Jagadhatri Serial Today August 7th: జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్ మర్డర్ ప్లాన్స్.. జగద్ధాత్రి తిప్పి కొడుతుందా! 4 గంటల్లో ఏం చేయనుందో!
Jagadhatri Serial Today August 7th జగద్ధాత్రి, కేథార్‌లకు ప్రమాదాలు సృష్టిస్తూ మినిస్టర్ బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode పిల్లలు లేరని నిషిక గొడ్రాలు అన్నందుకు కాచి చాలా ఏడుస్తుంది. జగద్ధాత్రి ఓదార్చి రేపు తనకు తెలిసిన మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్తానని చెప్తుంది. ఇక జగద్ధాత్రి రెడీ అవుతూ ఉంటే కేథార్ రొమాంటిక్‌గా చూసి ఎంత అందంగా ఉన్నావో అని కేథార్ జగద్ధాత్రితో చెప్తాడు.
కేథార్ జగద్ధాత్రితో మనకున్న సమస్యలు అన్నీ పోయి ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి మనకు ఒక పాప ఉండాలి అనుకుంటాడు. జగద్ధాత్రి బాబు కావాలని అంటుంది. నాకు పాప కావాలి అని కేథార్ అంటాడు. బాబు పుడితే ఏం చేస్తావ్ అని అడిగితే పాప పుట్టే వరకు కంటూనే ఉంటానని అంటాడు. జగద్ధాత్రి ఏయ్ ఏయ్ అంటూ అంటుంది. ఇక జగద్ధాత్రి, కేథార్లు కాచి, బూచిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. అది చూసిన యువరాజ్ మినిస్టర్ తాయారుకి కాల్ చేసి జగద్ధాత్రి వాళ్లు బయటకు వెళ్లారని అడ్రస్ చెప్తాడు.
తాయారు యువరాజ్కి డబ్బు ఇస్తానని అంటుంది. జగద్ధాత్రి కేథార్లు గురించి తాయారు మనుషులకు చెప్పి వాళ్ల అంతు చూడమని అంటుంది. జగద్ధాత్రి వాళ్ల కారుకి అడ్డంగా ఓ కారు వస్తుంది. వాడు వచ్చి బ్రేక్ కొట్టడంతో జస్ట్లో యాక్సిడెంట్ మిస్ అయిపోతుంది. తాయారు జగద్ధాత్రికి కాల్ చేసి యాక్సిడెంట్ మిస్ అవ్వలేదు నేను మిస్ చేశా నువ్వు నా గురించి తెలిసి తప్పు చేశావ్ అంటుంది. తనకు గంగాధర్ కావాలని తాయారు అడుగుతుంది. నాకు తెలీదు అని జగద్ధాత్రి అంటే జేడీకి అప్పగించింది నువ్వే అని నాకు తెలుసు ఆ గంగాధర్ని నాకు అప్పగించమని జేడీని బతిమాలుతావో ఏం చెప్తావో నాకు తెలీదు.. వాడిని అప్పగించకపోతే మీ ఫ్యామిలీలో అందర్ని చంపేస్తా అంటుంది. ఏం చేసినా నేను చెప్పను అని జగద్ధాత్రి అంటుంది.
జగద్ధాత్రి అలా చెప్పడంతో తాయారు మనుషులు మళ్లీ యాక్సిడెంట్ చేసినట్లు మళ్లీ తప్పిస్తారు. మళ్లీ తాయారు కాల్ చేసి నువ్వు నేను చెప్పింద చేయకపోతే నీకు పార్ట్ పార్ట్లుగా సినిమా చూపిస్తా అంటే నువ్వు పార్ట్ పార్ట్లుగా చూపిస్తే నేను త్రీడీలో ఒకేసారి చూపిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఇక జగద్ధాత్రి కేథార్ డ్రైవింగ్ చేస్తాడని అంటుంది. జగద్ధాత్రి వాళ్లు ఎక్కడికి వెళ్తారని కౌషికి అడుగుతుంది. ఇంతలో జగద్ధాత్రి వాళ్లు వస్తారు. వాళ్లకి పిల్లలు పుట్టే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారని అంటుంది. ఇక కాచి తమకు రెండు సార్లు జరిగిన ప్రమాదాల గురించి చెప్తుంది. అందరూ కంగారు పడతారు.
కౌషికికి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమని చెప్తాడు. దానికి జగద్ధాత్రి ఫోన్ తీసుకొని ఇంకా నాలుగు గంటలు ఉంది. ఈలోపు ఎవరు చేశారో తెలియకపోతే వదిన వస్తుందని అంటుంది. నిషిక, వైజయంతిలు ఎలా అయినా కౌషికి జైలుకి వెళ్లాలి కదా ఇప్పుడే వెళ్లిపోమని అంటారు. 4 గంటల్లో అద్భుతాలు జరుగుతాయా అని యువరాజ్ అంటే ఏమో జరగొచ్చు అంటాడు. కౌషికి బాబుని పట్టుకొని ఏడ్చి నేను జైలుకి వెళ్లిపోతే ఆ నా కూతురు కొడుకు ఏమైపోతారో అని ఏడుస్తుంది. తప్పు చేసిన వాళ్లే బాధ పడాలి మీకు బాధ ఎందుకు మీకు ఏంకాదని కేథార్ అంటాడు. మరోవైపు నిషిక వదిన జైలుకి వెళ్తుందని సంబరపడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















