News
News
X

Guppedantha Manasu ఆగస్టు 3 ఎపిసోడ్: వసుతో ఉన్నానంటూ సాక్షికి ఝలక్ ఇచ్చిన రిషి, మళ్లీ విషం చిమ్మేందుకు సిద్ధమైన దేవయాని

Guppedantha Manasu August 3 Episode 519:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్రలకు చెక్ పెట్టిన రిషి వసుధార చేయందుకున్నాడు... ఆగస్టు 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు ఆగస్టు 3 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August  3 Episode 519)

సాక్షిని రిషికి కట్టబెట్టాలని దేవయాని కుట్రలో భాగంగా కాలేజీలో స్టేజ్ పై అందరిముందూ సాక్షి అనౌన్స్ చేస్తుంది. అప్పుడేమీ మాట్లాడకుండా ఉండిపోతాడు రిషి. ఇక పెళ్లే తరువాయి అని దేవయాని ఫిక్సైపోయి రిషిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దీంతో రిషి ఓపెన్ అవుతాడు.
రిషి: లైబ్రరీలో జరిగిన సంఘటన మొదలు కాలేజీలో వసు-రిషి ఫొటోస్ తీసి బెదిరించిన విషయాలన్నీ బయటపెడతాడు. ఓ మనిషికి ఏం ఉన్నా లేకపోయినా సహించగలం కానీ సంస్కారం లేకపోవడం భరించలేం. వసుధారని అడ్డం పెట్టుకుని బెదిరించి నా జీవితంలోకి రావాలనుకోవడం ఎంత నీఛమో అర్థం చేసుకోండి. ఆ సాక్షికి చెప్పండి.. ఇప్పటివరకూ తను చేసింది తప్పు..ఇకపై కూడా ఇలాగే చేస్తే నేనేంటో నా ఆవేశం ఏంటో చూపించాల్సి వస్తుందంటాడు.
మహేంద్ర: వదిన గారికి ఈ బాధ్యత అప్పగించి చాలా మంచిపని చేశావ్..వెరీ గుడ్ రిషి..
ఫణీంద్ర: మీ పెద్దమ్మ చెబితే సాక్షి వింటుంది...సాక్షిని ఎంకరేజ్ చేసింది మీ పెద్దమ్మే కాబట్టి ఆమె చెబితే వింటుంది. 
రిషి: నాపై ఉన్న ప్రేమతో అయినా మీరు ఈ విషయం సాక్షికి అర్థమయ్యేలా చెబుతారనుకుంటాను
ధరణి: అత్తయ్యగారికి ఓపని అప్పగిస్తే అది అయిపోయినట్టే భావించాలి...
హాల్లోంచి ఎవరికి వారు జారుకుంటారు...జగతి-దేవయాని తప్ప....
జగతి: అక్కయ్యా..ఇంట్లో స్వీట్ చేసి చాలా రోజులైంది కదా మీరు వద్దంటే వద్దులెండి..ఎంతకాదన్నా మీరు ఈ ఇంటికి పెద్దకదా స్వీట్ క్యాన్సిల్ అంటూ వెళ్లిపోతుంది 

Also Read: దేవయానికి షాక్ ఇచ్చి సాక్షికి ఫుల్ స్టాప్ పెట్టి వసు చేయందుకున్న రిషి

అటు కాలేజీలో ఓ చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తుంటుంది వసుధార. ( రిషి పరిచయం అయినప్పటి నుంచీ జరిగిన సంఘనటలన్నీ తలుచుకుంటుంది). అక్కడ వసు వెయిట్ చేస్తుంది ఇప్పటికే లేట్ అయంది అనుకుంటాడు రిషి. అంతలో కాల్ చేసిన రిషి వెంటనే కట్ చేస్తాడు. ఆయనేంటో ఆయన మూడేంటో అర్థం కాడు అనుకుంటుంది..ఇంతలో రానే వస్తాడు. 
రిషి: ఫోన్లో ఏడుస్తూ మాట్లాడింది వసుధార మనసులో ఏముందో..
వసు: రిషిసార్ మనసులో ఏముందో..
రిషి: ఏదైనా మాట్లాడొచ్చు కదా అనుకుని కాసేపు వెయిట్ చేసిన రిషి..వసు చేయందుకుంటాడు...ఏం మాట్లాడకుండా నాతో రా అంటాడు. రిషి ని చూస్తూ ఆ వెనుకే అడుగులో అడుగువేస్తూ నడుస్తూ వెళుతుంటుంది వసుధార. ఇంతలో రిషికి కాల్ చేస్తుంది సాక్షి. నేను వసుధారతో ఉన్నాను మళ్లీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు...
వసుధార ఎందుకు, ఏంటి అని అడగొద్దు కూర్చో అని కార్ డోర్ తీస్తాడు..

కాఫీ తీసుకొచ్చి జగతి-మహేంద్రకి ఇస్తుంది ధరణి. వదినగారు ఇంకా ఇటు రాలేదేంటో అని మహేంద్ర అంటే..కాసేపట్లో వస్తారులెండి అంటుంది. వదిన గారు ఈ టైమ్ లో నిద్రపోతుంటారా అని మహేంద్ర అంటే..లేదులెండి మావయ్యగారు ఏదో కొత్త ప్లాన్ ఆలోచిస్తుంటారు.
జగతి: అలా ఆలోచిస్తున్నావేంటి ధరణి
మహేంద్ర: ధరణి సరిగ్గానే చెప్పిందిలే..రిషి అంత క్లియర్ గా చెప్పిసేన తర్వాత కొత్త ప్లాన్ వేయకుండా ఎలా ఉంటాడు..
జగతి: ఇప్పుడు ఆలోచించాల్సింది దేవయాని అక్కయ్య గురించి కాదు..రిషి గురించి..
మహేంద్ర: రిషికి ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలుసు..నువ్వు కంగారు పడొద్దు..

