Illu Illalu Pillalu Serial Today September 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సీక్రెట్ 'ప్రేమాయణం' ధీరజ్ కంట పడినట్లేనా? ధీరజ్ చేతికి చిక్కిన కవర్, వల్లి ప్లాన్ సక్సెస్ అయిందా?
Illu Illalu Pillalu Serial Today Episode September 12th వల్లి ప్రేమకు వచ్చిన బొకే ధీరజ్‌కి చూపించి ధీరజ్ కవర్ కోసం వెతికేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode పేపర్‌లో వచ్చిన ప్రేమ ఫొటో గురించి రామరాజుకి వల్లి తగిలిస్తుంది. రామరాజు ఆ ఫొటో గురించి ప్రేమకి అడుగుతాడు. మామయ్య గారు అడుగుతున్నా చెప్పడం లేదు దేవుడి లాంటి మామయ్యని అలా మోసం చేయడం తప్పు అని అంటుంది.
రామరాజు అందరికి సైలెంట్‌గా ఉండమని ప్రేమకి అడుగుతాడు. ప్రేమ అతను దొంగ అని చెప్తుంది. దొంగనా అని అందరూ నోరెళ్ల బెడతారు. దొంగని నువ్వు ఎందుకు తరుముతున్నావు అని వల్లి అడిగితే నా బ్యాగ్ తీసుకొని పారిపోతే వెంట పడి నాలుగు తగిలించి నా బ్యాగ్ తెచ్చుకున్నా అని ప్రేమ చెప్తుంది. దానికి నర్మద వల్లీ అక్క వదిలేస్తే దొంగలు తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు దొరికిపోతారు అంటుంది. అప్పటికి పుల్లల వల్లి ఊరుకోకుండా ఈ విషయం ముందే మామయ్య గారికి చెప్పాలని నీకు తెలీదా.. మామయ్య గారి పరువు తీసినట్లే కదా అంటే నీకు తెలిసినంత నాకు తెలీదు అక్క ఇప్పుడు చెప్పావ్ కదా ఇక ముందు చెప్తాలే అని అని అంటుంది.
వేదవతి వల్లీతో ప్రతీది మీ మామయ్య గారికి చెప్పి గొడవ చేయడం ఎందుకు ప్రేమకి ఆ పేపర్ చూపించి అడిగితే సరిపోయేది కదా.. ప్రతీ దానికి రాద్ధాంతం చేస్తావ్ అంటుంది. వల్లీ మంట ఇంకా చల్లారకపోవడంతో ప్రేమ ఏదో దాస్తుందని దాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు కల్యాణ్ సిగరెట్ తాగుతూ ప్రేమ కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తే నా ఒడిలో ఉంటుందని అనుకుంటే ఇలా ఎదురు తిరుగుతుందా.. ఇలా కాదు దానికి ఇంకోలా ఇస్తా నా పక్కలో పడుకునేలా చేస్తా అని అనుకుంటాడు.
ధీరజ్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ఏదో పెద్ద సమస్యలో ఉంది.. ఆ సమస్య నుంచి ప్రేమని బయటకు తీయాలి.. కానీ ఆ సమస్య ఏంటో తెలుసుకునేది ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వల్లీ ధీరజ్‌ను చూసి బొకే బాగోతం బయట పెట్టి నిన్ను ఇరికించేస్తా అని బొకే తీసుకొని ధీరజ్ దగ్గరకు వస్తుంది. మొన్న ఎప్పుడో ప్రేమకి వచ్చింది అని ధీరజ్‌కి చెప్తుంది. ఎవరు పంపారు వదినా ప్రేమకి బొకే వచ్చిందా ఎవరు పంపారు అని ధీరజ్ షాకింగ్‌గా అడుగుతాడు. వల్లి ఎవరు ఇచ్చారో తెలీదు కానీ దాని మీద వన్ వీక్ అని రాసి ఉందని చెప్తుంది. ధీరజ్ తీసుకొని ఆశ్చర్యంగా చూస్తాడు.
వల్లి ధీరజ్‌తో మీ పెళ్లి రోజు లేదు పుట్టినరోజు కాదు కానీ బొకే వచ్చింది.. ఈ బొకే చూసి కూడా ప్రేమ చాలా టెన్షన్ పడింది ఎందుకో ఏమో అని అంటుంది. ధీరజ్ అంతా ఆలోచించి ఆ కవర్ వచ్చిన తర్వాత ప్రేమలో భయం మొదలైంది.. అప్పటి నుంచి ఏడ్వడం, రోడ్ల మీద పరుగెత్తడం చేస్తుంది. ఆ కవర్ మీద పేరు లేదు ఎవరో ప్రేమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అర్థమైంది.. ఆ కవర్ ఏంటో తెలిస్తే ఈ చిక్కు ముడులు అన్నీ వీడుతాయ్ అని గది మొత్తం వెతుకుతాడు. ఓ చోట కవర్ దొరుకుతుంది.
వల్లి మొత్తం చూస్తూ పేమ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ వచ్చి ధీరజ్ చేతిలో కవర్ చూసి చాలా టెన్షన్ పడుతుంది. ధీరజ్ చూసిన ఆ కవర్‌లో ఫొటోలు ఉండవు. కాలేజ్‌కి సంబంధించిన కవరు ఉంటుంది. ప్రేమ ధీరజ్‌తో నేను చెప్పేది నమ్మకుండా మరోసారి ఇలా లేనప్పుడు నా వస్తువులు చూడకు అని అంటుంది. ధీరజ్ ప్రేమతో మాటలతో మనుషుల్ని మాయ చేయొచ్చు మనసుని కాదు అని అంటాడు. ప్రేమ చాలా బాధ పడుతుంది. వేరే చోట దాచిన కవర్ చూసి ఏడుస్తుంది. ఎవరికీ చెప్పుకోలేను నాలో నను నరకం అనుభవిస్తున్నానని ఏడుస్తుంది.
చందు రెడీ అవుతుంటే వల్లీ చూసి ఏంటి బా త్వరగా వెళ్లిపోతున్నావ్ అని అంటుంది. ప్రేమగా దగ్గరకు తీసుకొని నీకు మధ్యాహ్నానికి ఏం పెట్టాలి అంటే నాకు క్యారేజ్ ఏం వద్దు ఇక నుంచి నువ్వు నాకు ఏం తీసుకురావొద్దు అని చెప్తాడు. వల్లీ మీద చిరాకు పడతాడు. నీ విషయాలు నువ్వు చూసుకో నా విషయాలు నీకు అవసరం లేదు అని అంటాడు. నువ్వు ఇలా మాట్లాడటం నాతో అంటీ ముట్టనట్లు ఎందుకు ఉంటావు బా అని వల్లీ అంటే నాకు నీతో ఇష్టం లేదు నాకు దూరంగా ఉండు అని చందు అంటాడు. ప్రేమ పట్టుకుంటే నెట్టేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















