Guppedantha Manasu ఏప్రిల్ 9 ఎపిసోడ్: వసుధారని వెతుక్కుంటూ వచ్చిన రిషి ఒంటరితనం
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 9 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 9 శనివారం ఎపిసోడ్
రిషి ఎందుకు పిలిచావ్ అంటూ ధరణి లోపలకు వస్తుంది.. మాట్లాడవేంటి రిషి అని అడుగితే క్యాలెండర్ తీసుకొచ్చి ధరణికి చూపిస్తాడు. ఏంటిది అంటే..
రిషి: ఈ నెలకు ఓ ప్రత్యేకత ఉంది వదినా
ధరణి: నాకు అర్థం కాలేదు..
గౌతమ్: ఏంట్రా ఏదో ప్రత్యేకత అంటున్నావ్ ఏంటది..
రిషి: వదినా..నేను కాలేజీకి వెళుతున్నాను
గౌతమ్: నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా...
రిషి: అన్నీ తెలుసుకోవాలి అనుకోవడం అన్ని వేళలా కరెక్ట్ కాదేమో...
గౌతమ్: ఏంటి వదినా వీడు..నేను ఫ్రెండ్ నే కదా..నాతో కూడా పంచుకోడు...
ధరణి: అద్దం కొండను కూడా చూపిస్తుంది కానీ చిన్న రాయి తగిలితేనే ముక్కలవుతుంది...రిషి మనసు కూడా అద్ధం లాంటిదే.. తను చెప్పాలనుకుంటేనే చెబుతాడు...
గౌతమ్: తన బాధేంటో చెబితేనే కదా పరిష్కారం ఉంటుంది...
ధరణి: చిన్నపిల్లలు ఆకలి, నిద్ర ఇలా ఏ ఫీలింగ్ ఉన్నా ఏడుస్తారు వాళ్లు చెప్పరు..రిషి కూడా అంతే...
Also Read: శౌర్య ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుంటానన్న హిమ-తగ్గేదే లే అంటున్న రౌడీ బేబీ
జగతి ఇంట్లో
ఫొటోలు చూసుకుంటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటారు జగతి-మహేంద్ర. ఇద్దర్నీ చూసి వసుధార హ్యీపీగా ఫీలవుతుంది. వీళ్లద్దరూ ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా కలిసి ఉంటే బావుండేది. రిషి సార్ ఎందుకో జగతి మేడం విషయంలో అభిప్రాయం మార్చుకోవడం లేదనుకుంటుంది. ఇంతలో వసుకి కాల్ చేసిన రిషి..డాడ్ ని బయటకు రమ్మని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ల చిరునవ్వులకు అడ్డంగా వెళుతున్నానా అనుకుంటూ వెళ్లిన వసుధార... రిషి సార్ వచ్చారట కార్లో ఉన్నారంటుంది. ఉంటే ఉండనీ నాకేంటని అని మహేంద్ర అంటే... వెళ్లి కలవ్వా అని జగతి అంటుంది. ఇంతదాకా వచ్చినవాడు లోపలకు రాలేడా...వాడికే అంత పంతం ఉంటే నాకెంత ఉండాలంటాడు మహేంద్ర. నేను వెళ్లను జగతి అంటే...వాడికి పంతం ఉందనే అనుకుందాం.. నువ్వైనా ఓ మెట్టు దిగి వెళ్లాలి కదా ఈ విషయాన్ని పెద్దగా చేయకు, రిషి వెనక్కు వెళ్లిపోకముందే వెళ్లు ఎందుకొచ్చాడో ఏంటో అంటుంది. సరే అని బయటకు వెళతాడు మహేంద్ర.
రిషి: ఏం మాట్లాడరేంటి డాడ్
మహేంద్ర: ఆలోచిస్తున్నా రిషి
రిషి: మీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా..రిసార్ట్ బుక్ చేశాను అక్కడకు వెళదాం...
మహేంద్ర: మనం అంటే నువ్వునేను మాత్రమే కాదు రిషి..ఇంకా ఉన్నారు కదా...
రిషి: ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని పట్టించుకోను అని మీకు తెలుసు
మహేంద్ర: ఇంతకుముందు జగతి అంటే ఎవ్వరికీ తెలియదు...కానీ ఇప్పుడు జగతి నా భార్య అని ప్రపంచానికి తెలిసింది..తనని కాదని నీతో సెలబ్రేషన్ కరెక్ట్ కాదు... మనం అంటే నీ ఉద్దేశంలో నువ్వు నేను మాత్రమే... ఇది మారాలి రిషి...
రిషి: మన చర్చ ఇప్పుడు బర్త్ జే సెలబ్రేషన్ గురించి..
మహేంద్ర: నీకు నేను కావాలి నా సంతోషం కావాలనుకున్నప్పుడు నా సంతోషం ఏంటో తెలుసుకోవాలి కదా..
రిషి: నా కోసం ఒక్కరోజు స్పెండ్ చేయలేరా
మహేంద్ర: ఆ ఒక్క రోజు తిరిగి రావాలంటే మళ్లీ 364 రోజులు పడుతుంది... తనని వదిలేసి వచ్చిన గిల్టీ ఫీలింగ్ నాకుండిపోతుంది
రిషి: మీరు రానంటారని అనుకోలేదు
మహేంద్ర: నన్ను ఒక్కడినే పిలుస్తావ్ అనుకోలేదు..