Also Read: ప్రేమ్ తనని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న హిమ, అస్సలు మారని నిరుపమ్-శౌర్య

కట్ చేస్తే కార్లో రిషి-వసు వెళుతుంటారు
రిషి: ముక్కలైన నా గుండెను నాకే కానుకగా ఇద్దాం అనుకుంటున్నావా..ఏం చెప్పాలనుకుంటున్నావ్
వసు: మీ మనసులో మాట చెప్పినట్టే నా మనసులో మాట చెప్పాను..ఇంతకన్నా ఏం చెప్పగలను అనుకుంటుంది
రిషి: ఏం ఆలోచిస్తున్నావ్..ఓ సంఘటన జరిగితే పదే పదే దానిగురించే ఆలోచిస్తావా
వసు: దేనిగురించి సార్..
రిషి: ఒకటి అని కాదు..చాలా విషయాలపై మాట్లాడాను
వసు: ఇష్టమైనది అయితే భారం అనిపించదు.. ఇష్టమైతో ఓటమి కూడా బావుంటుంది..కొన్నిటికి సమాధానం చెప్పాలన్నా మాటలుదొరకవు సార్ అంటుంది..

ఇంతలో కారు చెడిపోతుంది...ఆపి రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు...
వసు: మనం ఎటెళుతున్నాం సార్
రిషి: ఇంకా అడగలేదేంటి అనుకుంటున్నా
వసు: నిజానికి మిమ్మల్ని ఎక్కడికి అని అడగాల్సిన అవసరం లేదు..నమ్మకం సార్. మనం చాలా దూరం వచ్చేశాం..వెనక్కు ఎలా వెళతాం సార్
రిషి: జీవితం అనే ప్రయాణంల ఒక్కోచోట మన ప్రయాణం ఆగిపోతుంది..అంతమాత్రాన అక్కడే ఆగిపోలేం కదా.. కారైనా, మనుషులైనా ఏదోమార్పు ఉంటుంది కదా
వసు: ఈ మాట ఊరికే అన్నారా లేదా ఇంకేదైనా అర్థంతో అన్నారా....

Also Read: రిషికి మరోసారి ప్రపోజ్ చేసిన వసు,దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి - సాక్షికి పెద్ద షాకే ఇది!

కోపంగా ఎంట్రీ ఇచ్చిన సాక్షి..ఆంటీ నాకు సమాధానం కావాలి.. నేను మర్యాదల కోసం రాలేదు..నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని అవునా కాదా ఇది తేల్చుకునేందుకే వచ్చానంటుంది. రిషికి కాల్ చేస్తే..ఆ వసుధారతో కలసి ఎక్కడికో వెళుతున్నాడంట..ఎక్కడికి అని అడిగితే చెప్పడు..నేను కాల్ చేస్తే ఒక్కముక్కలో ఆన్సర్ చెప్పి కట్ చేశాడు.. మళ్లీ కాల్ చేస్తే తీయడం లేదు..అసలేం జరుగుతోందో నాకు మాత్రం అర్థంకావడం లేదు. రిషికి ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలియదు... నేను ఇది చాలా సీరియస్ గా తీసుకుంటాను..రిషి పద్ధతి మార్చుకోవాలి..రిషి ఇలా చేయడం ఏం బాలేదు..

జగతి: నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు..మీకు మీకు ఏదైనా సమస్య ఉంటే రిషి-నువ్వు తేల్చుకోవాలి.. ఇంటికొచ్చి గొడవ చేయడం ఏంటి..
దేవయాని: నేను మాట్లాడుతాను కదా జగతి..నువ్వు ఆగు.. సాక్షి నీ ప్లాబ్లెమ్ ఏంటి..
సాక్షి: ఎంగేజ్ మెంట్ అయిందని నేను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఊరుకున్నాడు..ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు
దేవయాని: నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత రిషి ఏమీ మాట్లాడకపోతే అవును అని నువ్వు ఎలా అనుకుంటావ్. మౌనం అర్థాంగీకారం అన్నారు కానీ పూర్తి అంగీకారం అనలేదు కదా. కాలేజీలో అందరి ముందూ మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పినదానికి ఒప్పుకున్నట్టు కాదు కదా..
జగతి, మహేంద్ర, ధరణి...వీళ్లంతా దేవయాని రివర్స్ గేమ్ ఆడుతున్నారా అనుకుంటారు..
సాక్షి: మీరు కూడా రిషిని సపోర్ట్ చేస్తున్నారా
దేవయాని: రిషికి నువ్వుంటే ఇష్టం లేదు..రిషి నిన్ను ప్రేమించడం లేదు..రిషి నిన్ను పెళ్లిచేసుకోవడం లేదు..

ఎపిసోడ్ ముగిసింది.

Published at : 03 Aug 2022 09:39 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu august 3 Episode 519

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?