Jagadhatri Serial Today August 14th: జగద్ధాత్రి సీరియల్: కౌషికిపై రౌడీ.. జగద్ధాత్రి, కేథార్ కాపాడగలరా? వణికిపోతున్న నిషిక, వైజయంతి!
Jagadhatri Serial Today Episode August 14th యువరాజ్ వీలునామా కొట్టేయమని పంపిన రౌడీ కౌషికితో తప్పుగా ప్రవర్తించాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కేథార్, జగద్ధాత్రిలు సుధాకర్ కోసం ఇన్‌హేలర్ తీసుకురావడానికి మెడికల్ షాప్‌కి వెళ్తారు. యువరాజ్ చెప్పిన రౌడీ బయట వెయిట్ చేయడం జగద్ధాత్రి చూస్తుంది. కొంచెం దూరం వెళ్లి ఈ టైంలో ఎవరూ అనుకుంటుంది. బైక్ ఆపించి వెనక్కి వెళ్తుంది. అతని దగ్గరకు వెళ్లి ఎవరు నువ్వు అని అడుగుతుంది.
రౌడీ తన పేరు శివ అని పక్క గల్లీ అని కారు బ్రేక్ డౌన్ అయిందని చెప్తాడు. పక్క గల్లీ అయితే ఇక్కడేం చేస్తున్నారు. ఈటైంలో ఎందుకు వచ్చారు అని జగద్ధాత్రి చాలా ప్రశ్నలు వేస్తుంది. రౌడీ గజగజ వణికి పోతాడు. పక్క గల్లీ కొత్తగా వచ్చాం రూట్ మర్చిపోయా అని కవర్ చేస్తాడు. జగద్ధాత్రి వెళ్లిపోయిన తర్వాత వణికించేసింది మొత్తం దిగిపోయింది అని అనుకొని మళ్లీ డ్రగ్స్ తీసుకుంటాడు. డ్రగ్స్ మత్తులో కౌషికిని గుర్తు చేసుకొని గన్ పట్టుకొని వెళ్తాడు. మరోవైపు యువరాజ్ మందు తాగుతూ అక్క సొంత తమ్ముడు నేను ఉండగా వేరే వాడికి ఆస్తి ఇవ్వాలి అనుకున్నావ్ కదా కాసేపట్లో అగ్రిమెంట్ మాయమైపోతుందని అనుకుంటాడు.
వైజయంతి, నిషికలు రౌడీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. రౌడీ వచ్చి కేథార్ చెప్పిన గుర్తుల ప్రకారం కౌషికి గదికి వెళ్తాడు. కౌషికికి అలికిడి వినిపించి బయటకు వెళ్లి చూస్తుంది. తీరా చూస్తే ఆ రౌడీ బెడ్ పక్కన దాక్కుంటాడు. కౌషికి మొత్తం చూసి తర్వాత గదిలోకి రాగానే కౌషికి ఎదురుగా వెళ్తాడు. కౌషికి ఎవర్రా నువ్వు అని భయంతో ఇంట్లో అందరిని పిలుస్తాడు. వైజయంతి వాళ్లు జగద్ధాత్రి, కేథార్లు వచ్చే లోపు ఆ రౌడీ వీలునామా తీసుకెళ్లి పోవాలని అనుకుంటారు.
కౌషికి రౌడీతో గొడవ పడుతూ వాడి తల మీద కొడుతుంది. అసలెంత ధైర్యంరా నీకు నా ఇంట్లోకి రావడమే కాకుండా డైరెక్ట్‌గా నా గదిలోకి వస్తావా అని అడుగుతుంది. ఇంతలో కీర్తి పాప లేచేస్తుంది. రౌడీ గన్ తీసి మర్యాదగా నేను చెప్పినట్లు చేయ్ లేదంటే నీతో పాటు నీ పిల్లల్ని చంపేస్తా అంటాడు. నీకేం కావాలో చెప్పు ఇస్తాను అని కౌషికి అడిగితే ఇప్పుడు దారిలోకి వచ్చావని రౌడీ అని కీర్తి దగ్గరకు వెళ్లి నీ అమ్మకి నాకు ఢీల్ కురిదిపోయింది నువ్వు బయటకు వెళ్లిపో అని పాపని గెంటేస్తాడు. కీర్తి చాలా సేపు డోర్ కొడుతుంది. కౌషికి రౌడీతో నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తాను అని అంటుంది. రౌడీ కౌషికితో నీ డబ్బు ఎవరికి కావాలే నాకు కావాల్సింది నువ్వు నేను చెప్పినట్లు చేయ్ లేదంటే నీ బాబుని కూడా బయట విసిరేస్తా అంటాడు. కౌషికి షాక్ అయిపోతుంది.
