Chinni Serial Today October 8th: చిన్ని సీరియల్: మ్యాడీ, మధు జీవితాల్లో పెను మార్పులు! రౌడీల దాడి, ఎమోషనల్ సీన్స్!
Chinni Serial Today Episode October 8th మధు ఇంటికి రౌడీలు వచ్చి అల్లరి చేయడం మ్యాడీ కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ, వరుణ్, లోహితలను దేవేంద్ర వర్మ ఇంటి నుంచి గెంటేస్తాడు. సుబ్బు కొడుకు చంటి తలకి మసాజ్ చేస్తుంటాడు. తల్లీకొడుకులు తండ్రిని ఆట పట్టిస్తూ ఉంటారు. మధు ఇంకా రాలేదు ఏంటా అని అనుకుంటారు. ఇంతలో నాగవల్లి రౌడీలు మధు వాళ్టింటికి వచ్చి గొడవ చేస్తారు.
సుబ్బు, స్వరూప వాళ్లు షాక్ అయి ఏంటి ఇదంతా అని అడిగితే మీ కూతురు పెళ్లిళ్లు చేస్తుంది సాక్షి సంతకాలు పెడుతుంది. మేం కూడా ఇప్పుడు సంతకాలు పెట్టడానికి వచ్చాం అని సుబ్బుని కొడతారు. ఇంతలో మధు వస్తుంది. ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతుంది. రౌడీలు మధుతో కాలేజ్‌కి వెళ్లేదానివి చదువుకోవాలి అంతే కానీ ఇలా పెళ్లిళ్లు చేస్తా ఫంక్షన్లు చేస్తా అంటే ఊరుకోం.. పది నిమిషాల్లో వెళ్లకపోతే అందర్ని చంపేస్తా అని అంటారు. మినిస్టర్ మేనల్లుడి సంబంధం ఆపేశావ్.. సెంట్రల్ మినిస్టర్ కూతురి కాబోయే భర్తని వేరే వారితో పెళ్లి చేశావ్ ఊరుకుంటావా.. ఇంకొ పది నిమిషాల్లో వెళ్లకపోతే చంపేస్తా అని అంటాడు. వెళ్లిపోతాం అని సుబ్బు, స్వరూప ఏడుస్తారు.
మ్యాడీ వరుణ్, లోహితలను తీసుకొని రూం కోసం వెతుకుతాడు. తన ఫ్రెండ్ మహేశ్ వాళ్ల ఇంటికి వెళ్తే మహేశ్ వాళ్ల ఇళ్లు ఇవ్వడం కుదరదు అని తరిమేస్తుంది. రెండు రోజులు వీళ్లిద్దరికి తల దాచుకోవడానికి సాయం చేయండి అని మ్యాడీ బతిమాలుతాడు. పెద్ద పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న పిల్లలు వీళ్లంతా మన పని అయిపోతుందిరా మనం బలి అయిపోతాం అని మహేశ్ వాళ్ల అమ్మ చెప్తుంది. మీ ఇంటి వాళ్లు ఒప్పుకోకపోతే ఏంటి ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లమని అంటుంది. ఇలా ఇరికించేసిందేంటని లోహిత అనుకుంటుంది. అయినా సంస్కారం లేకుండా లేచి పోయి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఏంటి అని తిడుతుంది. మ్యాడీ వాళ్లని తీసుకొని వెళ్లిపోతాడు.
లోహిత ఓ చోట కూర్చొని మ్యాడీ, వరుణ్ వాళ్లతో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే ఇలా రోడ్డున పడ్డాం అని ఏడుస్తుంది. వరుణ్‌తో మ్యాడీ త్వరలోనే మనం మన ఇంటికి వెళ్లిపోతాం బావ ఫీల్ అవ్వకు అని అంటాడు. ఇంతలో స్వప్న మ్యాడీకి కాల్ చేసి మధు వాళ్ల ఇంటిని గొడవ గురించి చెప్తుంది. మ్యాడీ వరుణ్‌తో మధు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ అంట మీరిద్దరూ ఏదైనా పీజీకి వెళ్లండి నేను వెళ్లి వస్తా అని మ్యాడీ వెళ్తాడు. మ్యాడీ వెళ్లే సరికి రౌడీలు సామాను విసిరేసి సుబ్బు వాళ్లని కొడుతుంటారు. మధుని నెట్టేస్తే మధుకి గోడ తగిలే టైంకి మ్యాడీ వెళ్లి ఫైట్ చేస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. రౌడీ మధుని పొడవబోతే మ్యాడీ చాక్ పట్టుకుంటాడు. మ్యాడీ చేతికి రక్తం వస్తుంది.
మధు లోపలికి తీసుకెళ్లి పసుపు పెడుతుంది. ఎవరు వాళ్లు ఎందుకు గొడవ చేశారు అని మ్యాడీ అడిగితే ఎవరో మినిస్టర్ పెళ్లి అని అంటున్నారు అని సుబ్బు చెప్తాడు. మ్యాడీ వాళ్లతో మా మమ్మీ వాళ్లు కోపంతో ఏదో చేసుకుంటారని అనుకొని తల్లికి కాల్ చేస్తాడు. నాగవల్లి మ్యాడీని ఇంటికి వచ్చేయమని అంటుంది. మ్యాడీ తల్లితో మధు వాళ్ల ఇంటికి రౌడీలను పంపారా అని అడిగితే అంత చీప్‌గా కనిపిస్తున్నామా నాన్న.. నువ్వు ఇంట్లో లేవమని మేం అంతా బాధగా ఉన్నాం అని అంటుంది. వరుణ్, లోహితల్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఇంటికి వస్తా..నువ్వు జాగ్రత్త డాడీని బాగా చూసుకో మమ్మీ అని మ్యాడీ ఫోన్ పెట్టేస్తాడు.
మధు ఏడుస్తూ నా వల్లే ఇదంతా అని అంటుంది. నీ తప్పు ఏం లేదు తల్లీ నేనే బావతో కావాలని వచ్చేశా అని మ్యాడీ అంటాడు. మీరు అంతా ఎక్కడున్నారు అని మధు అడిగితే హాస్టల్‌లో ఉన్నాం అని అంటాడు. అందరం కలిసి తప్పు చేశాం కదా మీరు అంతా కలిసి ఇక్కడికి వచ్చేయండి అని చెప్తుంది. సుబ్బు మ్యాడీ, మధుని వెళ్లమని కొత్త జంటని తీసుకొచ్చే లోపు ఇళ్లు సర్దేస్తాం అని అంటాడు. మధు, మ్యాడీ వెళ్తారు. మధు ఓ చోట స్కూటీ ఆపి పరుగున మెడికల్ షాపునకు వెళ్లి మందులు తీసుకొని మ్యాడీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మ్యాడీ మధు ఇద్దరూ ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















