Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ vs అంబిక: భూముల కోసం పోరాటం! పద్మాక్షి ప్లాన్ ఏంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 7th లక్ష్మీ తనని అడ్డుకుంటుందని అంబిక లక్ష్మీతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ రైతులు భూములు అమ్మకుండా అడ్డుకుంటుంది. ఫ్యాక్టరీ పెట్టడానికి ఊరిలో ఉన్న పొలాలు మొత్తం ఎందుకు సిటీ వదిలేసి ఈ ఊరు రావడం ఎందుకు.. ఆలోచించారా అని చెప్తుంది. వీర్రాజు ఊరి జనాన్ని ఒప్పిస్తాడు. మేమే కాదు భక్తవత్సలం గారు రెండు వందల ఎకరాలు ఇవ్వాలని అనుకున్నారు ఆయన్ను ముందు ఆపు అని వీర్రాజు లక్ష్మీని పంపుతాడు.
అంబిక పొలాలు వచ్చేలా నేను చూసుకుంటా మీరేం వర్రీ అవ్వొద్దని అంబిక చెప్తుంది. లక్ష్మీ రాగానే దాని సంగతి చూడాలని అంత కంటే ముందు మా పొలాల గురించి నాన్నతో మాట్లాడాలి అని అనుకుంటుంది. వెంటనే విహారి దగ్గరకు వెళ్లి పార్థసారథి ఊరిలో ఫ్యాక్టరీ కట్టాలని అనుకుంటున్నారని మనం కూడా మన భూములు అమ్మేద్దామని అంటుంది. మంచి ఐడియా అని విహారి అనడంతో ఇద్దరూ భక్తవత్సలం దగ్గరకు వెళ్తారు. అంబిక నాన్నతో 200 ఎకరాలు అమ్మేద్దామని అంటుంది. విహారి కూడా ఒప్పించాలని చూస్తాడు. అది మా ముత్తాతల ఆస్తి.. ఇవన్నీ మీకు సాధారణ ఆస్తుల్లా కనిపిస్తాయి కానీ నాకు అవి ఎమోషన్ నేను వాటిని అమ్మడానికి ఒప్పుకోను అని అంటాడు.
అంబిక అడ్డుకుంటుంది. నాన్న మనం ఈ ఊరి కోసం ఎంతో చేశాం వాళ్లు మాత్రం అన్నయ్య వదినని అవమానించి పంపేశారు. పాతికేళ్లు సంబంధం లేదు ఇప్పుడు కరువు అని మన దగ్గరకు వచ్చారు అని అంటుంది. పద్మాక్షి కూడా అమ్మేద్దామంటే మీరు దీన్ని ఆస్తిగా చూస్తున్నారు.. నేను దాన్ని జ్ఞాపకంగా చూస్తున్నాను. ఆ పొలాలు అమ్మే ప్రసక్తే లేదు అని అంటారు. మొత్తానికి ఇంట్లో ఆస్తి గురించి మాటా మాటా పెరుగుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి యమున హరికృష్ణని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా అయిందని అనుకుంటారు.
లక్ష్మీ పద్మాక్షి వాళ్లతో ఆ ఫ్యాక్టరీ కొనాలి అనుకున్న వారు డబుల్ రేటు ఇస్తామని అన్నారు.. అంటే దాని మధ్య ఏదో మతలబు ఉందని అనిపిస్తుందని అంటుంది. పంచాయితీలోనే తేల్చుకుందామని భక్తవత్సలం అంటారు. ఇక పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్లి సహస్రని చూసి చాలా బాధ పడుతుంది. విహారి మీద నువ్వు ప్రేమ పెంచుకుంటే వాడు ఆ లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు.. నీ గర్భసంచి తీసేశారు అంటే నువ్వు తట్టుకోగలవా.. అని పద్మాక్షి ఏడుస్తుంది. ఇంతలో సహస్ర లేచి కడుపు పట్టుకొని నొప్పి అని బాధ పడుతుంది. అమ్మని చూసి ఏమైంది అని అడుగుతుంది. ఎలా అయినా నీ కళ్లలో సంతోషం చూస్తానమ్మా.. నువ్వు కోరుకున్నది ఏమైనా నీకు దక్కేలా చేస్తా అని పద్మాక్షి అంటుంది. దానికి సహస్ర బావని కోరుకున్నా నువ్వు తగ్గి బావని నాకు ఇచ్చావ్ ఇంక నాకేం కావాలి అమ్మ అంటుంది.
సహస్ర చాలా హ్యాపీగా అందరూ వారసుడు వారసుడు అంటున్నారు. బావతో కలిసి నేను ఒక వారసుడిని కనేస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారని అంటుంది. ఇక సహస్ర కడుపు నొప్పి అని బాధ పడుతుంది. అంబిక లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్ష్మీని ఆపుతుంది. పని మనిషివి పనిమనిషిలా ఉండు మా విషయాల్లో దూరకు అని అంబిక అంటే ఈ మొత్తం కుట్రలో మీ వాటా ఎంత అమ్మ అని లక్ష్మీ అడుగుతుంది. పార్థసారథి గారు మీరు కలిసే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు అని అంటుంది. అంబిక షాక్ అయిపోతుంది. నేను ఆ పొలాలు అమ్మి తీరుతా అని అంబిక అంటే ఎవరూ కొనకుండా నేను చేస్తా మీరు చేస్తున్న ఈ కుట్ర నేను బయట పెడతా అని లక్ష్మీ అంటుంది. నీకు చేతనైంది చేసుకో అని అంబిక అనేస్తుంది.
యమున లక్ష్మీని పక్కకి తీసుకెళ్లి నువ్వేంటి అంబికతో అలా మాట్లాడుతున్నావ్.. తనేం చేసినా నువ్వు అంబిక జోలికి వెళ్లకు అని అంటుంది. రైతులు చాలా నష్టపోతారమ్మా.. విహారి గారి ఆశయం పోతుంది. నేను విహారి నీకు ఏం చేశాం మా గురించే ఆలోచిస్తావ్ అంటే మీరు సంతోషంగా ఉంటే నేను ఉంటాను అని లక్ష్మీ అంటుంది. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అని యమున అంటే.. నాకు ఏం బాధ లేదమ్మా నాకు ఉన్న ఒక్క కోరిక ఆశయం మీరు విహారి గారు సంతోషంగా ఉండాలి..విహారి గారు సహస్రమ్మతో హ్యాపీగా ఉండాలి.. ఇలా మీకు దగ్గరగా సేవ చేసే భాగ్యం నాకు ఉంటే చాలు అని లక్ష్మీ అంటుంది. యమున లక్ష్మీని హగ్ చేసుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















