Ammayi garu Serial Today October 7th: అమ్మాయిగారు సీరియల్: విరూపాక్షి, సూర్యల కెమిస్ట్రీ షురూ! రేపే కోమలి నిశ్చితార్థం! దీపక్ ప్రపోజల్!
Ammayi garu Serial Today Episode October 7th విరూపాక్షి మీద సూర్యకి పాజిటివ్ ఒపీనియన్ రావడం విరూపాక్షి చేసినట్లు అనాథాశ్రమాలకు సాయం చేయాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప తల్లితో ఇంత గొప్ప పని చేస్తూ మాకు ఒక్క మాట చెప్పలేదు అని అంటుంది. దానికి రాజు చేసిన సాయం అమ్మగారు చెప్పరు. కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలీదు అని అంటాడు. విరూపాక్షి ఎమోషనల్ అవుతూ పాతికేళ్ల క్రితం నేను ఒక అనాథగా మిగిలిపోయాను.. అప్పుడే అర్థమైంది అనాథలు కాలం వల్ల పుడతారు అని.. తల్లిదండ్రులతో చినిపోవడంతో కొందరు.. తల్లిదండ్రులు వదిలేయడం వల్ల కొందరు.. కట్టుకున్న భర్త వదిలేయడం వల్ల కొందరు అని తన గురించి చెప్తుంది.
సూర్యప్రతాప్ ఎమోషనల్‌గా చూస్తాడు. అనాథల కోసం ఏమైనా చేయాలి అనిపించింది అలా నా కూతురు కాకూడదు అనుకున్నా.. దేవుడి దయ వల్ల నా కూతురికి నా పరిస్థితి రాకూడదు. దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటా అని విరూపాక్షి రూపని దగ్గరకు తీసుకుంటుంది. దీపక్ విజయాంబికతో అత్తయ్య మాటలతో మామయ్యని మరి కాస్త కరిగించేసిందని అంటాడు. సూర్యప్రతాప్ లేచి విరూపాక్షిని చూసి వెళ్లిపోతాడు.
దీపక్ తల్లితో అత్తయ్య తప్పుడు మనిషి కాదేమో మంచిదేమో అని ఆలోచన పుడుతుంది. అత్తయ్య మామయ్యలు కలిసిపోవడానికి టైం దగ్గరయ్యేలా ఉందని అంటాడు. ఇంతలో దీపక్‌కి అన్‌నౌన్ నెంబరు నుంచి అశోక్ కాల్ చేస్తాడు. కోమలికి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. కోమలితో అశోక్ రేపు మన నిశ్చితార్థం మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు. కోమలి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. రేపు ఉదయం ఊరిలో నిశ్చితార్థం ఫిక్స్ చేశారని రమ్మని చెప్తాడు. కోమలి ఏం పర్లేదు అని ఏమైనా అవసరం అయితే విజయాంబిక, దీపక్‌లు చూసుకుంటారు అని అంటుంది. ఏం జరుగుతుంది ఈ టైంలో బయటకు వెళ్లడంఏంటి అని విజయాంబిక అడిగితే కచ్చితంగా వెళ్లాలి రేపు నా నిశ్చితార్థం అని కోమలి చెప్తుంది. మా అత్తయ్యా మామయ్య చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు నేను వెళ్లకపోతే రేపు పెళ్లే వద్దని అనేస్తారు.
విజయాంబిక వెళ్లొద్దు అని చెప్తే కోమలి అస్సలు ఒప్పుకోదు. ఏం చేద్దాం అని విజయాంబిక అనుకుంటుంది. రాజు, రూపలు కోమలి అంతు చూడాలి అనుకుంటారు. ఇంతలో చంద్ర ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకు సూర్యప్రతాప్ ఫండ్ ఇవ్వాలని అనుకున్నారని చెప్తాడు. రాజు, రూపలు ఏమైందని అడిగితే వదిన చెప్పిన మాటలకు అన్నయ్య మనసు కరిగింది అందుకే రాష్ట్రంలో అన్ని శరణాలయాలకు సాయం చేయాలని అనుకున్నారని చంద్ర చెప్తాడు. అమ్మని స్ఫూర్తిగా తీసుకొని నాన్న సాయం చేస్తున్నారన్నమాట అని రూప హ్యాపీగా ఫీలవుతుంది.
విరూపాక్షి గదిలో సూర్య చూపునకు అర్థమేంటి అని అనుకుంటుంది. ఇక రాజు, రూపలు రాష్ట్రంలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకు సూర్యప్రతాప్ సాయం చేస్తున్నారని చెప్తుంది. విరూపాక్షి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తుంది. సూర్య అని పిలుస్తుంది. సూర్యప్రతాప్ వెనక్కి తిరిగి భార్యని చూస్తాడు. విరూపాక్షి సూర్యకి థ్యాంక్స్ చెప్తుంది. అనాథాశ్రామానికి సాయం చేస్తూ గొప్ప పని చేస్తున్నావ్ అంటుంది. గొప్ప పని నా కంటే ముందు నువ్వు చేశావ్ అని సూర్యప్రతాప్ అంటాడు. ఈరోజు నువ్వు నాకు స్పెషల్‌గా కనిపిస్తున్నావ్ సూర్య థ్యాంక్స్ అని విరూపాక్షి చెప్పి వెళ్లిపోతుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి వైపు చూస్తూ ఉంటాడు.
దీపక్ కోమలిని తలచుకొని నేను నీ కోసం కలలు కంటుంటే నువ్వు వేరే వాడితో పెళ్లికి రెడీ అయిపోతావా అనుకుంటూ కోమలి దగ్గరకు వెళ్తాడు. నేను నిన్ను చాలా సార్లు కాపాడాను. ఇదంతా నేను నీ కోసం నీ మీద నాకు ఉన్న ప్రేమకోసం చేశాను.. ఇప్పుడు నువ్వు అశోక్‌తో నిశ్చితార్థం చేసుకుంటుంటే నా వల్ల కావడం లేదు రేపు నిశ్చితార్థం చేసుకోవద్దు వాడిని వదిలేయ్.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. కోమలి స్థానంలో మందారం వచ్చి మరి నన్నేం చేయమంటావ్‌రా అని దీపక్‌ని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















