అన్వేషించండి

Jagadhatri Serial Today August 12th: జగద్ధాత్రి సీరియల్: వీలునామాలో ఏముంది? కేథార్ వారసుడా? లేక నిరాశేనా? విరుచుకుపడ్డ వైజయంతి!

Jagadhatri Serial Today Episode August 12th కేథార్‌కి కూడా ఆస్తిలో వాటా ఇస్తారని తెలుసుకున్న వైజయంతి కౌషికి మీద విరుచుకుపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode  జగద్ధాత్రి, కేథార్‌లు కౌషికి అరెస్ట్ కాకుండా చేస్తారు. కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లకు దండం పెట్టి ఏమిచ్చి మీ రుణం తీసుకోవాలి.. ప్రతీ కష్టంలో నాకు అండగా ఉంటున్నారు అని దండం పెడుతుంది. కేథార్ కౌషికితో నువ్వు నా అక్కవి అక్క నిన్ను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది అని అంటాడు. ఇక జగద్ధాత్రి అయితే మనది రక్త సంబంధం వదిన మీకు అండగా మేం ఉన్నామని అంటుంది. 

కౌషికి జైలుపాలవ్వలేని నిషిక రగిలిపోతుంది. మన చేతికి వజ్రపాటి సామ్రాజ్యం వస్తుంది అనే టైంకి మొత్తం చెడగొట్టేశారు అని అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు ప్రతీసారి సాక్ష్యాలు ఎలా తీసుకొస్తున్నారు అని అంటుంది. నాకూ అదే అర్థం కావడం లేదని యువరాజ్ అంటాడు. నాకు అయితే ఒంటి మీద కాకీలు లేని పోలీసులు లా కనిపిస్తున్నారని వైజయంతి అంటుంది. యువరాజ్ మనసులో వాడు నిజంగా పోలీసే అనుకుంటాడు. 

కేథార్ రాత్రి ఫ్రెష్ అయి బెడ్ మీద వాలి హమ్మయ్యా అని అనుకుంటాడు. ఫోన్ చూస్తూ ఇన్‌స్టాలో మేఘన పెట్టిన ఫొటోని కేథార్ చూసి తింగరి పార్టులు పార్టులుగా చూస్తే ఇది బాగుంటుంది అని అనుకొని మేఘన ఫొటోకి లైక్ కొడతాడు. ఇక జగద్ధాత్రి పాలు వేడి చేస్తూ మేఘన ఫొటో చూసి ఒక్క దెబ్బకి కేథార్ లైఫ్ నుంచి పారిపోయింది. ఒక్కోసారి దీనికి పిచ్చి లేస్తుంది కానీ మంచిదే అనుకుంటుంది. అప్పుడే కేథార్ మేఘన ఫొటోకి లైక్ కొట్టడం చూసి కేథార్ అని కోపంతో వేడి పాలు పోసి కేథార్ అయిపోయావు ఈ రోజు అని గదిలోకి వెళ్తుంది.   

కేథార్ ఫోన్ చూసి నవ్వుకుంటూ ఉంటే వేడి పాలు తీసుకెళ్లి కేథార్ కాళ్ల మీద పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావ్  ద్ధాత్రి అని కేథార్ అడిగితే కాలు విరగ్గొట్టాలి అనుకున్నా కానీ ఇలా కాల్చి వదిలేస్తున్నా అని అంటుంది. నేనేమైనా తప్పు చేశానా అని కేథార్ అంటే నువ్వు చెప్పు ఏం తప్పు చేశావని జగద్ధాత్రి అంటుంది. నువ్వు మేఘన ఫొటోకి లైక్ కొడితే నేను నీకు కొడతా అని తెలీదా అని అంటుంది. మేఘన హ్యాపీగా ఫీలవుతుంది కదా మన పిల్ల కదా అని కేథార్ అంటాడు. మన పిల్లనా అంటే రేపు నా పిల్లా అంటావ్ ఎల్లుండి నేను ఎవరో తెలీదు అంటావ్ అని కేథార్‌ని వాయించేస్తుంది. తర్వాత కాళ్ల మీద వేడి పాలు కప్పు తీసి అలిగిపోయి పడుకుంటుంది. మేఘనకి నువ్వు అంటే ఇష్టం ఉంది అని తెలిసి కూడా లైక్ కొట్టావు అంటే నీకు కూడా తను అంటే లైకే అని అంటుంది. అయ్యో దేవుడా.. ప్రపంచంలో భార్యలు అంతా ఒకే ఫార్మాట్లో ఉంటారన్నమాట అని అంటాడు. 

నిషిక యువరాజ్‌ కోసం కాఫీ కలుపుతుంది. ఇక హాల్‌లో కౌషికి లాయర్‌తో మాట్లాడుతుంది. కౌషికి తండ్రి మధుకర్ ఆస్తి పంపకం కోసం అప్పట్లో వీలునామా రాశారని ఆ అడ్రిమెంట్ మూడు నెలల్లో పూర్తయిపోతుందని లాయర్ చెప్తారు. నిషిక అది వింటుంది. మధుకర్ గారి వీలునామా ప్రకారం సగం ఆస్తి మీకు మిగతా సగం సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందుతుందని అగ్రిమెంట్ టైం అయిపోతే సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందాల్సిన ఆస్తి అనాథాశ్రమానికి చెందుతుందని అంటాడు. కౌషికి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయమని అంటుంది. ఇక మధుకర్ అగ్రిమెంట్కి సంబంధించి ఒరిజనల్ కాపీ మీ దగ్గరే ఉంది రిజిస్ట్రేషన్‌కి అది అవసరం అని అంటాడు. 

