Chinni Serial Today September 12th: చిన్ని సీరియల్: మధు పెళ్లిలో ఊహించని ట్విస్ట్! శివ అసలు రంగు బయటపెట్టిన మ్యాడీ.. నాగవల్లికి షాక్!
Chinni Serial Today Episode September 12th మహి మధు పెళ్లి ఆపేశాడని నాగవల్లికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి వచ్చి శివ మంచోడు కాదని మధు పెళ్లి ఆపేస్తాడు. శివ తల్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకి బతకు ఉండదు.. అని మళ్లీ మధుకి తాళి కట్టించడానికి శివని తీసుకెళ్లి తాళి ఇస్తుంది. సరిగ్గా శివ తాళి కట్టే టైంకి మ్యాడీ ఒక్కటి తంతాడు.
శివ ఎగిరి పడతాడు. అతని తల్లి తాళి కట్టాల్సిన వాడి గుండెల మీద అలా తన్నడం ఏంటి అని సుబ్బుని ప్రశ్నిస్తుంది. ఆయనకు ప్రేమ కథ తెలుసు అందుకే ఊరుకున్నాడని.. ఇద్దరూ కాలేజ్‌లో ఒకే గదిలో ఒక రాత్రి ఉన్నప్పుడే అర్థమై ఉంటుంది. ఈ పెళ్లి ఆపాలి అనుకుంటున్నాడు అంటే ఆ అమ్మాయి చెడిపోయిందేమో.. వాడే చెడగొట్టాడేమో అని అంటాడు. దాంతో ఏం కూశావురా అని మ్యాడీ శివని చితక్కొడతాడు. మధు గురించి తప్పుడు కూతలు కూస్తే చంపేస్తా అని అంటాడు. మీరు అనుకున్నట్లు వీడు మంచోడు కాదు.. మధు జీవితం నాశనం చేయడానికే వచ్చాడు. వీడు వీడి ఫ్రెండ్స్ మధుని అమ్మేయాలని చూస్తున్నారు. ఆ విషయం వీళ్ల ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నాను అని మొత్తం చెప్తాడు.
ఫ్లాష్‌బ్యాక్‌లో మహి వెంటనే పోలీసులకు కాల్ చేసి హోంమినిస్టర్ దేవేంద్ర వర్మ కొడుకుని అని చెప్పి శివ ఫ్రెండ్స్ డిటైల్స్ ఇచ్చి వాళ్లని పట్టుకోమని అంటాడు. శివ షాక్ అయి కవర్ చేయడానికి నువ్వు హోంమినిస్టర్ కొడుకువి కాబట్టి అంతా నీకు అనుకూలంగా మార్చేయాలని అనుకుంటున్నావ్ నా ఫ్రెండ్స్‌ని కొట్టించి వాళ్లతో నేను ఏదో తప్పు చేశానని చెప్పించాలి అనుకుంటున్నావ్ అని రివర్స్ అయిపోతాడు.
మధు శివని ఒక్కటి పీకుతుంది. కట్టుకథలు చెప్పడం నీకు అలవాటు కానీ మా మ్యాడీకి కాదు.. నిజంగానే తను నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీలా ఇన్ని డ్రామాలు ఆడడు.. డైరెక్ట్ మా అమ్మానాన్నలతో మాట్లాడేవాడు. తనకి అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే ఓ ఫ్రెండ్‌గా మా ఇంటికి వచ్చి నా పెళ్లి పనులు నెత్తిన వేసుకున్నాడు. ఇంకోసారి నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. జైలులో చిప్పకూడు తిందువుగానీ రా రా అని శివని తీసుకెళ్లిపోతాడు.
మధు తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. సమయానికి మ్యాడీ బాబు రాకపోయిఉంటే నీ జీవితం నాశనం అయ్యేది అని అంటుంది. నాగవల్లికి తన పీఏ కాల్ చేసి పెళ్లి ఆగిపోయిందని మన మ్యాడీ బాబే పెళ్లి ఆపేశాడని.. పెళ్లి తర్వాత వాడు అమ్మాయిని అమ్మేయాలి అనుకున్నాడని చెప్తాడు. అలాంటి వాడిని సెలక్ట్ చేశావేంటి అని నాగవల్లి తిడుతుంది. నాగవల్లి టెన్షన్‌గా ఉంటే శ్రేయ వచ్చి ఏమైంది అని అడిగితే నీకు అవసరం లేదు వెళ్లు అని నాగవల్లి పంపేస్తుంది. మధుని వదిలి పెట్టను అని అనుకుంటుంది.
మధు ఫ్యామిలీ మొత్తం బాధ పడుతుంటే మ్యాడీ సుబ్బుతో ఇలా పెళ్లి ఆగిపోయిందని బాధ పడొద్దు అంకుల్.. నలుగురికి ఎందుకు ఈ పెళ్లి ఆగిపోయిందో తెలిసింది కదా అని అంటాడు. సుబ్బు, స్వరూపలు ఏడుస్తూ పెళ్లి ఆగిపోయినందుకు కాదు బాబు ఈ పెళ్లి అయింటే మా కూతురి జీవితం ఏమైయ్యేది అని ఏడుస్తారు. మధు ఏడుస్తూ నా జీవితం కాపాడటం కోసమే నిన్ను నన్ను ఆ దేవుడు కాపాడినట్లున్నాడు. ఆ రోజు రౌడీల నుంచి కాపాడావు.కాలేజ్‌లో నా పరువు కాపాడావు. ఇప్పుడు నా జీవితం కాపాడావు అని చేతులు జోడించి దండం పెడుతుంది.
మ్యాడీ మధు తండ్రితో మధుకి ఇప్పట్లో పెళ్లి చేయకండి.. తను ఎంటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకుంటుంది. తర్వాత తనకు నచ్చిన అన్ని రకాలుగా సరిపోయే వాడిని తీసుకురావొచ్చు అని చెప్తాడు. మ్యాడీ తన ఫ్రెండ్స్‌ని తీసుకొని వెళ్లిపోతాడు. స్వప్న మధుతో ఆ దేవుడు నీకు మ్యాడీకి రాసిపెట్టాడు అందుకే ఈ పెళ్లి జరగలేదు అని అంటాడు. మ్యాడీ వాళ్లు వాలీ బాల్ అడుతూ కాలేజ్‌లో మధు పెళ్లి గురించి మాట్లాడుతారు. మధు మంచిదాయి తనకు మంచే జరగాలి అని మ్యాడీ అంటాడు. ఇంతలో ఓ గ్యాంగ్ చాలా రోజుల తర్వాత కాలేజ్‌కి వస్తారు. ఆ గ్యాంగ్‌కి సంజు లీడర్. మ్యాడీతో ఏంటి బ్రో కాలేజ్‌లో అందరికీ నువ్వే క్రష్ అంట అని అంటాడు. నీ వెనక ఎంత మంది పడినా ఎవరో తెలీనమ్మాయి కోసం వెతుకుతున్నావంట అని అంటాడు. మీరు ఫారెన్ నుంచి వచ్చి అమ్మాయి దొరకగానే ఏదేదో చేసి ఎంజాయ్ చేసి మళ్లీ పారిపోతారని నువ్వు నీ డ్రీమ్ గల్తో ఎంజాయ్ చేసి వెళ్లిపోయిన తర్వాత మాకు ఇచ్చేయ్ మేం ఎంజాయ్ చేస్తాం అని చిన్ని గురించి తప్పుగా మాట్లాడుతాడు. మ్యాడీ కొడతాడు. సంజూ, మ్యాడీ ఇద్దరూ గొడవ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















