Chinni Serial Today September 15th: చిన్ని సీరియల్: లోహిత, వరుణ్‌ల ప్రేమ షురూ! మధు సంజుని కొట్టడానికి కారణమేంటి?
Chinni Serial Today Episode September 15th లోహిత వరుణ్‌కి ప్రపోజ్ చేయడం వరుణ్ ఒకే చెప్పడం, మధుని సంజు అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీతో క్లోస్‌గా ఉండటంతో శ్రేయ మధు చేయిని గోరుతో బ్లడ్ వచ్చేలా గిచ్చేస్తుంది. మ్యాడీ శ్రేయ మీద కొప్పడతాడు. అది నీతో మాట్లాడితేనే నాకు నచ్చదు అలాంటిది నిన్ను ముట్టుకుంది అని అంటే తప్పు శ్రేయ తను ఫ్రెండ్లీగా బొట్టు పెట్టింది అని మ్యాడీ మధుని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు.
మధు మ్యాడీని చూస్తూ ఉంటుంది. మ్యాడీ మధుకి కట్టు కట్టి నా వల్లే ఇదంతా కదా అని సారీ చెప్తాడు. మధు మ్యాడీతో మరదలు కదా అలాగే ఫీలవుతుంది. ఏం కాదులే అయినా నీకు మరదలు అయితే నాకు ఫ్రెండ్‌నే ఏం కాదులే అంటుంది. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా లక్ మధు. నువ్వు నిజంగా చాలా రేర్ పీస్.. నేను చాలా ఇంప్రెస్ అయ్యా అంటాడు. మ్యాడీ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి ఏంటి మధు అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. ఏం లేదని మధు చెప్తుంది.
స్వప్న మధుతో నీకు మ్యాడీకి పెళ్లి అయిపోయింది. ఇదితో చేతికి మూడు ముళ్లు వేసేశాడు అని అంటుంది. నువ్వు అలా మ్యాడీకి ప్రపోజ్ చేస్తే మ్యాడీ ఇలా ఒకే చెప్తే ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని స్వప్న అంటుంది. మరోవైపు లోహిత రిచ్ గల్‌లా రెడీ అయి వరుణ్‌కి కలవడానికి రెస్టారెంట్‌కి వెళ్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఎంతో మంది అబ్బాయిల్ని చూశా అందరూ కళ్ల వరకే ఉండిపోయారు. నువ్వు నా మనసుని తాకావ్.. నిన్ను చూస్తే నేను బ్లష్ అవుతా ఏంటా అని అడిగితే నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నా అని నా మనసు చెప్పిందని అంటుంది. వరుణ్ చేయి పట్టుకొని ఐలవ్‌యూ వరుణ్ అని అంటుంది.
వరుణ్ కూడా లోహితో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తాడు. ఇద్దరూ హగ్ చేసుకొని లవ్‌యూ చెప్పుకుంటారు. లోహిత ప్రపోజల్ చాలా బాగుంటుంది. ఇద్దరి ప్రపోజల్ చాలా బాగుంటుంది. ఇంతలో దేవా కాల్ చేస్తే వరుణ్ వెళ్లిపోతాడు. రాత్రి మాట్లాడుకుందామని అనుకుంటారు. మధ్య తరగతి లైఫ్‌కి ఇక చెక్ పడిపోయిందని లోహిత గెంతులేస్తుంది. సిటీలోనే నెంబర్ వన్ ఇంటికి కోడల్ని అయిపోతున్నా అని గెంతులేస్తుంది.
దేవా, నాగవల్లి మాట్లాడుకుంటూ ఉంటే దేవాకి సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్ కాల్ చేసి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతా అని చెప్తాడు. ఇంత సడెన్‌గా ఏంటా అని నాగవల్లి, దేవా అనుకుంటారు. ఇక మధు నెమలి పింఛం బొమ్మ వేసి మధు లవ్ మ్యాడీ అని రాస్తుంది. స్వప్న మధుతో నీ లవ్ మేటర్ చెప్పేయ్ అని అంటుంది. ఇంతలో సంజు అండ్ బ్యాచ్ స్వప్నని ఏడిపిస్తారు. మధు సంజుతో గొడవ పడుతుంది. సంజు స్వప్నని లాగాలని చూస్తే మధు సంజుని ఒక్కటి పీకుతుంది. సంజు కోపంతో రగిలిపోయి మధు వాళ్లు వెళ్తుంటే సంజు అందరి ముందు మధు చున్నీ లాగేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