ఇంతలో వైజయంతి వచ్చి అమ్మా కౌషికి అని అరుస్తుంది. ఏంటి పిన్ని కేకలేస్తున్నావ్ అని అడిగితే నువ్వు చేసిన పనికి అమ్మా బుజ్జీ అనాలా అని వైజయంతి అంటుంది. ఏమైందని అందరూ అడిగితే కేథార్‌కి ఆస్తిలో సగం వాటా ఇస్తున్నావంట అని అడుగుతుంది. జగద్ధాత్రి, కేథార్ సంతోషిస్తారు. కౌషికి అవును అని చెప్పి ఇది ఎప్పుడో అనుకున్నదే కదా అని అంటుంది. ఇందులో తప్పేముంది అని అడుగుతుంది. యువరాజ్ కౌషికితో తప్పు అక్క అని అంటాడు. జగద్ధాత్రి కలుగజేసుకొని తప్పేముంది యువరాజ్ పెద్దమామయ్య గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కేథార్‌కి వదిన ఇస్తుందని అంటుంది. కౌషికి తమ్ముడితో అంతే కదా యువరాజ్ వజ్రపాటి మధుకర్, సుధాకర్‌ల ఆస్తి వాళ్ల వారసులైన నాకు, నీకు, కేథార్‌కే కదా దక్కుతుంది అని అంటుంది. తప్పమ్మి చానా తప్పు మాట్లాడుతుంది. ఈ ఆస్తి మొత్తం వజ్రపాటి మధుకర్ గారి ఏకైక కూతురైన నీకు, వజ్రపాటి సుధాకర్ ఏకైక కొడుకు అని యువరాజ్‌కి మాత్రమే చెందుతుంది. అంతే కానీ ఎవడో దారినపోయిన అడ్డమైన వాడు వచ్చి మేం వజ్రపాటి వారసుడు అంటే ఆస్తి ఇస్తే మేం ఊరుకుంటామా అని అడుగుతుంది. 

జగద్ధాత్రి వైజయంతితో కేథార్ కూడా ఈ ఇంటి వారసుడే కేథార్‌లో ప్రవహించేది కూడా ఈ ఇంటి రక్తమే అని అంటుంది. ఆధారం ఏది అని వైజయంతి అడుగుతుంది. ఆధారాలు చూపించి అప్పుడు మాట్లాడండి అని అడుగుతుంది. ఆధారాలు లేనంత మాత్రానా ఈ తండ్రికి కొడుకు కొడుకు కాకుండా పోడు అని అంటుంది. మాటలు వద్దు అని రుజువు చేయమని నిషిక  అంటుంది. వైజయంతి కౌషికితో చూడమ్మా కౌషికి ఆనాడు ఈయన గారికి పెళ్లికి ముందే ఇంకో భార్య ఉంది అంటే అప్పుడు ఊరుకున్నా..ఈయనకు ఆవిడకు సంతానం ఉంది అంటే అప్పుడు ఊరుకున్నా.. ఆ సంతానం ఇంటికి వచ్చి ఈయన గారిని నాన్న నాన్న అంటే అప్పుడు చూస్తూ ఊరుకున్నా.. కానీ నా కొడుకుకి రావాల్సిన ఆస్తిని ఈ మధ్యలో వచ్చిన నడమంత్రపు వాళ్లకి ఇస్తాను అంటే అస్సలు ఊరుకునేది లేదు. ఈ వజ్రపాటి సుధాకర్‌కి ఉన్నది ఏకైక వారసుడు.. ఆస్తులు అయినా అవమానాలు అయినా ఏదైనా నా కొడుకు ఒక్కడికే దక్కాలి అంటే. అది కాదు వైజయంతి అని సుధాకర్‌ అంటే నువ్వు మాట్లాడకు. నువ్వు నీతి నిజాయితీగా ఉండి ఉంటే నాకు నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటుంది. కౌషికి నేను చెప్పాలి అనుకున్నది నీకు అర్థమైంది అనుకుంటా.. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదు అందుకు సాక్ష్యాలు కావాలి. అవి లేకపోతే లేని పోని కిరీటాలు పెడతాం అంటే ఒప్పుకునేది లేదు.

కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లతో పిన్ని మాటలకు మీరు బాధ పడ్డారు అని తెలుసు కానీ నేను మీకు ఏం సాయం చేయలేను. మీరు అంటే నాకు ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి కానీ అందరికీ సాక్ష్యాలు కావాలి.. మీరు ఈ ఇంటికి వచ్చినప్పుడే నెలలో ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటా అన్నారు. అగ్రిమెంట్ కాలం పూర్తి అవ్వడానికి 3 నెలల టైం ఉంది. ఈ గడువులోపు మీరు నిరూపించుకుంటే ఎవరు అవును అన్నా కాదు అన్నా నేను వజ్రపాటి అన్న ఈ ఇంటి పేరుని కేథార్ ముందు పెట్టి సాధరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయితుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Cyber ​​Truck in Amalapuram: అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
ED vs I-PAC: మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Embed widget