Jagadhatri Serial Today August 8th: జగద్ధాత్రి సీరియల్: కౌషికి కేసులో ట్విస్ట్! JD, KDల చేతికి అసలు హంతకులు చిక్కుతారా!
Jagadhatri Serial Today Episode August 8th జేడీ, కేడీలు మేనేజర్ మర్డర్ కేసుని సాల్వ్ చేయడంలో దూసుకుపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి తప్పించుకుంటుందేమో అని టెన్షన్‌గా ఉందని.. అక్క ఇష్టమే కానీ నా గుర్తింపు ఆస్తి వదులుకునేంత ఇష్టం లేదని అక్క వాడిని చంపలేదని మనతో పాటు జగద్ధాత్రి, కేథార్ తెలుసని వాళ్లు అక్కని కాపాడుతారని అంటాడు. వాళ్లేమైనా పోలీసులా అని నిషిక అంటే యువరాజ్ మనసులో జగద్ధాత్రి కాదు కానీ ఆ కేథార్ పోలేసే వాడు అక్కకి శిక్ష పడుకుండా చూస్తాడని అనుకుంటాడు.
జేడీ, కేడీలు స్పాట్‌కి వస్తారు. ఎలా అయినా కౌషికిని నిర్దోషిగా తేల్చాలని మొదటి సారి అక్క ఈ కేసు నుంచి తప్పించమని అడిగింది ఎలా అయినా ఆ పని చేయాలని అనుకుంటారు. జేడీ, కేడీలు మళ్లీ లోపలికి వెళ్లి స్టాఫ్‌తో మాట్లాడుతారు. అందర్ని కోపరేట్ చేయమని చెప్తుంది. ఆఫీస్‌లోని అందరి దగ్గర బ్లడ్, హెయిర్ సాంపిల్స్ కలక్ట్ చేయమని అంటుంది. ఇంట్లో కీర్తి తమ్ముడితో ఆడుకుంటే కౌషికి ఏడుస్తూ నా లాంటి వాళ్ల కడుపులో పుట్టడం మీరు చేసుకున్న తప్పు అని అంటుంది. సుధాకర్‌తో నువ్వు ఏం తప్పు చేయలేదు కదా అంటాడు. వైజయంతి, నిషిక మాత్రం కౌషికి తప్పు చేసిందని కౌషికిని బాధ పెడతారు. నా రాత బాలేదు కదా ఎవరిని అడిగి ఏం లాభం అని అనుకుంటుంది.
జేడీకి బుర్కా వేసుకున్న అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయిందని గుర్తొచ్చి ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే నాకేం కాలేదు బాగున్నా అంటుంది. ఇంతలో ఇంకొక అమ్మాయి తను కళ్లు తిరిగి పడిపోయింది అని ఆ అమ్మాయికి సైగ చేయడంతో అవును అంటుంది. ఇక జేడీ రిజిస్టర్ చూసి ఆ రోజు నువ్వు సంతకం చేయలేదు అంటుంది. మర్చిపోయా అని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్తుంది. జేడీ, కేడీలు ఇద్దరూ ఆమెని తీసుకెళ్తారు. అమ్మాయితో మాట్లాడుతూ రమ్యకి కాల్ చేసి మొత్తం వినేలా చేస్తారు. ఏదో ఒక హాస్పిటల్ పేరు చెప్పాలని చెప్పేస్తుంది. కేథార్ రమ్యకి ఆ హాస్పిటల్ డాక్టర్‌గా ఓ లొకేషన్‌ని రమ్మని చెప్తాడు.
ఇంట్లో అందరూ అరగంటే టైం ఉందని కంగారు పడతారు. ఇక కేడీ తనకు ఓ ఫోన్ వచ్చినట్లు ఆ అమ్మాయి ఎడ్మిట్ అయిన హాస్పిటల్ పాప మిస్ అయిందని అంటాడు. రమ్య డాక్టర్‌లా వచ్చి పాపని కిడ్నాప్ చేసింది ఈ అమ్మాయే అంటుంది. నేనేం చేయలేదు అని ఆ అమ్మాయి అంటే జేడీ కేకలేసి పిల్లాడిని ఎక్కడ దాచావ్ అంటుంది. దాంతో ఆ అమ్మాయి నిజం చెప్పేస్తా అని మ్యానేజర్ చనిపోయిన రోజు నేను రాలేదని చెప్తుంది. ఇక బ్లడ్ సాంపిల్స్ వస్తాయి. జేడీ, కేడీలు అసలు హంతకుల్ని పట్టుకుందాం అని వెళ్లి మ్యానేజర్‌ని మర్డర్ చేసింది ఎవరో తెలిసిపోయింది. మీ అంతట మీరే వస్తే మంచిది అని అంటుంది. మ్యానేజర్ మర్డర్‌కి సంబంధించి బ్లడ్ సాంపిల్స్ మ్యాచ్ అయ్యావని మేనేజర్‌ని ఎందుకు చంపావ్ అంటాడు. జేడీ అమ్మాయిని మ్యానేజర్‌ని ఎందుకు చంపావని ప్రశ్నిస్తూ కొట్టబోతే కేడీ అందరూ అమ్మాయిలు భయంతో చేతులు నలుపుకోవడం చూస్తాడు. మరో అమ్మాయి రింగు చూసి మేనేజర్ బాడీ మీద ఉండటం చూసి కేడీకి చెప్తుంది. ఇక మరో అమ్మాయి గాజు చూసి గుర్తు పడుతుంది. మొత్తం జేడీ, కేడీలకు ముగ్గురు మీద అనుమానం వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















