అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 21st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి – మనుకు ఫోన్ చేసిన మహేంద్ర

Guppedanta Manasu Today Episode: చెప్పకుండా తన చాంబర్ లోకి వచ్చిన శైలేంద్రను వసుధార తిట్టడంతో రిషి, శైలేంద్రకు సారీ చెప్పిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మనును రెచ్చగొట్టడానికి వెళ్లిన శైలేంద్ర మను చేతిలో అవమానం ఎదుర్కొని ఇంటికి వెళ్తాడు. మనుగాడికి నేను షాక్‌ ఇద్దామని వెళ్లితే వాడే నాకు షాక్‌ ఇచ్చాడు మామ్‌ అంటూ దేవయానికి చెప్తాడు శైలేంద్ర.  ఆగస్ట్ అయిపోయేలోపు ఏం జరుగుతుందో చూడు  అంటూ తనకు వార్నింగ్‌ ఇచ్చాడని శైలేంద్ర చెప్పి.. ఇంతకీ ఆ మనుగాడు ఏం చేయబోతున్నాడు మామ్‌. అని శైలేంద్ర, దేవయానిని అడుగుతాడు.

    తండ్రి ఎవరో తెలిసే దాకా ఆవేశం ఉండింది. తన తండ్రి మహేంద్రే అని తెలిశాక మనుకు కోపం పోయి అభిమానం ఏర్పడింది అని దేవయాని చెప్తుంది. వాణ్ని నువ్వు ఇలాగే రెచ్చగొడుతూ ఉండు ఏదో ఒక రోజు వాడు మనం అనుకున్నది చేస్తాడు అని చెప్తుంది దేవయాని.  మరోవైపు తాను మను తండ్రి అన్న విషయంపై మహేంద్ర ఆలోచిస్తుంటాడు.

మహేంద్ర: నేను మను తండ్రిని ఏంటీ. వసుధార అంటే అనుపమ ఎందుకు అలా రియాక్ట్ అయింది. నేను మను తండ్రిని కాదు కదా. అనుపమ చెప్పకుండా వసుధార అంత కచ్చితంగా మాట్లాడదు కదా. ఎక్కడో పొరపాటు జరిగింది.

 అని మహేంద్ర ఆలోచిస్తూ వసుధార గతంలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత మనుకు కాల్ చేస్తాడు. అది చూసి మను కోపంతో రగిలిపోతాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మహేంద్ర మళ్లీ కాల్ చేస్తాడు. అయినా మను లిఫ్ట్ చేయడు. మను నీతో మాట్లాడాలి. కాల్ లిఫ్ట్ చేయి అని మహేంద్ర మెసేజ్ పంపిస్తాడు. నేను మీతో మాట్లాడలేను. మిమ్మల్ని కలవలేను. కలిస్తే ఏం జరగుతుందో భయంగా ఉంది. అంటూ మను రిప్లై పంపిస్తాడు. మరోవైపు మను కోపంగా ఉండటం అనుపమ చూస్తుంది. మనుకు నిజం తెలిసినట్లుందని అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర, అనుపమకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు.నేరుగా మాట్లాడాలి అనుకుని వెళ్లబోతుంటే రిషి ఫోన్‌ చేసి ఇవాళ మీరు నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తాడు.

వసుధార: రిషి సర్‌ మీరు ఇంత కూల్‌గా ఎలా ఉంటున్నారు. ఇంతపెద్ద విషయం తెలిసాక..

శైలేంద్ర: ఏ విషయం వసుధార ( అంటూ శైలేంద్ర వస్తాడు.)

వసుధార: నీకు అసలు బుద్ధి ఉందా. ఇంగిత జ్ఞానం ఉందా..? చదువుకున్నావు కదా. క్యాబిన్‌లోకి వచ్చేముందు అడగాలని తెలియదా..?

రిషి: వసుధార తను మా అన్నయ్య. తనను నువ్వు ఇలా ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు. మీరు అని పిలవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. మా అన్నయ్య నా క్యాబిన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. ఎప్పుడైనా వెళ్లొచ్చు

వసుధార: తన గురించి తెలిసి కూడా ఇలా అంటున్నారా సర్‌.

రిషి: తెలుసు వసుధార. నువ్ నాకేం చెప్పొద్దు. ముందు మా అన్నయ్యకు సారీ చెప్పు

వసుధార: నేను సారీ చెప్పాలా..?

రిషి: చెప్పాలి... ఇప్పుడు సారీ చెప్పి తీరాల్సిందే. నువ్ కరెక్ట్‌ గానే విన్నావు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా అన్నయ్యకు సారీ చెప్పు.

వసుధార: అర్థమైంది సార్. మీరెందుకు సారీ చెప్పమంటున్నారో .. శైలేంద్ర గారు సారీ..

శైలేంద్ర: ఏమన్నావ్ వినపడలేదు మరోసారి చెప్పు.

వసుధార: శైలేంద్ర గారు సారీ

శైలేంద్ర: పర్లేదు. ఇప్పటికైనా మా అన్నదమ్ముల అనుబంధం అర్థమైందా. మమ్మల్ని ఎవరు విడదీయలేరు.

 అని చెప్పి రిషిని తీసుకుని బయటకు వెళ్తాడు శైలేంద్ర. ఇంతకుముందు వసుధార ఏదో పెద్ద విషయం అంటుంది. ఏంటది అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి. ఇంతకీ ఎవరు అన్నయ్య మను అని రిషి అడుగుతాడు. దీంతో  మను గురించి చెప్తాడు శైలేంద్ర. ఆ మనుగాడు మా బాబాయ్‌ని ఏమైనా చేయడానికి వచ్చాడా? అని శైలేంద్ర అడిగితే లేదని రిషి చెప్తాడు.

    ఎప్పుడైనా మను వచ్చి ఏదైనా చేసినా వెంటనే నాకు చెప్పాలని అసలు వసుధార ఇంతకుముందు మాట్లాడిన విషయం ఏంటని మళ్ళీ అడుగుతాడు శైలేంద్ర.  నీ గురించే చెప్పిందని నువ్వు ఎండీ పదవి కోసం అరాచకాలు చేస్తున్నావని.. ఆఖరికి రిషిని కూడా చంపబోయావని చెప్పింది. అయినా అవన్నీ నాకెందుకు అన్నయ్యా.. నిన్ను ఎండీని చేసి నేను వెళ్లిపోతాను అంటాడు రిషి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Embed widget