రిషి: నా సంతోషం కోసం రావొచ్చు కదా
మహేంద్ర: బాధ ఒక్కరిమే అనుభవించొచ్చు కానీ సంతోషంగా ఉన్నప్పుడు చుట్టూ పదిమంది ఉండాలి... నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావ్...
మళ్లీ మహేంద్రను తీసుకెళ్లి జగతి ఇంట్లో దింపేసి వస్తాడు..
Also Read: తండ్రి బర్త్ డే సెలబ్రేట్ చేయాలనుకున్న రిషికి వసు ఇచ్చే సలహా ఏంటి
రెస్టారెంట్లో కూర్చున్న రిషి...తండ్రి తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో రిషిని చూసిన వసుధార సార్ వచ్చి ఎంతసేపైందో నేను చూసుకోలేదు అనుకుంటుంది.
వసుధార: నేను చూసుకోలేదు ఎంతసేపైంది సార్ వచ్చి
రిషి: ఎవరిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు
వసుధార: కోపంగా ఉన్నారు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది అనుకున్న వసుధార... కాఫీ కావాలా సార్
రిషి: కాఫీ చాలు కంపెనీ అవసరం లేదు... నా ఒంటరి తనం వసుధారని వెతుక్కుంటూ వచ్చిందా...డాడ్ ని ఎలా ఒప్పించాలి. ఇంతలో కాఫీ ఇచ్చి కూర్చున్న వసుధారతో..నీ వర్క్ డిస్ట్రబ్ అవుతుందేమో అంటే..పర్వాలేదు సార్ అంటుంది.
రిషి: మనకు ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాం
వసుధార: మనకు ఇష్టమైన వాళ్లతో చెప్పుకుంటాం
రిషి: వాళ్లవల్లే ఇబ్బంది వస్తే ఏం చేయాలి.. కష్టం-సంతోషాన్ని డాడ్ తో పంచుకునేవాడిని...కానీ డాడ్ బాధపెడితే ఎవరికి చెప్పాలో అర్థంకావడం లేదు... నాపై నీ అభిప్రాయం ఏంటని చాలాసార్లు అడిగాను... మీ అందరి దృష్టిలో మెండివాడిని, కోపిష్టివాడిని...
వసుధార: అన్ని సందర్భాల్లో అందరూ ఒకేలా ఉండలేరు కదా..
రిషి: నా పరిస్థితి అలాగే ఉంది..నీ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటావ్
వసుధార: నేదేముంది సార్..సంతోషం అనేది నా జీవితంలో లేదు...
రిషి: మా డాడ్ పుట్టిన రోజుని సంతోషంగా సెలబ్రేట్ చేసేవాడిని, ప్రతిసారీ ఇద్దరం దూంగా వెళ్లిపోయేవారం...కానీ మా డాడ్ ఇప్పుడు నాకు దూరంగా వెళ్లిపోయారు...
రెస్టారెంట్లోంచి బయటకు వెళ్లిపోయిన రిషి ఓ దగ్గర కూర్చుని తండ్రి మాటలు గుర్తుచేసుకుంటాడు... అక్కడకు వెళ్లిన వసుధార...ఇక్కడ కూర్చున్నారేంటి సార్ అంటుంది. ఇక్కడ కూర్చోవాలంటే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలా అంటాడు...ఆటోలో వెళుతూ మిమ్మల్ని చూశాను సార్ అంటూ.. భయ్యా మీరెళ్లిపోండని ఆటోకి చెబుతుంది...
రిషి: ఒంటరి తనం ఒక్కోసారి భయంకరంగా ఉంటుంది కదా..
వసుధార: రెస్టారెంట్లో మీరు సడెన్ గా లేచి వెళ్లిపోయేసరికి కంగారు పడ్డాను సార్
రిషి: ఎవరి భారం వాళ్లు మోయాలి, ఎవరి కష్టం వాళ్లు పడాలి... వసుధారా...మా డాడ్ నాతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి..
వసుధార: దీనికి ఒకే ఒక్కరు సమాధానం చెప్పాలి...( ఏంటి వాళ్ల మేడం పేరు చెబుతుందా అని రిషి అనుకుంటాడు) (మీరే సార్ ...మీరు తప్ప ఇంకెవరూ సమాధానం చెప్పుకోలేరు అనుకుంటుంది)
రిషి: చెప్పు వసుధార...ఏం మాట్లాడవేంటి..ఒక్కోసారి మౌనమే గొప్పగా సమాధానం చెబుతుంది సార్... మీ సమస్యకి మీరే గొప్పగా పరిష్కారం ఆలోచించుకోగలరు సార్..వెళ్దామా సార్..
సోమవారం ఎపిసోడ్ లో
పల్లీలు తినే దగ్గరకు వెళ్లిన రిషి... గలగలా మాట్లాడుతూనే ఉంటాడు.ఆశ్చర్యపోయిన వసుధార ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుందంటుంది. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఊరికే అంటారా ఏంటంటాడు మ్యాథ్స్ సార్...