జగద్ధాత్రి, కేథార్‌లు మెడికల్ షాప్‌కి వెళ్తారు. జగద్ధాత్రి కేథార్‌తో ఎందుకో అంతా నెగిటివ్‌గా ఉందని ఏదో తేడా కొడుతుందని పైగా వాడి కారులో డ్రగ్స్ కూడా ఉన్నాయని.. నా అనుమానం నిజం అయితే వాడు మనకు ఏదో అపాయం తలపెట్టడానికి వచ్చుంటాడని త్వరగా ఇంటికి వెళ్లిపోవాలి అని చెప్పి ఇద్దరూ బయల్దేరుతారు. రౌడీ కౌషికి మీద మీద పడుతూ తప్పుగా ప్రవర్తిస్తాడు. కౌషికి పిన్ని పిన్ని అని అరుస్తుంది. కీర్తి పాప సుధాకర్‌ని నిద్ర లేపుతుంది కానీ సుధాకర్ మత్తు వల్ల లేవడు. తర్వాత పాప వైజయంతి, నిషికల దగ్గరకు వెళ్తుంది. కౌషికి గొంతు పట్టి రౌడీ నలిపేస్తుంటాడు. వైజయంతి కోడలితో కౌషికి కేకలు వినిపించడం లేదు ఏమై ఉంటుందో అని అనుకుంటారు.
కీర్తి పాప వైజయంతి, నిషికల దగ్గరకు వచ్చి కొడుతున్నాడని వైజయంతికి సైగ చేస్తుంది. ఇద్దరినీ తీసుకెళ్తుంది. వైజయంతి డోర్ కొడుతుంది. ఇద్దరూ ఏమైందని కంగారు పడతారు. వైజయంతి కోడలితో మొత్తం మన మెడకు చుట్టుకునేలా ఉంది వెంటనే యువరాజ్‌కి కాల్ చేయ్ అని అంటుంది. నిషిక యువరాజ్‌కి కాల్ చేస్తుంది కానీ యువరాజ్ తాగుతూ ఫోన్ పట్టించుకోడు. నిషిక, వైజయంతిలు డోర్ కొడుతుంటే రౌడీ అరిచి 5 నిమిషాలు తర్వాత నేనే వెళ్లిపోతా కాదని అరిస్తే దీన్ని చంపేస్తా అని అంటాడు. వైజయంతి కంగారుగా నీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తాం మా అమ్మాయిని ఏం చేయకు అని అంటుంది.
కౌషికి రౌడీ కట్టేసి కౌషికి చున్నీ లాగేసి వాడి కౌషికితో తప్పుగా ప్రవర్తిస్తాడు. ఇంతలో జగద్ధాత్రి, కేథార్ వస్తారు. వైజయంతి, నిషికలు జరిగింది ఇద్దరికీ చెప్తారు. కేథార్ తలుపు పగలగొడతాడు. జగద్ధాత్రి, నిషికలు కౌషికిని చున్నీతో కప్పుతారు. జగద్ధాత్రిని హత్తుకొని కౌషికి ఏడుస్తుంది. కౌషికిని రౌడీ కొట్టాడని కేథార్ గుర్తించి రౌడీని చితక్కొడతాడు. కాళ్లు చేతులు విరగ్గొడతాడు. రౌడీ పారిపోతాడు. అక్క అక్క అని కేథార్ పరుగులు పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















