Chinni Serial Today September 4th: చిన్ని సీరియల్: మధు పెళ్లిలో ఊహించని ట్విస్ట్! లోహిత చేసిన పనికి షాక్ అయిన మధు!
Chinni Serial Today Episode September 4th మధు ఇంటికి లోహిత వచ్చి సాయం పేరులో మధు చిన్నప్పటి ఫొటోలు అన్నీ మహి కంట పడకుండా చేయాలని దాచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుకి శివ గిఫ్ట్‌గా ఫోన్ ఇస్తాడు. చంటి అక్క చుట్టూ తిరుగుతూ మూడు రోజుల్లో మన ఇంట్లో పీపీ ఢుంఢుం మా అక్కకి పెళ్లి ఆయనే అని గెంతులేస్తాడు. చిన్ని ఏడుస్తుంటే తల్లి ఓదార్చుతుంది. గొప్పింటి సంబంధం ప్రతీ ఆడపిల్లా అత్తారింటికి వెళ్లాల్సిందే అని నీ కళ్లలో ఇక నుంచి సంతోషం మాత్రమే కనిపించాలని చెప్తారు.
బాలరాజు దగ్గరకు దేవా, నాగవల్లి వస్తారు. నా భార్యని చంపిన నిన్ను నా కూతుర్ని చంపాలి అనుకున్న నిన్ను చంపేస్తా అంటాడు. దానికి దేవా పెద్దగా అరుస్తూ దేవేంద్ర వర్మ హోం మినిస్టర్ నేను తలచుకుంటే ఇప్పుడే నిన్ను చంపేస్తా.. కానీ ఎందుకు బతికున్నావో తెలుసా అతి త్వరలోనే నిన్ను నీ కూతుర్ని బతికుండగానే చితి పేర్చి చంపేస్తా అంటాడు.
మధు మ్యాడీని తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. మహి ఫొటో చూస్తూ ఒక మనిషిని ఇష్ట పడి వేరొక మనిషిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఈ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఈ నరకం అనుభవించి బతకగలానా మ్యాడీ అని ఏడుస్తుంది. ఇంతలో లోహిత, మహి, స్వప్న, మరో అమ్మాయి అందరూ గ్రూప్ కాల్ చేస్తారు. రేపు మొత్తం గ్యాంగ్ అంతా అక్కడ దిగుతామని అందరూ చెప్తారు. మధు ఏడుస్తుంది. మహి బాధ పడుతూ నా చిన్నికి ఏవో ఫ్యామిలీలో సమస్యలు ఉన్నట్లు ఉన్నాయ్ లేదంటే చిన్నిని తీసుకొచ్చి మధు పెళ్లి దగ్గరుండి చేసేవాళ్లం అని అనుకుంటాడు.
ఉదయం మధు వాళ్ల ఇంటికి లోహిత మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి వస్తుంది. మధు, స్వరూప షాక్ అవుతారు. ఇంత పొద్దున్నే వచ్చేశారేంటమ్మా అని అడిగితే మధు పెళ్లి కదా పనులు అన్నీ చూసుకోవాలి కదా అని అంటుంది. ఇళ్లంతా చూసి ఇళ్లంతా ఇలా ఉంది.. మొత్తం సర్దేస్తాం అని అంటుంది. రూప లోహితతో భలే కలిసిపోతున్నావ్ అమ్మా అని అంటే నేను మధు ఒకే ఇంటి మనుషులం కదా అని అంటుంది. కవర్ చేయడానికి ఒకే కాలేజ్ కదా అని అంటుంది.
మధుని కూర్చొపెట్టి ఇళ్లంతా బూజు దులుపుతాం అని లోహిత తన ఇద్దరూ ఫ్రెండ్స్ చీపుర్లు పట్టుకుంటారు. మ్యాడీ వచ్చేలోపు ఇంట్లో ఉన్న చిన్ని ఫొటోలు అన్నీ తీసేయాలి అనుకుంటుంది. అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంది. చిన్ని లోహిత వాళ్లు చూడకుండా మ్యాడీ షర్ట్ దాచుకుంటుంది. లోహిత బూజు దులుపుతున్నట్లు చిన్ని చిన్నప్పటి ఫొటో కింద పడి పగిలేలా తోసేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లోహిత సారీ చెప్తుంది. అశుభం అనుకోవద్దు అని అంటుంది. ఫొటోలు అన్నీ తీసి దాచిపెడదాం అవి పోతే కష్టం అని అంటుంది. అందరూ సరే అంటారు. మధుకి కాస్త అనుమానం వస్తుంది కానీ ఏం అడగదు. లోహిత ఫొటోలు అన్నీ తీసి మహి కంట పడకుండా దాచేస్తుంది. మహి తన ఫ్రెండ్‌తో వస్తుంటాడు. చిన్నిని ఈ పాటికి కలిసి ఉంటే నేను చిన్ని దగ్గరకుండి మధు పెళ్లి చేసేవాళ్లం అని అనుకుంటాడు. మధు ఇంటి బయట ముగ్గులేసి కృష్ణుడి రాక కోసం అడుగులు వేసినట్లు ముగ్గులు వేస్తే ఆ అడుగుల్లో మహి అడుగులు వేస్తూ వస్తాడు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















