అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 10th: మ్యాడీని పోలీసులు అరెస్ట్‌ చేయడానికి కారణమేంటి..? సింధూజాక్షికి వాళ్ల ఫ్రెండ్స్‌ ఎలా బుద్ధి చెప్పారు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 10th: మ్యాడీని పోలీసులు అరెస్ట్‌ చేయడానికి కారణమేంటి..? సింధూజాక్షికి వాళ్ల ఫ్రెండ్స్‌ ఎలా బుద్ధి చెప్పారు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూ రూమ్‌లో గోపీని చూసిన సింధూ ప్రెండ్స్‌...ఇతను ఇక్కడ ఎందుకు ఉన్నాడని నిలదీస్తారు. ఉదయం నుంచి చూస్తున్నాం...అసలు ఇతన్ని నువ్వు వదిలిపెట్టడం లేదు... అతను నిన్ను వదిలిపెట్టడం లేదని అంటారు.ఈ వ్యవహారం ఇప్పుడే తేలుస్తామంటూ గోపీవాళ్ల అమ్మను పిలుస్తారు. ఆమె నిద్ర కళ్లమీద వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది.ఎంత ధైర్యంఉంటే మీ ఇంటి పనివాడు...మా సింధూ రూమ్‌లోకి వచ్చి పడుకుంటాడని అడుగుతారు. 

ఆమెకు ఏం అర్థంగాక...ఇక్కడ పనివాళ్లు ఎవరు ఉన్నారని అడుగుతుంది. మీ ఎదురుగా ఉన్నది పనివాడే కదా అని అనడంతో...సింధూ కలుగజేసుకుని అతను పనివాడు కాదని,నా భర్త అని చెబుతుంది. దీంతో గోపీ వాళ్ల అమ్మ ఉదయమే నేను చెప్పాను కదమ్మా... వాడు నా కొడుకని మళ్లీ మీరు ఎందుకు భ్రమపడ్డారని అంటుంది. బంగారం లాంటి నిద్ర పాడుచేశారంటూ వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత వాళ్లంతా కలిసి సింధూను గట్టిగా తిడతారు. ఇలాంటి భర్త దొరికాలంటే అదృష్టం ఉండాలని అంటారు. 

నీ భర్త వ్యవసాయం చేస్తున్నాడని చెబితే నామోషీ అని అబద్ధాలు చెప్పావా అని నిలదీస్తారు. గోపీ నీ మొగుడని మాకు ముందే తెలుసని...నీకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశామని అంటారు. భర్త కళ్లముందు ఉన్నా పనివాడిగా ట్రీట్‌ చేసినా అతను నోరుమొదపడం లేదంటే నిన్ను ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని అర్థమవుతోందని అంటారు. చేతులారా నీ కాపురాన్ని నాశనం చేసుకోవద్దని గట్టిగా బుద్ధి చెప్పి వెళ్లిపోతారు.

బుల్లిరాజు పథకం ప్రకారం మ్యాడీ బైక్‌లో గాలి తీయడంతో కాలేజీకి వెళ్లేందుకు కారు తీస్తాడు. నువ్వే గాలి తీశావా అని శ్రీలక్ష్మీని అడగ్గా...నీ బైక్‌ ఎక్కే ఛాన్స్ నాకు కాలేజీకి వెళ్లేప్పుడే వస్తుందని...అలాంటి ఛాన్స్‌ నేనెందుకు మిస్‌ చేసుకుంటానని అంటుంది. రోజూలాగే బస్టాండ్‌లో దిగిపొమ్మని చెబుతాడు. బైక్‌లో వెళితే అందరూ చూస్తారని అంటున్నావ్‌...కారులో కదా  కాలేజీలో దింపమని అడుగుతుంది శ్రీలక్ష్మీ. అదేమీ కుదరదని...రోజూలాగే ఆటోలో రమ్మని చెప్పి దింపేస్తాడు. మ్యాడీ కారులో వెళ్తుండగా...ఆ కారుకు బుల్లిరాజు అడ్డుపడి యాక్సిడెంట్ చేసినట్లు నాటకం ఆడతాడు. ఇదంతా వీడియో తీయిస్తాడు. 

ప్రమాదం జరిగిందని భయపడిపోయిన మ్యాడీ వెంటనే ఇంటికి వెళ్లిపోతాడు. బుల్లిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాడీ వాళ్ల ఇంటికి వచ్చిన పోలీసులు...కారు నెంబర్‌ చూసి ఆ కారు ఎవరు వాడారని మ్యాడీ వాళ్ల నాన్నను అడుగుతారు. మా అబ్బాయి కాలేజీకి తీసుకెళ్లాడని చెప్పగా..ఆ కారుతో  ఒకరిని గుద్దాడని అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు. అందుకు ఆధారాలు కూడా చూపడంతో మ్యాడీ పోలీసులతో పాటు స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీలక్ష్మీ ఇదంతా చూసి బాధపడుతుంది. 

పోలీసులకు అడ్డుగా వెళ్లి ఆ కారు నడిపింది తానేనని...మ్యాడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. కావాలంటే తనను అరెస్ట్ చేయాలని, మ్యాడీని వదిలిపెట్టాలని వేడుకుంటుంది. దీంతో ప్రియంవద సంతోషిస్తుంది. కానీ అప్పుడే శ్రీలక్ష్మీ చిన్నత్త సుకన్య కలుగజేసుకుని అసలు నీకు కారు నడపడమే రాదు కదా...నువ్వు ఎలా యాక్సిడెంట్ చేస్తావని అడుగుతుంది. ఆ మాటలకు ఎస్‌ఐ కూడా నివ్వెరపోతాడు. ప్రియంవదకు మాత్రం సుకన్య మాటలు విని కోపం వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget