Jagadhatri Serial Today August 11th: జగద్ధాత్రి సీరియల్: జేడీ, కేడీల చేతిలో మేనేజర్ హత్య కేసు: అసలు నిందితులు ఎవరు? కౌషికి అరెస్ట్ ఆపగలరా?
Jagadhatri Serial Today Episode August 11th జేడీ, కేడీలు మేనేజర్‌ని చంపింది ఆఫీస్‌లో ఉన్న మొత్తం అమ్మాయిలు అని కనిపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు మ్యానేజర్‌ని హత్య చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అనుకుంటారు. గాజులు మ్యాచ్ అయిన అమ్మాయిని జేడీ లాగి పెట్టి కొట్టి నిజం చెప్పు అని అంటుంది. ఇంతలో డీఎన్‌ఏ రిపోర్ట్స్ వస్తాయి. వాటిలో మ్యానేజర్ బాడీ మీద చాలా మంది వేలిముద్రలు ఉంటాయి. జేడీ, కేడీ షాక్ అయి ఎవరు చంపారో చెప్పండి అని అడుగుతారు.
జేడీ ఒకమ్మాయి మీద గన్ గురి పెట్టి బెదిరిస్తుంది. ఇంతలో ఒకమ్మాయి వచ్చి జేడీ కాళ్ల మీద పడి మేనేజర్‌ని చంపింది వీళ్లంతా కాదు మేడం నేనే అని చెప్తుంది. ఏం జరిగిందో చెప్పమని జేడీ అడిగితే ఆ అమ్మాయితో మేనేజర్ మిస్ బిహేవ్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో అమ్మాయి మేనేజర్‌ని నెట్టేస్తుంది. దాంతో మేనేజర్ తలకి గాయం అయి చనిపోతాడు. ఆ అమ్మాయికి మిగతా అందరూ సాయం చేస్తామని అంటారు. జేడీతో అమ్మాయిలు అందరూ వాడు నీచుడు అని మంచోడు కాదని ఈ విషయం బయటకు వస్తే కౌషికి గారి పరువు పోతుందని అందరం కలిసి చంపేశామని అంటారు. ఆ అమ్మాయి జేడీ, కేడీలతో ఇందులో తప్పు ఉంటే అది నాదే కౌషికి మేడం తప్పు ఏం లేదు.. ఏ శిక్ష వేసినా నేను రెడీ అంటారు. మిగతా అందరూ వాడో కిరాతకుడు వాడిని చంపడం వల్ల మేం తప్పు చేసినట్లు కాదు కాబట్టి మీరు ఏమైనా శిక్ష వేయాలి అనుకుంటే మా అందర్ని శిక్ష వేయండి అంటుంది.
జేడీ అయితే ఏ ఆడపిల్లని అయినా ఇబ్బంది పెట్టిన ఇలాంటి వాడికి ఇలాంటి శిక్ష పడాలి.. అని జేడీ వకీల్‌సాబ్‌లా డైలాగ్స్ చెప్తుంది. ఇకపై ఎప్పుడూ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్తుంది. ఇక కేసు ఎలా సాల్వ్ చేస్తామని కేడీ అడిగితే ఒక్కరు చేస్తే హత్య ఇంత మంది చేస్తే మిస్టర్ ఈ కేసుని అలాగే వదిలేద్దాం అని అంటుంది. అందరూ జేడీకి సెల్యూట్ కొడతారు. కేడీ అక్క గురించి ఏం చేద్దాం అని అంటాడు. ఆలోచిద్దామని జేడీ అంటుంది.
కౌషికిని అరెస్ట్ చేస్తారని ఇంట్లో అందరూ దిగులుగా ఉంటారు. నిషిక అత్తతో నేను మకుటం లేని మహారాణిని అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. కౌషికిని లొంగిపోమని చెప్తారు. సుధాకర్, కాచి, బూచి అందరూ ఎస్ఐని బతిమాలుతారు. ఎస్‌ఐ కుదరదు అనడంతో కౌషికి వస్తానని చెప్పి పిల్లల్ని ముద్దాడుతుంది. బాబుని కాచికి అప్పగించి నా బాబు జాగ్రత్త అని చెప్తుంది. మాటలు రాని తన కూతుర్ని పట్టుకొని కౌషికి ఏడుస్తుంది. కీర్తి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. పోలీసులతో కౌషికి వెళ్తుంది. కీర్తి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్లు వస్తారు. జగద్ధాత్రి కౌషికితో మీరు ఎక్కడికీ వెళ్లరు వదిన అని అంటుంది. పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చి మేనేజర్‌ని పది మందికి పైగా చంపారని.. మేనేజర్ చనిపోయే టైంకి మా వదిన ఇంట్లోనే ఉంది. హత్య చేయడానికి వాడిన వెపన్స్ కూడా దొరకలేదని అంటారు. అంతా ఓకే కానీ బెయిల్ అయిపోయిందని పోలీస్ అంటాడు. దాంతో కేథార్ మీరు ఇలా అంటారు అని తెలిసే బెయిల్ తీసుకొచ్చాం. మేమే రేపు ఉదయం కోర్టుకి తీసుకొస్తామని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















