Guppedanta Manasu Serial Today August 24th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: సీన్ లోకి ఎంటరైన అసలు రంగ – రిషి నటిస్తున్నాడని నిజం తెలుసుకున్న దేవయాని, శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: తన ఎండీ సీటు కోసం సరోజను కూడా పావుగా వాడుకోవాలని శైలేంద్ర ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా? అంటూ సరోజ నిలదీయడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్ నుంచి తేరుకుని మీ బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని చెప్తాడు. అయితే ఎండీ సీట్ కోసం సరోజను కూడా పావుగా వాడుకోవాలి అనుకుంటాడు శైలేంద్ర. వసుధారపై సరోజ మనసులో ద్వేషాన్ని నింపుతాడు. మీ బావ నీకు దక్కాలంటే నేను చెప్పినట్లు చేయాలంటాడు శైలేంద్ర. మరోవైపు వసుధారకు రిషి సర్‌ప్రైజ్ ఇస్తాడు. వసుధారకు చెప్పకుండా చక్రపాణి ఇంటికి తీసుకెళతాడు. తండ్రిని చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది.
రిషి: అదేంటి మామయ్య వసుధారను ఎలా ఉన్నావు అని కూడా అడగట్లేదు మీరు.
చక్రపాణి: నీ దగ్గర వసుధార ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉన్నావని అడగాల్సిన పనిలేదు బాబు.
అని చెప్తుండగానే ఒక వ్యక్తి శరీరమంతా గాయాలతో వస్తాడు.
వసుధార: రిషి సార్ ఎవరితను..?
రిషి: ఇన్ని రోజులు నేను ఎవరి పేరుతో బయట తిరుగుతున్నానో అతడే ఇతను. అసలైన రంగా ఇతడే..!
రిషి మాటలకు వసుధార షాకవుతుంది. అసలైన రంగను బుజ్జి గుర్తుపడతాడు.
బుజ్జి: రంగా ఒంటిపై దెబ్బలు ఎందుకున్నాయి. అతడికి సీక్రెట్‌గా ఎందుకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. మా రంగా ప్లేస్‌లో మీరు మా ఊరికి ఎందుకొచ్చారు.
వసుధార: అసలు ఏం జరుగింది రిషి సర్.
అని అడగ్గానే రంగా ఓ మెకానిక్ అని, తనపై కొందరు ఎటాక్ చేస్తోండగా..రంగా వారికి అడ్డుగా వెళ్లి తన ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడని జరిగిన కథ మొత్తం రిషి చెప్తాడు. చిన్నప్పుడే రంగా ఊరు వదిలిపెట్టి వెళ్లడంతో.. నేను రంగాను అని చెప్పినా ఎవ్వరూ అనుమానించలేదు అని రిషి చెప్తాడు. అమ్మ నాకు రాసిన లెటర్ ఇవ్వడానికి వచ్చి ఈ రంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని అమ్మ రాసిన లెటర్‌లో చాలా నిజాలు ఉన్నాయని చెప్తాడు రిషి. మరోవైపు కొడుకును తిడుతుంది దేవయాని.
దేవయాని: నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి శైలేంద్ర. అసలు అతడు రంగానే కాదని రిషి అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను.
శైలేంద్ర: అవును మామ్ కానీ వాడు రంగా అని నన్ను నమ్మించాడు.
దేవయాని: వాడు రిషి కాబట్టే.. నువ్వు ఊరు వెళ్లినప్పుడు వసుధార నీ కంట పడకుండా దాచిపెట్టాడు. ఇప్పుడు ఏ భయం లేకుండా కాలేజీలో, ఇంట్లో తిరుగుతున్నాడు. వాడు రిషి కాకపోతే వసుధార వాడితో ఎందుకు కలిసి ఉంటుంది.
అని దేవయాని కోపంగా శైలేంద్రను తిడుతుంది. మరోవైపు
వసుధారతో సరోజకు ఫోన్ చేయిస్తాడు రిషి. వసుధార మాట వినగానే సరోజ ఫైర్ అవుతుంది. నిన్ను వదిలేది లేదని అంటుంది. నువ్వు, శైలేంద్ర కలిసే ఈ డ్రామా ఆడారంటూ కోపంగా తిడుతుంది. అయితే సరోజ మాటలతో శైలేంద్ర, దేవయానిలకు తాను రిషిని అన్న విషయం తెలిసి ఉండొచ్చని అనుకుంటాడు రిషి.
వసుధార: రిషి సార్ జగతి మేడం రాసిన లెటర్ చూపించి మీ అన్నయ్య కుట్రలను బయటపెట్టొచ్చు కదా?
రిషి: ఇన్ని చేసిన వాళ్లకు ఆ లెటర్ అబద్ధం అని నిరూపించడం పెద్ద విషయం కాదు వసుధార.
వసుధార: మరి ఎలా సర్ ఆ శైలేంద్ర కుట్రలను ఆపేది.
రిషి: వాళ్ల నోటితోనే నిజాలన్నీ బయటపెట్టిస్తాను. వాళ్ల నిజస్వరూపం బయటపడే టైమొచ్చింది.
అని రిషి, వసుధారకు చెప్తాడు. మరోవైపు మనుకు నిజం తెలిసినా ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడని శైలేంద్ర ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు.
తర్వాత మహేంద్ర దగ్గరకు వెళ్లి ఆయనను రెచ్చగొట్టాలని డిసైడ్ అవుతాడు శైలేంద్ర. వెంటనే మహేంద్ర దగ్గరకు వెళ్తాడు. ఇంతలో రిషి, వసుధార కూడా వస్తారు. మహేంద్ర, రిషిని ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. దీంతో తనను కాపాడిన వ్యక్తి దగ్గరకు వెళ్లానని చెప్పి నువ్వు ఇక్కడెందుకున్నావని శైలేంద్రను అడుగుతాడు రిషి. దీంతో బాబాయ్ ఎలా ఉన్నాడో..అసలు ఉన్నాడో లేదో చూద్దామని వచ్చానని శైలేంద్ర బదులిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.