Jagadhatri Serial Today August 13th: జగద్ధాత్రి సీరియల్: కేథార్‌ను వజ్రపాటికి దూరం చేయడానికి యువరాజ్ పక్కా ప్లాన్! కౌషికి వీలునామాకు ముప్పు.. !
Jagadhatri Serial Today Episode August 13th కౌషికి గదిలో ఉన్న డాక్యుమెంట్స్ దొంగలించమని యువరాజ్ రౌడీకి చెప్పి ఇంట్లో అందరూ బయటకు వెళ్లేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్‌లతో నేనేం చేయలేను నన్ను క్షమించండి అందరికీ సాక్ష్యాలు కావాలంటా అని చెప్పేసి వెళ్లిపోతుంది. కేథార్ జగద్ధాత్రితో కనీసం ఆస్తి వస్తే అయినా నన్ను ఈ ఇంటి మనిషిగా గుర్తిస్తారు అనుకున్నా ఆ ఆశ కూడా పోయింది. నా చుట్టూ నా వాళ్లు ఉండి కూడా నేను అప్పటికీ ఇప్పటికీ అనాథగానే బతుకుతున్నా అని కేథార్ జగద్ధాత్రితో చెప్తే సుధాకర్ కన్నీరు పెట్టుకుంటాడు. కేథార్ కూడా ఏడుస్తూ వెళ్లిపోతాడు.
జగద్ధాత్రి కేథార్ వెనకాలే వెళ్తుంది. సుధాకర్ భార్య, కేథార్‌ల మాటలు గుర్తు చేసుకొని చాలా బాధ పడతాడు. కౌషికి, కేథార్, సుధాకర్ ఇలా ముగ్గురు మూడు వైపుల బాధ పడుతూ ఉంటారు. బాబుని చూసి కౌషికి మీ మామయ్య చాలా బాధ పడుతున్నాడురా వాడిని అలా చూడలేకపోతున్నా.. గుండెల్లో వాడిని తమ్ముడిగా చూస్తున్నా బయట ఆ ప్రేమ చూపించలేకపోతున్నా.. సాధ్యమైనంత త్వరగా కేథార్ సుధాకర్ బాబాయ్ కొడుకు అని నిరూపణ అవ్వాలి.. అవుతుంది. ఆ రోజు వస్తుంది అని కౌషికి అనుకుంటుంది.
జగద్ధాత్రి కేథార్ దగ్గరకు వెళ్తుంది. కేథార్ జగద్ధాత్రితో ఏంటి ద్ధాత్రి ఇదంతా దీని కంటే ఓ కత్తి తీసుకొచ్చి నన్ను చంపేస్తే బెటర్. ఎందుకు పదే పదే గుచ్చి గుచ్చి చంపేస్తున్నారు.. నేనేమైనా కోరరాని కోరికలు కోరానా.. నా కన్న తండ్రిని నోరారా నాన్న అని పిలవాలి అనుకున్నా.. మనసారా ఆయన్ను గుండెలకు హత్తుకోవాలని.. జీవితాంతం ఆయన చేయి పట్టుకొని నడవాలి అనుకున్నాను.. నా కోరిక ఏమైనా తప్పా.. అయినా నాకు అర్థమైపోయింది.. ఇక ఈ జన్మకి వజ్రపాటి సుధాకర్ కొడుకు యువరాజ్ ఒక్కడే.. ఈ కేథార్ ఎవరో అని కేథార్ చాలా బాధ పడతాడు. జగద్ధాత్రి కేథార్‌ని ఓదార్చుతుంది. మామయ్య పైకి నిన్ను కొడుకులా అంగీకరించకపోయిన మనసులో మాత్రం ఆయన పెద్ద కొడుకు నువ్వే. మనకు 3 నెలల గడువు ఉంది.. ఈలోపు మనం సాక్ష్యాలు సంపాదించాలి అని అంటుంది. కేథార్ జగద్ధాత్రితో ఎన్నిసార్లు నేను సాక్ష్యాలు తీసుకొస్తే నా తమ్ముడే వాటిని నాశనం చేస్తే నేను వాడి తమ్ముడు అని ఎలా నిరూపించుకోవాలి అని అంటాడు.
జగద్ధాత్రి మహాల్‌కి వెళ్లి మరోసారి వెతుకుదామని అంటుంది. గతంలో కేసు విషయంలో వెళ్తే మనకు మీ అమ్మ ఫొటో అక్కడ దొరికింది కదా అక్కడకు వెళ్దామని అంటుంది. మరోవైపు యువరాజ్, నిషిక, వైజయంతిలు కేథార్ గురించి మాట్లాడుకుంటారు. ఆ కేథార్ మనకు ఆస్తి విషయంలో అడ్డు రాడు. కానీ మీ నాన్న ప్రేమ గురించి మీ అక్క గురించి ఆశ పడుతున్నాడని అంటుంది. కౌషికి కేథార్‌ని తమ్ముడిగా అంగీకరిస్తుంది కాబట్టి వాడిని తన తమ్ముడు అని నిరూపించాలని ప్రయత్నిస్తుంది కాబట్టి వీలునామా కొట్టేయాలని ఆ వీలునామా కొట్టేస్తే కేథార్‌కి ఆస్తి ఇచ్చే అవసరమే ఉండదు అని మాట్లాడుకుంటారు.
యువరాజ్ ఓ రౌడీని పిలిచి తన ఇంట్లో కౌషికి గదిలో ఉన్న వీలునామా కొట్టేయాలని చెప్తాడు. అందరూ పడుకున్న తర్వాత చెప్తానని చెప్తాడు. కౌషికిని గుర్తు పట్టడానికి ఆ రౌడీకి యువరాజ్ కౌషికి ఫొటో చూపిస్తాడు. కౌషికిని చూసిన ఆ రౌడీ డ్రగ్స్ తీసుకుంటూ కౌషికి కావాలి అనుకుంటాడు. ఇక యువరాజ్ రాత్రి తల్లి, భార్యతో ప్లాన్‌కి అన్నీ రెడీ చేసుకుంటాడు. బయట రౌడీ వెయిల్ చేస్తుంటాడు. హాల్‌లో అందరూ ఉంటారు. నిషిక యువరాజ్ దగ్గరకు వచ్చి ఏంటి పార్టీకి వెళ్తావా అని అడుగుతుంది. యువరాజ్ పాత ఫ్రెండ్ అని అంటాడు. అందరికీ చెప్పేసి యువరాజ్ వెళ్లిపోతాడు. ఇక వైజయంతి భర్తకి ఎక్కువ మందులు ఇస్తుంది. మరోవైపు బాబు ఏడిస్తే కౌషికి వెళ్లిపోతుంది.
సుధాకర్ నిద్ర వస్తుందని వెళ్లిపోతాడు. వైజయంతి నిషికతో జగద్ధాత్రి, కేథార్‌లు వినేలా సుధాకర్ ఇన్ హేలర్ అయిపోయింది యువరాజ్‌కి చెప్పాలి అని చెప్పడం మర్చిపోయా అని అంటుంది. నిషిక నేను వెళ్తానంటే కేథార్ రాత్రి పూట వద్దని చెప్పి కేథార్ వెళ్తాడు. జగద్ధాత్రి కూడా వెళ్తుంది. జగద్ధాత్రికి అన్నీ అనుమానంగా అనిపిస్తాయి. కానీ కేథార్ ఏం ఆలోచించొద్దు అనేస్తాడు. ఇద్దరూ బైక్ మీద వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















