అన్వేషించండి
Chinni Serial Today September 13th: చిన్ని సీరియల్: కొత్త చిన్ని ఇరగదీసిందిరోయ్.. అబ్బా మధు, మ్యాడీ ఎంత క్యూట్‌గా ఉన్నారో!
Chinni Serial Today Episode September 13th మధు అమ్మవారి ఎదుట మూడు కోరికలు కోరుకొని గాజులు విసరడం అవన్నీ త్రిశూలంలో పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్
Source : https://www.hotstar.com/
Chinni Serial Today Episode ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే చిన్ని సీరియల్ ఫ్యాన్స్‌కి షాక్ తగిలిందని చెప్పాలి.. ఇప్పటి వరకు ఉన్న మన మధుమితని మార్చేశారు.. పాత మధుమిత స్థానంలో కొత్త మధుని తీసుకొచ్చారు. ఆ మధు పల్లెటూరి మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంటే కొత్తగా మార్చిన మధు ఎంట్రీనే కాస్త రిచ్‌గానే ఉంటుంది. చేతికి మట్టి గాజులు పోయి వాచ్, బ్రేస్‌లెట్ వస్తాయి. లంగాఓణి పోయి చున్నీ డ్రస్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో కొత్త మధు ఎలా యాక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలేజ్‌లో సంజు మ్యాడీతో చిన్ని గురించి తప్పుగా మాట్లాడుతాడు. మ్యాడీ వాడికి కొడతాడు. మ్యాడీని ఫ్రెండ్స్ అందరూ పక్కకి తీసుకొచ్చి.. వారంలో ప్రేమించిన వాళ్లని మర్చిపోయే వారు ఉన్నఈ రోజుల్లో ఇన్నేళ్లుగా ఒకమ్మాయిని ప్రేమిస్తున్నావ్ అంటే నువ్వు గ్రేట్‌రా అని అంటారు. తనని ఎలా మర్చిపోగలనురా.. తను నా ప్రాణంరా నా శ్వాసలో గుండెలో తనే నిండిపోయిందిరా.. తను లేకపోతే నేను లేనురా అని ఎమోషనల్ అయిపోతాడు. కొత్త మధు ఎంట్రీ అమ్మవారి ముందు దీపం పెడుతూ ఇస్తుంది.
స్వప్న, మధు ఇద్దరూ అమ్మవారిని దండం పెట్టుకుంటారు. మధు అమ్మవారితో అమ్మా నీ ముందు నేను ఇలా ఉన్నాను అంటే దానికి మ్యాడీనే కారణం అని అంటుంది. స్వప్న మధుతో నీ ప్రేమ గురించి కూడా అమ్మవారికి చెప్పు మధు.. హల్దీలో నీ మీద మధు మీద పసుపు పడినప్పుడే నిన్ను మ్యాడీ అమ్మవారి దీవించింది.. మ్యాడీకి నీ లవ్ గురించి చెప్పు కచ్చతంగా ఒప్పుకుంటాడు. నీ క్యారెక్టర్ అంటే మ్యాడీకి చాలా ఇష్టం నువ్వు చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు. మధు మ్యాడీ ఒప్పుకుంటాడో లేదో అమ్మవారినే అడుగుతా అని మూడు గాజులు తీసుకుంటుంది.
మొదటి గాజు పట్టుకొని తన తండ్రి తనకు కనిపించాలని మొక్కుకొని వేస్తుంది. మొదటి గాజు పడుతుంది. రెండో గాజు తీసుకొని మహి, చందు, లోహిత, తన అత్తలను కలవాలని కోరుకుంటుంది. మూడో గాజు మ్యాడీ తన లవ్ ఒప్పుకోవాలని వేస్తుంది. మూడు గాజులు పడటంతో మధు ఎగిరి గంతేస్తూ అమ్మవారు నా మూడు కోరికలు తీర్చేస్తుంది. మా నాన్న నా దగ్గరకు వచ్చేస్తారు. చందు, మహి, అత్తయ్య కలుస్తారు. మహి నా లవ్ ఒకే చెప్తాడు అని స్వప్నని గిరగిరా తిప్పేస్తుంది. సంతోషంతో అమ్మవారి కుంకుమ కొంగున కట్టుకొని వాళ్లని తీసుకొని మళ్లీ వస్తాను అమ్మా నా మ్యడీని తీసుకొని నీ దగ్గరకు మళ్లీ మళ్లీ వస్తా అని కాలేజ్‌కి బయల్దేరుతుంది.
లోహితకు వరుణ్ కాల్ చేసి నాతో ఏదో చెప్పాలి అన్నావ్ అంటే కలిస్తే చెప్తా అని లోహిత అనడంతో ఈవినింగ్ కలుద్దాం అని అనుకుంటారు. ఇక శ్రేయ లోహిత దగ్గరకు వచ్చి మధు పెళ్లి ఆగిపోయినందుకు డిసప్పాయింట్ అయిపోతుంది. ఆ దరిద్రానికి అదృష్టం పట్టుకుంది అని అంటుంది లోహిత. ఇంతలో మధు, స్వప్న కాలేజ్‌కి వస్తారు. లోహిత శ్రేయతో అది స్కూటీ దిగగానే దిక్కులన్నీ చూస్తుంది చూడు అని అంటుంది. మధు మొత్తం చూస్తుంది. లోహిత శ్రేయతో అది మ్యాడీ కోసమే వెతుకుతుంది అని అంటుంది. నిజంగానే మధు మ్యాడీ కోసం వెతుకుతుంది. మ్యాడీని మధు చూస్తుంది. లోహిత శ్రేయతో మ్యాడీని కొరుక్కుతినేలా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుందని అంటుంది. మధు అలాగే వెళ్తుంది.
శ్రేయ జరిగింది అంతా చూసి దాన్ని చూస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి అని అనిపిస్తుందని అంటుంది. చూడు శ్రేయ భయంకరమైన లవ్ స్టోరీ చూపిస్తుంది చూడు అంటుంది. మధు మ్యాడీ దగ్గరకు వెళ్లగానే డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని మహి అంటే నువ్వు బాగున్నావ్ అని మహి అంటాడు. మధుని చూసి నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండు ప్రాబ్లమ్స్ అన్నీ పారిపోతాయ్ అని మహి అంటే నిజమా పక్కానా ప్రామిస్ వేయమని మధు అంటుంది. మహి ప్రామిస్ వేస్తాడు. మధు మహికి కుంకుమ పెట్టి ఊదుతుంది. శ్రేయ కోపంగా వచ్చి మధు చేయి పట్టుకొని గోరుతో గిచ్చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి





















