Nuvvunte Naa Jathaga Serial Today August 8th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జీవితంలోకి గ్రహణం ఎవరు?.. దేవా ప్రేమ నిజమేనా?
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 8th దేవా నిజంగా ప్రేమించడం లేదని నటిస్తున్నాడని మిథునకు ఆదిత్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునకు యాక్సిడెంట్ కాకుండా దేవా కాపాడుతాడు. మిథునకు ఏమైందా అని దేవా చాలా కంగారు పడతాడు. దేవా మిథున మీద చూపించిన ప్రేమకు హరివర్ధన్ ఏం మాట్లాడకుండా పక్కకి తప్పుకుంటాడు. మిథున నడవ లేదేమో ఎత్తుకొని తీసుకెళ్తాడు.
మిథునని దేవా ఎత్తుకొని తీసుకెళ్లడం ఆదిత్య చూసి నువ్వు నా పక్కనుంటేనే నేను తట్టుకోలేకపోతున్నా అలాంటిది నా పెళ్లాన్ని నువ్వు ఎత్తుకోవడం చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది.. వదలనురా నిన్ను చంపేస్తా.. మిథున మీద నీకు ఉన్న ప్రేమని చంపేస్తా.. అని అనుకుంటాడు. హరివర్ధన్ దేవా మిథునని కాపాడటం గురించి ఆలోచిస్తుంటాడు. లలిత భర్త దగ్గరకు వెళ్లి దేవా మిథునని కాపాడకపోయి ఉంటే మనకు కడుపుకోత మిగిలేది.. దేవా మనకు ఆ బాధ నుంచి కాపాడాడు. మిథునకు ఏమైనా అయితే దేవా తట్టుకోలేకపోవడం మనం చూశాం కదండీ మన కంటే దేవాకి మిథున మీద ఎక్కువ ప్రేమ ఉంది కదా.. అలాంటి భర్త రావడం అదృష్టం కదండీ.. మీకు కష్టపడి వెతికే పని లేకుండానే మంచి భర్త దొరికాడు కదండీ.. ఇంత కంటే మనకు ఇంకేం కావాలి. దేవా గతం గురించి ఆలోచించి ఆగిపోయారు కానీ దేవా ఎంత మంచి వాడో అర్థం చేసుకోండి అని అంటుంది.
త్రిపుర, రాహుల్లు దేవా గురించి మాట్లాడుకుంటారు. దేవాని అల్లుడిలా అంగీకరించేలా ఉన్నారు. మిథునకు దేవా మీద కోపం పెరిగేలా చేద్దామని అనుకుంటారు. మిథున దేవుడి మందు దీపాలు వెలిగించి దేవా గురించి ఆలోచిస్తుంది. దేవా కూడా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీ విషయంలో మా నాన్న మనసు కొంచెం కొంచెం మారుతుంది. నిన్ను అల్లుడిగా అంగీకరిస్తారు. దేవా ఇక మనకు మన బంధానికి ఎవరూ అడ్డురారు అని అనుకుంటుంది. ఇంతలో ఆదిత్య మిథున దగ్గరకు వస్తుంది. మిథున సంతోషంతో దేవాతో నా బంధానికి ఏ ఆటంకం లేదు అని సంతోషంగా చెప్తుంది. దాంతో ఆదిత్య నీ జీవితానికి దేవా ఓ గ్రహణం అని నాకు అనిపిస్తుందని ఆదిత్య అంటాడు. అలా అంటావేంటి అని మిథున అడిగితే నిన్ను వదిలించుకోవాలనే ఇక్కడికి వచ్చాడని ఆదిత్య అంటాడు.
దేవాకి నువ్వు నీ మనసులో ప్రేమ చెప్పావు కదా నీతో ఎప్పుడైనా చెప్పాడా కనీసం అప్పుడైనా చెప్పాడా మరి నీకు ఎలా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నావ్.. అతనిది నటన అయితే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు ఆదిత్య. దేవాని చూపించి అంత కంగారు పడుతున్నాడు.. మీ నాన్న అతన్ని అంగీకరిస్తాడనే సంతోషమే లేదు కదా నిన్ను వదిలించుకోవానే అనిపిస్తుందని అంటాడు. ఈ వారం మంచిగా ఉండి చివరి రోజు మీ నాన్నకి నచ్చని పని చేస్తే ఏంటి పరిస్థితి జాగ్రత్త మిథున నువ్వు బాధ పడితే నేను తట్టుకోలేను అని అంటాడు.
ఆదిత్య మాటలకు మిథున అనుమానంతో వెళ్తుంది. త్రిపురను సూర్యకాంతం కలుస్తుంది. మా ఇంట్లో ఉన్న దేవాని మీ ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చేలా చేయాలి.. మా అమ్మ అంటే వాడికి ప్రాణం కదా మా అమ్మకి గుండె నొప్పి అని చెప్తాం అని రంగం అంటే నిజం తెలిస్తే మిమల్ని తంటాడుఅని రాహుల్ అంటాడు. ఆస్తి పంచమని అడిగితేనే తన్నడానికి వచ్చారని జరిగిన విషయం చెప్తుంది. ఇంటిని తాకట్టు పెట్టమని త్రిపుర చెప్తుంది. మా అమ్మ పేరున ఇళ్లు ఉంది సంతకం పెట్టమంటే నాన్న తాట తీస్తాడని రంగం అంటాడు. దాంతో మాయ చేసి సంతకం పెట్టించమని రాహుల్ అంటాడు. 5 లక్షలు ఇస్తానని త్రిపుర అంటే 10 లక్షలు ఇస్తే చేస్తానని కాంతం అంటుంది. మిథున దేవా దగ్గరకు వెళ్లి చేతికి తాడు కడుతుంటే దేవా తనకు అవన్నీ నచ్చవని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















