Chinni Serial Today September 5th: చిన్ని సీరియల్: హాల్దీ వేడుకలో మధు, మహిలపై పసుపు! మహి డబ్బు సాయం, స్వప్న మధుకి ఏం చెప్పిందంటే!
Chinni Serial Today Episode September 5th మధు హల్దీ వేడుకలో మహి సందడి చేయడం మహిని చూస్తూ మధు ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today September 5th Episode మధు వేసిన కృష్ణుడి అడుగుల్లో మ్యాడీ అడుగులు వేసుకుంటూ తన కోసం వచ్చి ఇద్దరూ డ్యాన్స్ వేసినట్లు కలలు కంటుంది. ఇంతలో స్వప్న వచ్చి ఏంటి డ్రీమ్ లోకి వెళ్లిపోయావా.. వచ్చింది పెళ్లి కొడుకు కాదు.. మ్యాడీ అని చెప్తుంది. మధు మ్యాడీని చూస్తూ ఉంటుంది. మ్యాడీ అతని ఫ్రెండ్ వచ్చి పక్కనే ఉన్న పువ్వులు మధు మీద విసరుతారు. 
మధు తల్లిదండ్రులతో పాటు లోహిత వాళ్లు కూడా బయటకు వస్తారు. ఇక లోహితని చూసి మహి నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని అంటే స్వరూప వెంటనే తను ఉదయమే వచ్చింది.. ఇంట్లో పిల్లలా ఇళ్లు తుడవడం.. బూజు దులపడం చేసిందని అంటుంది. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా లోహి అని మహి అడుగుతాడు. ఇక మహి సుబ్బారావుతో అంకుల్ మీరేం టెన్షన్ పడొద్దు మేం అంతా చూసుకుంటాం అని ఒకరు వంట, మరొకరు డెకరేషన్, తాను పెళ్లి వాళ్లని రిసీవ్ చేసుకోవడం ఇలా ఒక్కోక్కరం ఒక్కోపని చూసుకుంటామని అంటాడు.
సుబ్బు కన్నీరు పెట్టుకుంటాడు. ఏమైందని మహి అడిగితే పెళ్లి చూపుల రోజు నిన్ను చాలా బాధ పెట్టాను కానీ అవేమీ పట్టించుకోకుండా మళ్లీ వచ్చి అన్ని పనులు మీద వేసుకున్నావ్ అంటాడు. దానికి మహి అవన్నీ వదిలేయండి అంకుల్ మా గ్యాంగ్‌లో ఫస్ట్ పెళ్లి చేసుకుంటుంది మధునే ఇదో మంచి మెమోరీలా ఉండిపోవాలని అంటాడు. అందరూ లోపలికి వెళ్లిన తర్వాత స్వప్న మధుతో ఈటైంలో చెప్పడం కరెక్ట్ కాదు నీ ప్రేమ మనసులోనే దాచుకొని నువ్వో మంచి మనసు ఉన్న వ్యక్తిని కోల్పోతున్నావ్ అని అంటుంది. దానికి మధు రాసి పెట్టి ఉండాలి కదా అని అంటుంది.

శ్రేయ బాధగా ఉంటే చిన్ని గురించి ఆలోచించకు అని శ్రేయకి వసంత చెప్తుంది. ఇక నాగవల్లి వచ్చి నా కొడుకు గురించి ఏం ఆలోచిస్తున్నావ్ అంటుంది. దేవా కూడా అక్కడికే వస్తాడు. డిపార్ట్ మెంట్ నుంచి వల్లికి ఫోన్ వస్తుంది. చిన్ని కోసం ఎంక్వైరీ చేస్తున్నామని ఓ విలేజ్‌లో ఫోన్ సిగ్నల్ వచ్చిందని ట్రేస్ చేస్తున్నాం అని అంటారు. అతి త్వరలో చిన్నిని, బాలరాజుని సజీవ దహనం చేస్తున్నామని నాగవల్లి దేవాతో అంటాడు.

సుబ్బు, స్వరూపలు డబ్బులు సర్దుబాటు కాలేదని సడెన్‌గా ఇవ్వాల్సిన వ్యక్తి ఇవ్వలేదని డబ్బు గురించి మాట్లాడుకుంటారు. డెకరేషన్, వంట వాళ్లకి డబ్బులు ఇవ్వాలి ఏం చేస్తాం అని తర్జనభర్జన అవుతారు. ఆ మాటలు మహి వింటాడు. దగ్గరకు వెళ్లి సమయానికి డబ్బు అందక ఎంత ఇబ్బంది పెడుతున్నారో అర్థమైంది. మధుకి మేం ఫ్రెండ్స్ ఉన్నాం కదా మమల్ని అడగాలి కదా అని మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేను ఏర్పాటు చేస్తా అంటాడు.
వద్దు బాబు అని వాళ్లు అంటే మీకు మధు పెళ్లి మీద ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది.. మధు విషయంలో నాకు బాధ్యత ఉంది దయచేసి ఇంకేం బాధ పడకండి ఎంత కావాలో చెప్పండి అంటాడు. సుబ్బు ఇబ్బంది పడుతుంటే నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని తాను ఇస్తానని అంటాడు. సుబ్బు, స్వరూప ఇద్దరూ మహికి దండం పెడతాడు.

వినవమ్మా.. తూరుపు చుక్కా.. వినవమ్మా.. పెళ్లంటే నూరేళ్ల పంట.. అని పాటతో పసుపు దండం హల్దీ ఫంక్షన్‌కి ఏర్పాట్లు జరుగుతాయి. పెళ్లి కొడుకు వస్తాడు. మధుని హల్దీ వేడుకు రెడీ చేస్తారు. మధు ఫ్రెండ్స్ అందరూ పసుపు బట్టల్లో మెరిసిపోతారు. మధుని తీసుకొని వస్తారు. మధుని చూసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగుంది దీన్ని అమ్మేసి దుబాయ్ వెళ్లిపోతా అనుకుంటాడు. ఇక డ్యాన్స్‌లు వేస్తూ మధుని పెళ్లి కొడుకుని తీసుకెళ్తామని మహివాళ్లు డ్యాన్స్‌లు వేస్తుంటే పసుపు మహి, మధుల మీద పడిపోతుంది. స్వప్న మనసులో మధు మనసులో మ్యాడీ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇద్దరిపై పసుపు పడేలా చేశాడని అనుకుంటుంది. ఇక హల్దీ వేడుక మొదలవుతుంది. మహిని గుర్తు చేసుకొని మధు చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















