Chinni Serial Today September 11th: చిన్ని సీరియల్: మధు మెడలో తాళి కట్టేసిన మ్యాడీ! నిజం తెలుసుకున్న మహి ఏం చేశాడు? పెళ్లిలో హైడ్రామా!
Chinni Serial Today September 11th Episode మధు తల్లిదండ్రులు మధుని పెళ్లి చేసుకోమని మహికి చెప్పి ఒప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode: మధు మ్యాడీని ప్రేమిస్తుందని స్వప్న అందరితో చెప్పేస్తుంది. మధుని పెళ్లి కొడుకు తల్లి, పెళ్లి కొడుకు తిడతారు. మధుకి క్యారెక్టర్ లేదని శివ అనడంతో మహి గొడవకు దిగుతాడు. మధు గురించి నీకేం తెలుసురా అని మ్యాడీ అంటే నీకు తెలుసు కదా నువ్వే చేసుకో అని చెప్పి వెళ్లి పోతారు.
స్వరూప, సుబ్బారావు ఏడుస్తూ మహి కాళ్ల మీద పడి నీ కాళ్లు కడితే అర్హత మాకు లేదు కానీ నువ్వు మా మధుని పెళ్లి చేసుకోవాలి బాబు.. మధుని పెళ్లి చేసుకొని మాకు ప్రాణ భిక్ష పెట్టు బాబు అని వేడుకుంటారు. దాంతో మహి మధుని పెళ్లి చేసుకుంటాడు. లోహిత షాక్ అయిపోతుంది. తీరా చూస్తే ఇదంతా లోహిత కల.. స్వప్నని వదిలేస్తే అన్నంత పని చేస్తుందని స్వప్నని రాకుండా చూడాలని అనుకుంటుంది. శివ, మధులు పెళ్లి మండపంలో కూర్చొంటారు.
లోహిత తన ఫ్రెండ్స్‌తో కలిసి స్వప్నని స్టోర్ రూంకి పంపి.. దూపం వేసి స్వప్న కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుంది. నాగవల్లి మ్యాడీ కాల్ చేస్తుంది. ఇంకా పెళ్లి అవ్వడానికి 2 గంటలు పడుతుంది. సెండాఫ్ ఇచ్చి వచ్చేస్తామని మహి అంటాడు. వల్లి ఆఫీసర్‌కి కాల్ చేసి మహికి కాల్ ఇచ్చిన నెంబరు డిటైల్స్ తెలిశాయా అని అడిగి కాలేజ్‌లో ఉన్న 2 వేల మంది అమ్మాయిల డిటైల్స్ కావాలని చెప్తుంది. మధు మనసులో చాలా సేపటి నుంచి స్వప్న కనిపించడం లేదు ఏంటి అని అనుకుంటుంది. పంతులు మంగళ సూత్రం అడిగితే తీసుకురమ్మని అంటే సుబ్బారావు మ్యాడీ బాబు తెస్తాను అన్నాడు అని అంటాడు.
మహిని అడిగితే రాహుల్ తెస్తా అన్నాడు. నేను తెచ్చేస్తా అని మహి వెళ్తాడు. మహి మంగళ సూత్రం తీసుకొని బయల్దేరుతాడు. పంతులు హడావుడి చేసేస్తుంటారు. పంతులు ఇంటి వారితో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అంత వరకు పసుపు కొమ్ము కట్టించేద్దాం తీసుకురండి అని పంతులు చెప్తాడు. మహి వస్తుంటే బైక్ రిపేర్ వస్తుంది. మహి ఆగి ఇంతలో మహి శివ ఫ్రెండ్ కార్ అక్కడ చూసి వాళ్లని అడిగి వెళ్లిపోవచ్చని వెళ్తాడు. తీరా అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మందు తాగుతూ ఉంటారు. వీళ్లు పార్టీ చేసుకుంటున్నారు కదా వెళ్లి కారు అడుగుదాం అనుకుంటాడు. తీరా వెళ్లే సరికి మధుని సెకండ్ పార్టీకి అప్పగించేస్తామని అనుకోవడం వినేస్తాడు. మహి వాళ్లని ప్రశ్నిస్తాడు.
మధుని ఏం చేయబోతున్నారురా అని అడిగి వాళ్లని చితక్కొడతాడు. మధుని ఫారెన్ కంట్రీకి పంపేస్తున్నాం అని వాళ్లు మహితో చెప్తారు. మహి కోపంతో వాళ్లని కొడతాడు. మహిని కొట్టి మహి కళ్లు తిరిగి పడిపోవడంతో వెళ్లిపోతారు. తర్వాత మహి మధు మధు మధుకి ఏమై ఉంటుంది. ఇప్పుడేం చేయాలి.. మధుని కాపాడాలి అని పరుగులు తీస్తాడు. మధు మెడలో శివ పసుపు కొమ్ము కట్టే టైంకి మహి ఆపమని అరుస్తాడు. తాళి కట్టే అర్హత నీకు లేదు అని మ్యాడీ అరుస్తాడు. శివ తల్లి ప్రశ్నించడంతో నా కొడుకుకి తాళి కట్టే అర్హత లేదా.. నిజానికి ఆమెకే నా కోడలు అయ్యే అర్హత లేదని అంటుంది. మీరు మధుని కోడల్ని చేసుకోవాలి అనుకోలేదు.. తనతో వ్యాపారం చేయాలి అనుకున్నావ్.. సెకండీ పార్టీ వ్యాపారం గురించి నీకు తెలీదా అని అంటాడు. శివ వాళ్లు షాక్ అయి రివర్స్ అయిపోతారు. తప్పు మహి మీద తోసేస్తారు. మహినే పెళ్లి ఆపాలని చూస్తున్నాడని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















