అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 3rd: శ్రీలక్ష్మీ, మ్యాడీ ఫస్ట్‌నైట్‌ జరిగిందా..? తొలిరాత్రిని చెడగొట్టేందుకు ప్రియంవద వేసిన పథకం బెడిసి కొట్టిందా..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 3rd: శ్రీలక్ష్మీ, మ్యాడీ ఫస్ట్‌నైట్‌ జరిగిందా..? తొలిరాత్రిని చెడగొట్టేందుకు ప్రియంవద వేసిన పథకం బెడిసి కొట్టిందా..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మ్యాడీ,శ్రీలక్ష్మీకి ఫస్ట్‌నైట్ ఏర్పాట్లు చేసిన సూర్యనారాయణ...వారి కోసం ఇంట్లో అన్ని మునగకాయల కూరలు మాత్రమే చేయిస్తాడు. మునగకాయల కూరంటే ఎంతో ఇష్టమైన మ్యాడీ అందుకు ఎందుకు చేయించారో తెలియక ఇష్టంగా తింటాడు. ఒకవైపు ప్రియంవద తినొద్దని సైగ చేస్తున్నా పట్టించుకోకుండా ఫుల్‌గా లాగించేస్తాడు. అన్నం తినడం అయిపోయిన తర్వాత గుడ్‌నైట్‌ చెప్పి వెళ్లబోతుండగా....సూర్యనారాయణ అక్కడికి వచ్చి ఇవాళ నీకు ఫస్ట్‌నైట్‌ అని తెలియదా అని అంటాడు. దీంతో మ్యాడీ నాకు వద్దు అని చెప్పి గోల చేసినా...సూర్యనారాయణ గట్టిగా ఆదేశించడంతో తప్పక ఒప్పుకుంటాడు. వెళ్లి ఏర్పాట్లు చేయండని ఇంట్లో వాళ్లను పెద్దయ్య ఆదేశిస్తాడు.

మ్యాడీ గదిలో ప్రియంవద, సింధూజాక్షి అందరూ కలిసి ఈ ఫస్ట్‌నైట్ ఎలా చెడగొట్టాలా అని మథనపడిపోతుంటారు. ఏదో ఒక  ఐడియా చెప్పమని మ్యాడీ అడగ్గా...ప్రియంవద మండిపడుతుంది. నిన్ను ఇంటికి రావొద్దని పంపిస్తే...ఆ శ్రీలక్ష్మీ బెదిరించిందని వచ్చావు...ఆ మునగకాయ కూర తినొద్దని చెబుతుంటే...మా మాటలు లెక్కచేయకుండా మెక్కావు. ఇప్పుడు  ఏం చేస్తావు...వెళ్లి మీ తాతయ్య చెప్పినట్లు ఫస్ట్‌నైట్‌ చేసుకోమని చెబుతుంది. వెంటనే కలుగజేసుకున్న సింధూజాక్షి జరిగిపోయిన వాటి గురించి వద్దని...జరగాల్సిన పని ఆపాలని అంటుంది. అయినా నీ ప్రమేయం లేకుండా ఆ శ్రీలక్ష్మీ ఏం చేయలేదని అంటుంది. ఒక ఆడదాన్ని నేనే నా ఫస్ట్‌నైట్‌ జరగకుండా  ఆపి నా మొగుడిని మూలనపడుకోబెట్టానని నువ్వు మగాడివి ఆ శ్రీలక్ష్మీని ఆపలేవా అని అంటుంది. 

ఆ శ్రీలక్ష్మీ మామూలుది కాదని...ఇలాంటి మంచి ఛాన్స్ అది మిస్‌ చేసుకోదని ప్రియంవద అంటుంది. మరి ఏం చేద్దామని అంటే...మీరు తాగే పాలల్లో నిద్రమాత్రలు కలుపుతానని వాటిని తాగి మీరిద్దరూ హ్యాపీగా నిద్రపోండని ప్రియంవద చెబుతుంది.ఈ టైంలో మాత్రలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటే...నా దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకొస్తుంది. ఇంతలో మ్యాడీ వాళ్ల అమ్మ పాలు కలుపుతుండగా...సూర్యనారాయణ పిలవడంతో పక్కకు వెళ్తుంది.అప్పుడే  ప్రియంవద ఆపాలల్లో నిద్రమాత్రలు కలుపుతుంది. 

మ్యాడీ,శ్రీలక్ష్మీ ఫస్ట్‌నైట్‌ కోసం గోపీ వాళ్ల రూమ్‌ డెకరేషన్ చేస్తుంటాడు. ఇంతలో శ్రీలక్ష్మీని, మ్యాడీని ఆ గదిలో పంపించేందుకు తీసుకొస్తారు. శ్రీలక్ష్మీ చేతికి పాలగ్లాస్‌ అందిస్తారు. ఆ పాలల్లో నిద్రమాత్రలు కలిపామని ప్రియంవద, సింధూ చాలా సంతోషిస్తుంటారు. ఇంతలో లోపల నుంచి బయటకు వచ్చిన గోపి....చూసుకోకుండా శ్రీలక్ష్మీ చేతిలో ఉన్న పాలగ్లాస్‌ కిందపడగొట్టడంతో పాలన్నీ కిందపడిపోతాయి. తమ ఫ్లాన్ ఇలా అయ్యిందేంటని ప్రియంవద ఆందోళనపడుతుంది. వెంటనే తేరుకుని శుభమా అని ఫస్ట్‌నైట్ జరుగుతుంటే...పాలగ్లాస్ కిందపడిపోయింది కాబట్టి ఏదో అశుభం జరగనుందని...ఈ ఫస్ట్‌నైట్ కార్యక్రమం మళ్లీ పెట్టుకుందామని అనగా...గోపీ అలాంటిదేమీ లేదని అంటాడు. 

ఎన్నో గొడవలు తర్వాతే వీళ్ల పెళ్లి జరిగిందని...ఇప్పుడు ఈ పాలగ్లాస్‌ పడిపోవడం వల్ల వచ్చే నష్టమేమీలేదని చెప్పడంతో...సూర్యనారాయణ మంచిమాట చెప్పావని అంటాడు. వేరే పాలగ్లాస్‌తో పాలు తీసుకొచ్చి శ్రీలక్ష్మీకి ఇప్పించి వాళ్లిద్దరినీ గదిలోకి పంపిస్తారు. లోపలికి వెళ్లిన తర్వాత  పాలన్నీ మ్యాడీ ఒక్కడే తాగేసి లక్ష్మీకి దూరంగా ఉన్నా...ఆమె తన చేష్టలతో మ్యాడీని దగ్గరకు రప్పించుకుంటుంది.

తన గదిలో గోపీ ఒక్కడే ఉండటం చూసిన సూర్యనారాయణ..సింధూజాక్షిని వెతుక్కుంటూ ప్రియంవద రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ తమ ప్లాన్ ఇలా అయ్యేందంటి వాళ్లిద్దరూ చర్చించుకుంటారు. అయినా మ్యాడీ అంత వీక్‌ ఏమీ కాదని...ఆ లక్ష్మీని కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోడని అంటుండగా అక్కడికి వచ్చిన సూర్యనారాయణ...నీ భర్త గదిలో ఎదురుచూస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని గట్టిగా మందలించి సింధూని గోపీ ఉన్న గదిలోకి పంపిస్తాడు సూర్యనారాయణ.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
Nuvvu leka Neanu Lenu Serial Today July 18th:రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
Illu Illalu Pillalu Serial Today July 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget