అన్వేషించండి
Jagadhatri Serial Today March 10th:శ్రీవల్లి తల్లి ఫొటో మార్గమధ్యలోనే మార్చేసిన యువరాజు...ఫొటోలోఉన్నది తన తల్లి కాదని చెప్పి ఏడ్చిన శ్రీవల్లి
Jagadhatri Serial Today Episode March 10th:శ్రీవల్లి తల్లి ఫొటో మార్గమధ్యలోనే మార్చేసిన యువరాజు...ఫొటోలోఉన్నది తన తల్లి కాదని చెప్పి ఏడ్చిన శ్రీవల్లి

జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి తల్లి ఫొటో మార్గమధ్యలోనే మార్చేసిన యువరాజు...ఫొటోలోఉన్నది తన తల్లి కాదని చెప్పి ఏడ్చిన శ్రీవల్లి
Source : Social Media
Jagadhatri Serial Today Episode : అనాథ ఆశ్రమం నుంచి వచ్చిన హరిబాబు అసిస్టెంట్...శ్రీవల్లి తల్లి ఫొటో తీసుకొచ్చాడని అది చూసి సుధాకర్ ఆగ్రహంతో తనను కాల్చి చంపేశాడని వైజయంతి కలగంటుంది. భయంతో వణికిపోతున్న వైజయంతిని నిషిక పట్టుకుని మీరే ముందు అందరికీ దొరికిపోయేలా ఉన్నారని మండిపడుతుంది. ఇప్పుడు ఆ ఫొటో చూసిన తర్వాత కూడా జరిగేది అదే కదా అని అంటుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే...జగధాత్రి ఫొటో తీసి చూస్తుంది. అందులో సుజాత ఫొటో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతుంది.ఇది ఎలా వచ్చిందని అనుకుంటుండగా...అప్పుడే యువరాజు అక్కడికి వస్తాడు. తనవల్లే ఫొటోమారిందని వైజయంతి ఆనందపడుతుంది.
దారిలో వస్తుండగా యువరాజు మరోసారి కారుతో అడ్డగించి అనాథ ఆశ్రమం నుంచి వచ్చే వాడిని బెదిరిస్తాడు.మర్యాదగా నేను చెప్పినట్లు చేయకపోతే....కాల్చి చంపేస్తానని అనడంతో కవర్‌లో ఉన్న సుభాషిణి ఫొటో మార్చేసి సుజాత ఫొటో పెడతాడు. ఆ ఫొటో చూసిన ధాత్రి...ఇది శ్రీవల్లి అమ్మగారిది కాదని అంటుంది. ఒకసారి చూసి చెప్పమని హరిబాబుకు ఆ ఫొటో ఇస్తుంది. అది చూసిన హరిబాబు...ఇది నేను చూసిన ఫొటో కాదని అంటాడు.
ఇంతలో అతని అసిస్టెంట్ దగ్గరకు వచ్చి మార్గమధ్యలో జరిగిందంతా చెబుతాడు. ఇప్పుడు మీరు నిజం చెబితే ఇద్దరినీ కాల్చి చంపేస్తాడని అనడంతో హరిబాబు అదిరిపడతాడు. వెంటనే మాటమార్చి ఇది శ్రీవల్లి వాళ్ల అమ్మ ఫొటోనే అంటాడు.కళ్లజోడు లేకపోవడం వల్ల పోల్చుకోలేకపోయానని చెబుతాడు. వెంటనే అక్కడి నుంచి వాళ్లిద్దరూ వెళ్లిపోతారు. దీంతో సుధాకర్,కౌషికి కూడా తమ పనులకు వెళ్లిపోతారు.
యువరాజు తన గదిలోకి వెళ్లగా....వైజయంతి అక్కడికి వచ్చి కొడుకుకు కృతజ్ఞతలు చెబుతుంది. ఇవాళ నువ్వు కాపాడకపోయి ఉంటే మీ నాన్న చేతిల్లో నేను చచ్చిపోయేదాన్నని చెబుతుంది. అంటే ఆ శ్రీవల్లి నాన్న కూతురేకదా అని అంటాడు. ఇప్పుడే ఆ కేదార్,శ్రీవల్లి ఇద్దరినీ చంపేస్తానంటూ బయలుదేరతాడు. వెంటనే నిషిక,వైజయంతి అతన్ని ఆపుతారు.ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్లిద్దరినీ చంపేస్తే...మీఅక్క ఆస్తిమొత్తం నీ చేతుల్లో పెడుతుందని అనుకుంటున్నావా....నిన్ను జైలుకు పంపిస్తుందని తల్లి మండిపడుతుంది.
ఇలాచేసే లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటున్నావని అంటుంది. ఆ శ్రీవల్లిని బయటకు పంపించడానికే కదా అత్తయ్య చేయని తప్పును తనపై వేసుకుని అవమానాలు పడుతోందని నిషిక కూడా చెబుతుంది. మనం ప్లాన్ చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని అనుకుంటారు. అటు తనతల్లిది కాని ఫొటోచూపించడంతో శ్రీవల్లి బాధపడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదని ఏడుస్తుంది. దీంతో కేదార్, జగధాత్రి ఆమె వద్దకు వచ్చి నీ తల్లిదండ్రులు ఎవరో వెతికి నీకు చెప్పే బాధ్యత తనదని ధాత్రి ఆమెకు హామీ ఇస్తుంది.
గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు జేడీ,కేడీ ఇద్దరూ కలిసి యామిని వాళ్ల కోచింగ్ సెంటర్‌కు వెళతారు.అక్కడ యామినిని పిలిచి ఎవరిపైన అయిన అనుమానం ఉందా అని అడుగుతారు. భరత్ ఓసారి మత్తుమందులు తెచ్చి పార్టీకి వెళదామని పిలిస్తే...నేను అతన్ని కొట్టానని యామిని చెబుతుంది. ఆ తర్వాతే నా ఫొటోలు మార్ఫింగ్ జరిగాయని చెప్పడంతో ....యామిని వాళ్లను అక్కడి నుంచి పంపించేసి జేడీ, కేడీ భరత్‌ను ప్రశ్నించేందుకు వెళ్తారు.
పోలీసులను చూసిన వెంటనే భరత్ పారిపోయేందుకు ప్రయత్నించగా....జేడీ వెంటపడతాడు. భరత్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి అక్కడికి రప్పిస్తాడు. దీంతో జేడీ వాళ్లను ఇరగదీసి....ఇప్పుటి వరకు వీడు నేరస్తుడు అవునో కాదో డౌట్ ఉండేదని...ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నిర్థారణ అయ్యిందని అంటాడు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















