు నాన్నా ఏదైనా చేయండి అంటూ యువరాజ్, సుధాకర్ కు చెప్తాడు. అయితే మనం ఏంటో మన రేంజ్ ఏంటో వీళ్లకు తెలిసే టైం దగ్గరలోనే ఉందని అంటాడు సుధాకర్. ఇంతలో త్రిపాఠి వచ్చి ఏంటి బెదిరిస్తున్నారా..? అని అడుగుతాడు. లేదని మా పవరేంటో చూపిస్తామని చెప్తాడు సుధాకర్.
ధాత్రి: తప్పు చేసిన వాళ్లతో వచ్చిన మీకే అంత ఉంటే.. తప్పు చేసిన వాళ్లతో ఫైట్ చేస్తున్న మాకు ఎంత ధైర్యం ఉంటుందో ఆలోచించండి.
అని చెప్పి కేదార్, ధాత్రి పక్కకు వెళ్తారు. వీళ్ల బిల్డప్ చూస్తుంటే.. ఎవరో పెద్ద తలకాయే వీళ్ల వెనక ఉన్నటున్నారు అనుకుంటాడు త్రిపాఠి.
ధాత్రి: అనవసరంగా కౌషికి వదినను ఇందులో ఇరికించారు. అసలే ఆమె ప్రెగ్నెంట్. ఈ త్రిపాఠికి ఇవి అర్థమే కావు. ఏం చేస్తాడో ఏమో అని టెన్షన్ గా ఉంది.
కేదార్: త్రిపాఠి ఇదంతా మన మీద కోపంతో చేశాడు. అక్కను ఏమీ చేయడు.
ధాత్రి: వదినకు తినడానికి ఏదైనా తెప్పించు.. జ్యూస్ కానీ ఫ్రూట్స్
అని చెప్పగానే కేదార్, రమ్యను పిలిచి కౌషికికి ఏమైనా ఇవ్వమని చెప్తాడు. రమ్య వెళ్లి అడగ్గానే కౌషికి వద్దంటుంది. త్రిపాఠి, రమ్యను తిడుతూ ఏవైనా తీసుకురావాలంటే నాకు తీసుకురా అంటాడు. కేదార్ వచ్చి త్రిపాఠిని తిడతాడు. ఇంతలో ఆ స్టేషన్‌కు హోం మినిస్టర్ వస్తాడు. ఒకరిని అరెస్ట్ చేసేటప్పుడు వెనకా ముందు చూసుకోలేరా..? అంటూ ప్రశ్నిస్తాడు. సాధును పిలిచి తిడతాడు. అతన్ని ఎలా కొడతారని నిలదీస్తాడు. సారీ చెప్పమని అడుగుతాడు. ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి కౌషికికి సారీ చెప్తారు.
హోంమంత్రి: సుధాకర్ గారు సారీ సరిపోతుందా..?
సుధాకర్: సార్ నా తమ్ముడు..
హోంమంత్రి: సాధు..
సాధు: జేడీ..
అని చెప్పగానే జేడీ వెళ్లి సెల్ లో ఉన్న కమలాకర్ ను బయటకు తీసుకొస్తుంది. కౌషికి వెళ్లి ఇందాక మా బాబాయ్ ని తీసుకెళ్తానంటే వద్దన్నారు. ఇప్పుడు తీసుకెళ్లొచ్చా..? అని అడుగుతుంది. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్లండి. అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
సుధాకర్: ప్రాబ్లమ్ అనగానే బిజీగా ఉన్నా వెంటనే వచ్చేశారు. పిలవగానే ఇంటికి వచ్చారు.
హోంమంత్రి: మీ ఫ్యామిలీతో నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు ఏనాటిదో..ఆ అనుబంధమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
ధాత్రి, కేదార్ వస్తారు.
యువరాజ్: ఇది స్కూల్ వదిలే టైం కాదు. లంచ్ బ్రేక్ కాదు. అయినా ఇంటికి వచ్చేశారు. వీళ్లు ఇంతకు స్కూల్ టీచర్సేనా..? ( అని మనసులో అనుకుంటాడు.)
కౌషికి: జగధాత్రి, కేదార్ ఎక్కడికి వెళ్లారు.
Also Read: పింక్ శారీలో Mega Kodalu లావణ్య... రాయల్ ప్రిన్సెస్ అన్నట్టు లేదూ!
ధాత్రి: స్కూలుకు వెళ్లాం వదిన. మన ఇంటికి హోంమత్రి గారు వచ్చారని తెలిసి గొప్పవాళ్లను కలిసే అవకాశం వదులుకోకూడదు కదా అందుకే వచ్చాం. నమస్కారం అండి.
హోంమంత్రి: వీళ్లీ మీ మనుషులే..? ఈ ఇంట్లో ఇంతకు ముందు చూడలేదు. అన్నట్టు ప్రొఫెసర్ మధుకర్ గారు చాలా మంచి వారు అనుకున్నాను.
కౌషికి: మా నాన్న గారు యాక్సిడెంట్ లో చనిపోయారు సార్.
అని కౌషికి చెప్పగానే విన్నాను. ఆయన చనిపోయినప్పుడు ఇంటికి రావాలని రాలేకపోయాను అని చెప్తాడు. హోంమంత్రి మాటలకు అతని చూపులకు ధాత్రికి అనుమానం వస్తుంది. ఇంతలో హోంమంత్రి మీ ఇల్లు చాలా బాగుంది. అంటాడు సుధాకర్, కౌషికి అతనికి ఇల్లు చూపిస్తుంటారు. మధుకర్ రూం చూస్తానని హోంమంత్రి అడుగుతాడు. దీంతో హోంమంత్రిని ధాత్రి అనుమానిస్తుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!